Wednesday, July 22, 2026
HomeLATESTDhanush: రాజకీయ ఎంట్రీ ఇస్తున్న హీరో ధనుష్.. జెండా వైరల్!

Dhanush: రాజకీయ ఎంట్రీ ఇస్తున్న హీరో ధనుష్.. జెండా వైరల్!

Dhanush: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రాజకీయ ఎంట్రీ ఇస్తున్నారా అని అనుమానాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ఒక జెండా కూడా వైరల్ గా మారింది.

on
- Advertisement -banner Ad

Dhanush: తెలుగు, తమిళ ప్రేక్షకులకు హీరో ధనుష్ గురించి, ఆయన యాక్టింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో, వైవిద్యమైన పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అలాంటి ధనుష్ పేరు సడన్ గా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల Kollywood Hero Dhanush political entry news viral  అభిమాన సంఘం ఆవిష్కరించిన ఒక అధికారిక జెండా సినీ ఇండస్ట్రీలో, అటు తమిళ రాజకీయాలలో సరికొత్త చర్చలకు దారితీస్తోందన్నట్లుగా వినిపిస్తోంది. ముఖ్యంగా హీరో ధనుష్ పొలిటికల్ ఎంట్రీ పై పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.. వాటి గురించి చూద్దాం.

ధనుష్ రాజకీయ ఎంట్రీ ఇస్తున్నారా..

సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న ఫోటో విషయానికి వస్తే ధనుష్ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నట్టు కనిపిస్తోంది. అంతే కాకుండా ధనుష్ వెనుక ఎరుపు తెలుపు రంగులు కలయికలో కలిగిన ఒక జెండా కూడా కనిపిస్తోంది. ఈ సరికొత్త డిజైన్ సేవా సంఘాలకు గుర్తుల కంటే రాజకీయ శైలిని కలిగి ఉండడమే ఇక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతేకాకుండా కేవలం జెండా రూపకల్పనకే పరిమితం కాకుండా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు సేవా కార్యక్రమాలను చేపట్టాలని ధనుష్ అభిమానుల సంఘం నేతలకు పిలుపునివ్వడం గమనార్హం.

- Advertisement -
Advertisement

also read:Mega 158:బాబీ-చిరంజీవి కాంబోలో మరో మాస్ బాంబ్.. మెగా 158తో మరోసారి చిరంజీవి సెన్సేషన్!

విజయ్ దారిలో నడవబోతున్నారా?

తమిళనాడు రాజకీయాలలో నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ దళపతి ఈ ఏడాది తమిళనాడు ఎన్నికలలో పోటీ చేయగా భారీ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ధనుష్ కూడా ఫాన్స్ క్లబ్ నెట్వర్క్ కూడా అదే దారిలో నడుస్తోందా అనే అనుమానాలు కూడా ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. హీరో విజయ్ మొదట తన అభిమాన సంఘాల ద్వారానే క్షేత్రస్థాయిలో తన బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత తన పార్టీని కూడా ప్రకటించారు. ఇప్పుడు ధనుష్ కూడా అదే విధంగా ముందుకు వెళుతూ వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని పార్టీని ప్రకటిస్తారేమో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

also read:Sreemukhi:యాంకర్ శ్రీముఖి పెళ్లి బజ్.. లవర్‌తో మ్యారేజ్‌పై ఆసక్తికర అప్డేట్!

అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు?

అయితే ఈ విషయం పైన ధనుష్ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి అధికారికంగా ప్రకటన చేయలేదు. ప్రస్తుతం పలు సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ధనుష్ కేవలం అభిమానుల గుర్తింపు కోసమే ఈ జెండాను ఆవిష్కరించారా లేక ఏదైనా లాంగ్ టర్మ్ పొలిటికల్ స్కెచ్ ఉందా అనే విషయం తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ న్యూస్ కోలీవుడ్ పరిశ్రమలో తెగ హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -
Advertisement

 

View this post on Instagram

 

A post shared by Simply Mollywood (@simply.mollywood)

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you