Anchor Jhansi:ఝాన్సీ అందరికీ బాగా తెలిసిన వ్యక్తి. యాంకరింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఎంతోమంది యాంకర్లు ఉన్నా కూడా ఝాన్సీ యాంకరింగ్ స్టైల్‌ను ఇష్టపడే వాళ్లు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. తన స్టైల్, తన వే ఆఫ్ టాకింగ్, పద్ధతిగా ఉండే బిహేవియర్ అన్నీ అభిమానులకు ఎంతో ఇష్టం. అయితే యాంకర్ ఝాన్సీ(Anchor Jhansi) గురించి ఎప్పటికప్పుడు వివాదాలు కూడా వైరల్ అవుతూనే ఉంటాయి. మరి ముఖ్యంగా ఆమె వ్యక్తిగత విషయాలు నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంటాయి.
వ్యక్తిగత జీవితంపై ఎప్పటికప్పుడు చర్చలు:
నటుడు జోగి నాయుడిని వివాహం చేసుకున్న ఆమె, కొన్నేళ్ల తర్వాత విభేదాల కారణంగా ఇద్దరూ విడిపోయారు. దీనికి సంబంధించి ఇప్పటికీ ఆమె సోషల్ మీడియాలో హరాకోరా ట్రోలింగ్‌కు గురవుతూనే ఉంటుంది. అయితే ఝాన్సీ మాత్రం అలాంటివి పెద్దగా పట్టించుకోదు. తనను నిజంగా ఇష్టపడే వాళ్లను ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటుంది. విడాకుల కోసం పోరాడిన సమయంలో తన జీవితంలో ఎంతో కష్టంగా గడిచిన పీరియడ్ గురించి కూడా ఝాన్సీ పలు ఇంటర్వ్యూలలో తెలిపారు.
సినీ ఇండస్ట్రీలో కూడా మోసపోయానన్న ఝాన్సీ:
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. వ్యక్తిగత జీవితంలోనే కాదు, సినీ ఫీల్డ్‌లో కూడా తనను చాలామంది మోసం చేశారని ఆమె మాటలను బట్టి తెలుస్తోంది. కొన్ని టీవీ షోలకు యాంకరింగ్ చేసిన తనను, కొన్నిసార్లు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా యాంకరింగ్ నుంచి తప్పించి వేరే యాంకర్‌ను పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని ఆమె గుర్తు చేసుకున్నారు.
“రెండు రోజులు షూటింగ్ చేశాక సినిమానే తీసేశారు”. అంతేకాదు, ఒక టాప్ హీరోతో సినిమాలో నటించే అవకాశం వచ్చిందని ఆనందపడి సంబరాలు చేసుకున్నానని, రెండు రోజులు షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తనను ఆ సినిమా నుంచి తీసేశారని యాంకర్ ఝాన్సీ బయటపెట్టింది. ఆ సమయంలో తాను ఎంతో ఆవేదన చెందానని తెలిపింది. అంతేకాదు, తాను పెట్టుకున్న శాపం బాగానే వాళ్లకు తగిలినట్లుందని కూడా చెప్పుకొచ్చింది. “ఆ హీరో, దర్శకుడు ఇప్పటికీ కోలుకోలేదు”.”ఇంతవరకు ఆ హీరో కానీ, దర్శకుడు కానీ కోలుకోలేదు. కేవలం నేను పెట్టిన శాపం వల్లే కాదు… అది చెత్త సినిమా కావడం వల్ల కూడా వాళ్ల కెరీర్లు ఇంకా కోలుకోలేదు” అంటూ ఝాన్సీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ALSO READ:Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆపరేషన్ పూర్తి!
సోషల్ మీడియాలో కొత్త చర్చ:
“ఆడదాని ఉసురు ఊరికే పోదు” అని పెద్దవాళ్లు అంటుంటారు. దానికి ఇదే ఒక నిదర్శనం అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. యాంకర్ ఝాన్సీ చాలా నీతి, నిజాయితీగా వర్క్ చేస్తారని, ఒకరికి నష్టం చేకూర్చే పనులు ఎప్పుడూ చేయరని ఆమె అభిమానులు చెబుతున్నారు. “ఆ దేవుడు ఆమె పక్షాన ఉన్నాడు కాబట్టే ఇప్పటికీ ఆమె తన కాళ్ల మీద తాను నిలబడి జీవితాన్ని ముందుకు తీసుకెళ్తోంది” అంటూ ప్రశంసిస్తున్నారు.
ఆ హీరో ఎవరు..? ఆ డైరెక్టర్ ఎవరు..?:
అయితే ఝాన్సీ మాత్రం ఆ హీరో ఎవరు? ఆ దర్శకుడు ఎవరు? ఆ సినిమా ఏది? ఏ కారణంగా తనను సినిమా నుంచి తీసేశారనే విషయాలను మాత్రం బయటపెట్టలేదు. దీంతో సోషల్ మీడియాలో మరోసారి కొత్త చర్చ మొదలైంది. “ఆ డైరెక్టర్ ఎవరు?”, “ఎందుకు ఇలా చేసి ఉంటాడు?”, “ఆ హీరో ఎవరు?” అంటూ నెటిజన్లు తమదైన రీతిలో గెస్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.




