Tuesday, August 25, 2026
HomeLATESTAllu Arjun:హమ్మయ్య.. బన్నీ నెత్తి మీద నుంచి పెద్ద భారం దించేసిన లోకేష్.. థ్యాంక్స్ బ్రో..!

Allu Arjun:హమ్మయ్య.. బన్నీ నెత్తి మీద నుంచి పెద్ద భారం దించేసిన లోకేష్.. థ్యాంక్స్ బ్రో..!

Allu Arjun:లోకేష్ కనగరాజ్ తీసుకున్న కీలక నిర్ణయం అల్లు అర్జున్‌కు భారీ ప్లస్‌గా మారిందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నిర్ణయం వారి కాంబినేషన్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

on
- Advertisement -banner Ad

Allu Arjun:టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. ‘రాకా’ అంటూ ఈ సినిమాకు నామకరణం చేశారు. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. షూటింగ్‌ను త్వరితగతిన పూర్తి చేయడానికి చిత్ర బృందం చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇది పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌పై చర్చ:

ముఖ్యంగా ఖైదీ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న లోకేష్, అదే సినిమాతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)కి కూడా శ్రీకారం చుట్టారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అనంతరం విక్రమ్ సినిమాను కూడా ఈ యూనివర్స్‌లో భాగంగానే తెరకెక్కించారు. ఇటీవల లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ సినిమా ఆశించినంత హిట్ అందుకోలేకపోయింది.

- Advertisement -
Advertisement

బన్నీ సినిమా LCUలో భాగమా?

ప్రస్తుతం లోకేష్ అల్లు అర్జున్‌(Allu Arjun)తో తన సినిమా గురించి పూర్తి కాన్సన్‌ట్రేషన్ చేస్తున్నాడు. అయితే ఈ చిత్రాన్ని కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగానే తెరకెక్కిస్తున్నాడా అనే చర్చలు అభిమానుల్లో జోరుగా సాగుతున్నాయి. అయితే ఇన్‌సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, బన్నీతో తెరకెక్కించే సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కు సంబంధించినది కాదని తెలుస్తోంది. ఇది పూర్తిగా కొత్త కథ అని, ఈ కథను ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఎవరూ తెరకెక్కించలేదని, ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ లోకేష్ ఈ కథను తెరకెక్కిస్తున్నాడని సమాచారం.

also read:Akhil:మాజీ వదినమ్మకు భారీ జలక్ ఇచ్చిన అఖిల్..సమంతకి బిగ్ షాక్..?

- Advertisement -
Advertisement

ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్న కారణం:

అంతేకానీ అల్లు అర్జున్ సినిమా మాత్రం లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కు సంబంధమే లేదని తెలుస్తుండటంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో కాన్సెప్ట్‌లు అన్నీ ఒకే విధంగా ఉంటాయి. బన్నీతో కూడా అదే విధంగా చేస్తే, తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి సినిమాలు ఎంచుకుంటాడు అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.

లోకేష్ నిర్ణయం బన్నీకి ప్లస్?:

అల్లు అర్జున్ ఏది కోరి లోకేష్‌కు ఛాన్స్ ఇచ్చాడు అంటే, ఏదో స్పెషల్ టాలెంట్ చూసే ఉండి ఉంటాడు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి లోకేష్ తీసుకున్న ఒక నిర్ణయం అల్లు అర్జున్ నెత్తి మీద ఉన్న భారం దించేసినట్లయింది. ఇక అల్లు అర్జున్ హ్యాపీగా తన కొత్త కథతో, ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా, కొత్త ఫీలింగ్‌తో, ఫ్రెష్ లుక్‌తో కనిపించొచ్చు. ఫ్యాన్స్ కూడా కొత్తగా ఏముంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తారు.

- Advertisement -
Advertisement

also read:OTT Movie: గుమ్మడికాయ వెనుక దాగిన భయంకర రహస్యం..హారర్ అభిమానులను వణికిస్తున్న ఓటీటీ థ్రిల్లర్!

కొత్త కథపై భారీ అంచనాలు:

మళ్లీ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమని చెబితే అదే సూత్రం, అదే కంటిన్యుటీ, అదే పార్ట్-3 అనే విధంగా టాక్ వచ్చేసేది. లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయం అల్లు అర్జున్ కెరీర్‌కు బిగ్ బూస్ట్ ఇచ్చిందని సినీ ప్రముఖులు అంటున్నారు. అల్లు అర్జున్ ‘రరాకా ‘ సినిమా పూర్తి అయిన తర్వాత లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you