Tuesday, July 21, 2026
HomeLATESTTV:స్టేజ్‌పైనే సుధీర్ షర్ట్ కాలర్ పట్టుకున్న అనిల్ రావిపూడి..!

TV:స్టేజ్‌పైనే సుధీర్ షర్ట్ కాలర్ పట్టుకున్న అనిల్ రావిపూడి..!

TV:'డ్రామా జూనియర్స్' తాజా ప్రోమోలో దర్శకుడు అనిల్ రావిపూడి, సుడిగాలి సుధీర్ ఒకరి కాలర్ ఒకరు పట్టుకున్న సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

on
- Advertisement -banner Ad

TV:బుల్లితెరపై వినోదానికి కొత్త ఊపు తెచ్చిన “డ్రామా జూనియర్స్ షో” తాజా ప్రోమో సోషల్ మీడియాలో సంచలన హీట్ పెంచేస్తుంది. ఇందులో దర్శకుడు అనిల్ రావిపూడి , యాంకర్ సుడిగాలి సుధీర్ ఒకరి చొక్కా మరొకరు పట్టుకున్న సన్నివేశం ప్రేక్షకులలో ఆసక్తిని పెంచింది. అయితే ఇది ఎలాంటి వివాదం కాదు పూర్తిగా వినోదం కోసం రూపొందించిన కామెడీ సెగ్మెంట్ అని ప్రోమో చూస్తేనే అర్థమవుతుంది.

ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకుంటున్న డ్రామా జూనియర్స్:

జీ తెలుగు ఛానల్ లో ప్రసారమవుతున్న “డ్రామా జూనియర్స్” కార్యక్రమం చిన్నారుల అద్భుతమైన నటన కామెడీ స్కిట్స్ తో ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ షోలో దర్శకుడు అనిల్ రావిపూడి, నటుడు శ్రీకాంత్, మాజీ మంత్రి రోజా జడ్జీలుగా వ్యవహరిస్తుండగా సుడిగాలి సుధీర్ హోస్ట్ గా సందడి చేస్తున్నారు. ప్రతి ఎపిసోడ్లో వినోదంతో పాటు సరదా సంభాషణలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటాయి.

- Advertisement -
Advertisement

స్కిట్లో భాగంగా కాలర్ పట్టుకున్న అనిల్ రావిపూడి:

తాజాగా విడుదలైన ప్రోమోలో (TV) ఓ ప్రముఖ సినిమా సన్నివేశాన్ని స్ఫూఫ్ గా ప్రదర్శించారు. ఆ సమయంలో సుధీర్ సరదాగా అనిల్ రావిపూడిని ఉద్దేశించి ..”మీ సినిమాల నాకో పాత్ర ఇవ్వండి” అని కోరాడు.. దానికి వెంటనే స్పందించిన అనిల్ రావిపూడి..” నిన్ను ఇప్పటికే హీరోగా చేసాం.. ఇప్పుడు మళ్లీ ఫ్రెండ్ పాత్ర చేస్తావా..?” అంటూ సరదాగా సుధీర్ షర్ట్ కాలర్ పట్టుకుని నటించాడు. ఈ సన్నివేశం స్టేజిపై నవ్వులు పూయించింది.

ALSO READ:Chiranjeevi:చిరంజీవి అభిమానులకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్..?

- Advertisement -
Advertisement

రోల్స్ రివర్స్ సుధీర్ కౌంటర్ :

అంతటితో ఆగకుండా రోల్స్ రివర్స్ అంటూ అదే సన్నివేశాన్ని సుధీర్ తన స్టైల్ లో రిపీట్ చేశాడు. ఈసారి అనిల్ రావిపూడి చెప్పినట్లే డైలాగ్ చెబుతూ ఆయన చొక్కా పట్టుకున్నాడు. ఒక్కసారిగా అక్కడ ఉన్న జడ్జిలు ప్రేక్షకులు షాక్ అయిపోయారు. క్షణం పాటు నిజంగానే ఇద్దరి మధ్య ఏదైనా జరిగిందా అన్న ఉత్కంఠను ప్రోమో సృష్టించింది.

ALSO READ:OTT:ఈ శుక్రవారం ఓటీటీలో అలరించబోతున్న చిత్రాలు, సిరీస్ లు ఇవే!

- Advertisement -
Advertisement

ఉత్కంఠ వద్దే ముగిసిన ప్రోమో:

అయితే అసలు విషయం ఏమిటో చూపించకుండా.. ప్రోమోను అక్కడే ముగించారు. దీంతో తర్వాత ఏమైందో తెలుసుకోవాలి అంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందేననే ఆసక్తి ప్రేక్షకులలో పెరిగింది. కామెడీ టైమింగ్స్ సరదా నటనతో అనిల్ రావిపూడి, సుడిగాలి సుధీర్ చేసిన ఈ సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you