Tuesday, July 21, 2026
HomeLATESTNaga Chaitanya:నాగార్జున కెరీర్ సక్సెస్‌కు కారణం ఇదే.. చైతన్య చెప్పిన ఆసక్తికర విషయం!

Naga Chaitanya:నాగార్జున కెరీర్ సక్సెస్‌కు కారణం ఇదే.. చైతన్య చెప్పిన ఆసక్తికర విషయం!

Naga Chaitanya:లెనిన్ సినిమా విజయోత్సవ వేడుకలో హీరో నాగచైతన్య తన తండ్రి నాగార్జున గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

on
- Advertisement -banner Ad

Naga Chaitanya:అక్కినేని అఖిల్ తాజాగా నటించిన సినిమా “లెనిన్” ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా విజయోత్సవ వేడుకలో పాల్గొన్న హీరో నాగచైతన్య తండ్రి నాగార్జున(Nagarjuna) గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంట్లో నాగార్జున ఎలా ఉంటారో తనకు అఖిల్ కి మాత్రమే తెలుసు అని.. బయట వాళ్లకి పెద్దగా తెలియకపోవచ్చు అని చెప్పుకొచ్చారు. ఒకసారి ఏదైనా లక్ష్యం పెట్టుకుంటే దాని పూర్తి చేసే వరకు ఆయన వెనక్కి తగ్గరని చెప్పారు. ఇటీవల “లెనిన్” సినిమా విషయంలో కూడా అదే పట్టుదలను తాను దగ్గరుండి చూసానని వెల్లడించారు. చైతన్య మాట్లాడుతూ..” కథ విన్న వెంటనే .. ఇది పెద్ద కథ, ఎంతో కష్టమైన పాత్ర, విభిన్నమైన ప్రేమ కథ అని తాను నాగార్జునతో చెప్పానన్నారు. అయితే నేను చేసి చూపిస్తా అని ధైర్యంగా సమాధానం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు”. అదే తనకు పెద్ద స్ఫూర్తిగా నిలిచింది అని పేర్కొన్నారు.

నాగార్జున కెరియర్లో ధైర్యమైన అడుగులు :

నాగార్జున కెరీర్ ను ప్రస్తావించిన నాగచైతన్య(Naga Chaitanya).. ఆయన ఎప్పుడూ కొత్త తరహా కథలను ఎంచుకోవడానికి వెనుకాడ లేదన్నారు. అలాంటి సాహసోపేత నిర్ణయాల వల్ల “శివ”, “గీతాంజలి”, “అన్నమయ్య”, “నిన్నే పెళ్ళాడుతా” వంటి చిరస్మరణీయ చిత్రాలు ప్రేక్షకులకు అందాయని చెప్పారు. నటుడుగా కొత్తదనం కోసం ప్రయత్నించే తండ్రిని తాను ఎప్పుడూ ఆదర్శంగా తీసుకుంటానని వెల్లడించారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Chiranjeevi :35 ఏళ్ల తర్వాత తన జాన్ జిగిడి దోస్త్ కి ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి..!?

నాగవంశీ పై ప్రశంసలు:

నిర్మాత నాగవంశీ గురించి కూడా నాగచైతన్య సరదాగా మాట్లాడారు. “ప్రేమమ్” సినిమా సమయంలో స్టేజీపై మాట్లాడడానికి సిగ్గుపడే వ్యక్తి ఇప్పుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో అందరినీ ఆకట్టుకుంటున్నారని అన్నారు. సినిమా వాణిజ్య ఫలితం ఎలా ఉన్న ఒక హీరోను ప్రేక్షకులకు ముందుకి ఎలా తీసుకెళ్లాలో నాగ వంశీకి బాగా తెలుసు అని ప్రశంసించారు.

- Advertisement -
Advertisement

ALSO READ:TV:స్టేజ్‌పైనే సుధీర్ షర్ట్ కాలర్ పట్టుకున్న అనిల్ రావిపూడి..!

దర్శకుడు కిషోర్ కు అభినందనలు :

ఈ సందర్భంగా దర్శకుడు కిషోర్ ని కూడా నాగచైతన్య అభినందించారు. “సవ్యసాచి” సమయంలో పరిచయమైన కిషోర్ ఇప్పుడు దర్శకుడుగా విజయాన్ని అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇది ఆయన రెండో సినిమా అయినప్పటికీ సక్సెస్ మీట్ నిర్వహించే స్థాయికి చేరుకోవడం సంతోషకరమైన విషయం అంటూ పేర్కొంటూ చిత్ర బృందం మొత్తం ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని ఆకాంక్షించారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you