Saturday, July 25, 2026
HomeLATESTOTT : ఈ శుక్రవారం ఓటీటి& థియేటర్ విడుదలయ్యే చిత్రాలు

OTT : ఈ శుక్రవారం ఓటీటి& థియేటర్ విడుదలయ్యే చిత్రాలు

OTT :ఈ వారం థియేటర్లలో విడుదలైన తాజా సినిమాలతో పాటు ప్రముఖ ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్‌కు వచ్చిన కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌ల పూర్తి జాబితా ఇదే. ఈ వీకెండ్ ఏం చూడాలా అని ఆలోచిస్తున్నవారికి బెస్ట్ గైడ్.

on
- Advertisement -banner Ad

OTT :శుక్రవారం వచ్చిందంటే సినీ ప్రేక్షకులకు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌ల పండుగ మొదలైనట్టే. ఈ వారం కూడా థియేటర్లతో పాటు ప్రముఖ ఓటీటీ (OTT )వేదికల్లో పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. భారీ సినిమాల నుంచి చిన్న చిత్రాల వరకు, దేశీయంతో పాటు అంతర్జాతీయ కంటెంట్ వరకు ఈ వీకెండ్ వినోదానికి కొదవ లేకుండా ఉంది.

థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు:

ఈ వారం థియేటర్లలో తమిళ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. టాలీవుడ్ నుంచి కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ జంటగా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ కూడా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

- Advertisement -
Advertisement

ALSO READ:Review: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ రివ్యూ: ప్రేమలోని నిజమైన బాధను చూపించిన చిత్రం!

ఇవే కాకుండా ఈ వారం విడుదలవుతున్న ఇతర చిత్రాలు:

*ది ఇండియా స్టోరీ (కాజల్ అగర్వాల్)
*హే చికితా
*చంద్రప్పన్
*కాగితం పడవలు

- Advertisement -
Advertisement

ALSO READ:Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ..!

ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్న పలు భాషలకు చెందిన సినిమాలు, సిరీస్‌లు ఇవే:

ఇక ఓటీటీ విషయానికి వస్తే, ఈ వారం కూడా పలు భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ‘ది ట్రూతర్స్’, ’72 అవర్స్’, ‘ముసాఫిర్ కేఫ్’, ‘కాన్ సిటీ’ జూలై 24 నుంచి అందుబాటులోకి రానున్నాయి. జియో హాట్‌స్టార్‌లో ‘స్టువర్ట్ ఫెయిల్స్ టు సేవ్ ది యూనివర్స్’, ‘ది డెవిల్ వియర్స్ ప్రాడా-2’, ‘స్టార్ ట్రెక్: స్ట్రేంజ్ న్యూ వరల్డ్స్’ జూలై 24న విడుదల కానుండగా, ‘బ్లీచ్: థౌజండ్ ఇయర్ బ్లడ్ వార్’ జూలై 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

- Advertisement -
Advertisement

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఆదర్శ్ బాల్ విద్యాలయ’, ‘ఈగో రామన్’ జూలై 24న విడుదలవుతాయి. జీ5లో ‘అగ్ ఆయీ అహో ఆయీ’, ‘ప్రేమ్ షాట్స్’, సోనీ లివ్‌లో ‘పల్లిచట్టంబి’, లయన్స్‌గేట్ ప్లేలో ‘ప్రొటెక్టర్’, ఆపిల్ టీవీ ప్లస్‌లో ‘ది డింక్’, సన్ నెక్స్ట్‌లో ‘సీక్రెట్ ఆఫ్ కళింగ’, మనోరమ మ్యాక్స్‌లో ‘ట్రిపుల్ డెక్కర్’ కూడా ఇదే రోజున ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి.

ఈ వీకెండ్ వినోదానికి ఫుల్ ప్యాకేజ్:

భారీ సినిమాలు, ప్రేమకథలు, థ్రిల్లర్లు, అంతర్జాతీయ వెబ్‌సిరీస్‌లు, యానిమే కంటెంట్ ఇలా అన్ని రకాల వినోదం ఈ వారాంతంలో ప్రేక్షకుల కోసం సిద్ధంగా ఉంది. థియేటర్‌లో సినిమా చూడాలనుకున్నా, ఇంట్లోనే ఓటీటీలో కొత్త కంటెంట్‌ను ఆస్వాదించాలనుకున్నా ఈ వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఏ మాత్రం కొదవ ఉండదనే చెప్పాలి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you