Allu Arjun: సినీ సెలెబ్రిటీలకు, రాజకీయాలకు మంచి అనుబంధం ఉంది. చాలామంది సెలబ్రిటీలు పొలిటికల్ పరంగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన వారు ఉన్నారు. అలా ఇప్పటికే నందమూరి బాలకృష్ణ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీనియర్ ఎన్టీఆర్, జయలలిత, ఎంజీఆర్ , తమిళ్ నటుడు విజయ్ సీఎం కూడా అయ్యారు.. వీరే కాకుండా కొంతమంది సెలబ్రిటీలు ఉన్నారు. మరి కొంతమంది ఇండస్ట్రీ నుంచి పరోక్షంగా కొన్ని పార్టీలకు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది రాజకీయాలలోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్(Allu Arjun) కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్తలు వైరల్ గా మారుతున్నాయి.
అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై మేనేజర్ స్పందన..
అందుకు కారణం అల్లు అర్జున్ మామయ్య రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీలో ఉండడం.. ఈ ఊహాలకు మరింత బీజం వేసింది. అల్లు అర్జున్ పొలిటికల్ వార్తల పైన ఆయన టీం కాని, అల్లు అర్జున్ కాంపౌండ్ నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. కానీ తాజాగా అల్లు అర్జున్ మేనేజర్ శరత్ చంద్ర నాయుడు ఇటీవలే ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఈ విషయం పైన మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.. శరత్ చంద్ర నాయుడు మాట్లాడుతూ.. తాను ఒక వార్తకు సోషల్ మీడియాలో డైరెక్ట్ గానే రిప్లై ఇచ్చానని తెలిపారు.
ALSO READ:Siri Hanmanth: చీరకట్టులో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన సిరి హనుమంత్!
మరో పదేళ్లు నో రెస్ట్..
అవన్నీ కూడా ఫేక్ న్యూస్.. ఆయన ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకరు. అలాంటి ఆయన ఇప్పుడు సరైన సమయంలో ఇన్ని సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు ? అసలు రావాల్సిన అవసరం ఏముంది? అంటూ తెలిపారు. ప్రస్తుతం ఆయన దృష్టి మొత్తం సినిమాల వైపే ఉంది. ఆయన ది బిగ్గెస్ట్ స్టార్ ఇండియాలో ఒకరు. వాళ్ళ మామయ్య ద్వారా వస్తారు అనే వార్తలు కూడా కేవలం రూమర్స్ మాత్రమే అంటూ తెలియజేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తున్న సినిమాల దృష్ట్యా చూస్తే సుమారుగా 10 ఏళ్ల పాటు అల్లు అర్జున్ బిజీగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఆయన మేనేజర్ శరత్ చంద్ర నాయుడు తెలిపారు.
ALSO READ:Siri Hanmanth: చీరకట్టులో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన సిరి హనుమంత్!
అల్లు అర్జున్ సినిమాలు..
దీంతో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారనే వార్తలకు చెక్ పడిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాకా అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటించడమే కాకుండా మరి కొంతమంది హీరోయిన్స్ కూడా నటిస్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్ లోనే ఈ సినిమా చాలా విభిన్నంగా ఉండబోతుందని వినిపిస్తున్నాయి.




