Jana Nayagan:కోలీవుడ్ స్టార్ హీరో, తమిళ సీఎం విజయ్ దళపతి నటించిన చిత్రం జననాయగన్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ హెచ్ వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించగా.. నిన్నటి రోజున భారీ అంచనాల మధ్య ఈ సినిమా పలు భాషలలో విడుదలైంది. అయితే ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుంది. విజయ్ చివరి సినిమా అంటూ వార్తలు వినిపించడంతో విజయ్ అభిమానులు కూడా ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్స్ తో కూడా అదరగొట్టేసినట్లు వినిపిస్తోంది.
జన నాయగన్ మూవీ నటీనటుల రెమ్యూనరేషన్..
తాజాగా జననాయగన్(Jana Nayagan) సినిమాలోని నటీనటుల రెమ్యూనరేషన్ కి సంబంధించి ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో హీరోగా నటించిన విజయ్ రూ. 220 నుంచి 275 కోట్ల రూపాయల వరకు తీసుకున్నట్లు వినిపిస్తోంది అలాగే విలన్ గా నటించిన బాబి డియోల్ ఈ సినిమా కోసం రూ.8నుంచి రూ.10 కోట్ల రూపాయలు, హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే రూ.3 కోట్ల నుంచి 6 కోట్ల రూపాయలు, ప్రకాష్ రాజ్ రూ.5 కోట్లు, ప్రియమణి 3 కోట్ల రూపాయలు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ 3 కోట్ల రూపాయలు, నరైన్ రూ. 2.5 కోట్ల రూపాయలు, మమితా బైజు రూ.60 లక్షల నుంచి కోటి రూపాయలకు పైగా తీసుకున్నట్లు సమాచారం. డైరెక్టర్ హెచ్ వినోద్ కుమార్ ఈ సినిమా కోసం 25 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ 10 కోట్ల రూపాయలకు పైగా తీసుకున్నారు.
also read:Tollywood:ఎయిర్ పోర్ట్ లో గ్లామర్ స్టైల్ తో ఆకట్టుకున్న టాలీవుడ్ హీరోయిన్!
టికెట్ బుకింగ్స్ లో ఊహించని రికార్డ్..
జననాయగన్ చిత్రం తమిళనాడులోని వెయ్యికి పైగా స్క్రీన్ లలో విడుదల చేశారు. ముందస్తు టికెట్ల బుకింగ్ లోనే 40 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది ఈ సినిమా. విజయ్ సినిమాలకు రిటైర్మెంట్ కూడా ప్రకటించారు. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా విధులను నిర్వహిస్తూ..పూర్తిగా రాజకీయాల వైపు దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాలోని టైటిల్ కార్డు కూడా అభిమానులను చాలా ఆశ్చర్యపరిచినట్లు తెలుస్తోంది.
also read:Ramayana:వార్నీ..లాస్ట్ మినిట్ లో రామాయణ ట్రైలర్ ని ఎందుకు పోస్ట్ పోన్ చేసింది ఇందుకా..!
విజయ్ రాజకీయంగా చూస్తే.. తమిళనాడులో అన్ని విషయాలలో కూడా చాలా చురుకుగా కనిపిస్తున్నారు. తమిళనాడులో ఎన్నో వ్యవస్థలలో మార్పులు తీసుకు వస్తున్నట్లు వినిపిస్తున్నాయి. తన పార్టీకి, నేతలకు ఎటువంటి చెడ్డ పేరు రాకుండా పాలిస్తున్నారు. అంతేకాకుండా ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్షపడేలా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వినిపిస్తున్నాయి.




