Saturday, July 25, 2026
HomeLATESTRamayana:వార్నీ..లాస్ట్ మినిట్ లో రామాయణ ట్రైలర్ ని ఎందుకు పోస్ట్ పోన్ చేసింది ఇందుకా..!

Ramayana:వార్నీ..లాస్ట్ మినిట్ లో రామాయణ ట్రైలర్ ని ఎందుకు పోస్ట్ పోన్ చేసింది ఇందుకా..!

Ramayana:భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'రామాయణ' చిత్రం ట్రైలర్ విడుదల చివరి నిమిషంలో వాయిదా పడింది. సాంకేతిక కారణాలు, విజువల్ ఎఫెక్ట్స్ ఫైనల్ టచ్‌లు, గ్లోబల్ రిలీజ్ ప్లాన్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

on
- Advertisement -banner Ad

Ramayana:భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్రతిష్టాత్మక ఇతిహాస చిత్రం “రామాయణ” ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ విజువల్ ఎపిక్ కి సంబంధించిన ట్రైలర్ ని నేడు గ్రాండ్గా విడుదల చేయాలని చిత్ర బృందం ముందుగా ప్రకటించింది. అయితే అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో చివరి నిమిషంలో ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

నిర్మాత నమిత్ మెల్హోత్రా వివరణ:

ట్రైలర్ విడుదల వాయిదా పై వస్తున్న సందేహాలకు నిర్మాత నమిత్ మిల్హోత్ర సోషల్ మీడియా ద్వారా స్పందించారు. భారతీయ సంస్కృతి పురాణ వైభవాన్ని ప్రపంచ ప్రేక్షకులకు మరింత ప్రభావంతంగా పరిచయం చేయాలనే లక్ష్యంతో చిత్ర బృందం కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

- Advertisement -
Advertisement

also read:TVశుక్రవారం టీవీలో సినిమాల సందడి..ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలుసా?

సోనీ పిక్చర్స్ తో అంతర్జాతీయ భాగస్వామ్యం :

ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయాలని ఉద్దేశంతో ప్రముఖ హాలీవుడ్ సంస్థ “సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్” తో భాగస్వామ్యం కుదిరినట్లు తెలిపారు. ఈ సహకారంతో రామాయణ(Ramayana) కేవలం పాన్ ఇండియా చిత్రంగా కాకుండా గ్లోబల్ మార్కెట్ ను లక్ష్యంగా చేసుకుని విడుదల చేయనున్నట్లు చెప్పారు.

- Advertisement -
Advertisement

also read:OTT : ఈ శుక్రవారం ఓటీటి& థియేటర్ విడుదలయ్యే చిత్రాలు

త్వరలోనే కొత్త తేదీ ప్రకటన :

సుమారుగా 4000 కోట్ల రూపాయల బడ్జెట్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు మొదటి భాగాన్ని ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారు రెండవ భాగం వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా చిత్ర బృందం ప్లాన్ చేసింది.ప్రస్తుతం ట్రైలర్ విడుదలకు సంబంధించిన కొత్త తేదీని ఖరారు చేసే పనిలో చిత్ర బృందం ఉందని నిర్మాత వెల్లడించారు. అన్ని అంశాలను సమన్వయం చేసిన తర్వాత అధికారికంగా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. దీంతో అభిమానులు కొంతకాలం మరింత వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రామాయణ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలకపాత్రలు పోషిస్తూ ఉండడంతో పాటు అత్యధిక విజువల్ ఎఫెక్ట్స్, భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమా రూపొందుతుంది అందుకే ఈ సినిమా పై అంత హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి..!!

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you