OTT:మలయాళ సినిమాలు ఈ మధ్యకాలంలో విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తక్కువ బడ్జెట్ తో సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా కూడా వీటికి మంచి ఆదరణ లభిస్తోంది. అందుకే చాలామంది హీరోలు, దర్శక నిర్మాతలు వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమా కథలను తెరకెక్కిస్తూ సక్సెస్ అవుతున్నారు. అలాంటి సినిమాలకు ఓటీటిలో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు అలాంటి కోవలో మరో ఆసక్తికరమైన మూవీ ఓటీటీలో రాబోతోంది.
ఓటిటిలోకి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్..
అదే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ ‘ఉయిర్ ‘(Uyir ). ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమయ్యింది. ముఖ్యంగా ఈ సినిమా కథను కూడా ఒక రియల్ పోలీస్ అందించడంతో ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. జూన్ 2026 థియేటర్లలో విడుదలయిన ఈ సినిమా మంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటిటి ఆడియన్స్ ని కూడా ఎంటర్టైన్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఆగస్టు 4వ తేదీన ఉయిర్ చిత్రం జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఎం పద్మకుమార్ తెరకెక్కించారు.
ALSO READ:Jana Nayakudu:విజయ్ ‘జననాయకుడు’ రెండో రోజు షాక్.. కలెక్షన్లు సగానికి పడిపోయాయి
స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళంతో పాటుగా తెలుగు, తమిళ్ , కన్నడ, హిందీ వంటి భాషలలో ఓటీటీ(OTT)లో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు సైతం ఈ సినిమాని ఇంట్లోనే చూడవచ్చు. ఈ సినిమా విజయంలో స్క్రీన్ ప్లే చాలా కీలకమైన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అలాగే గతంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న రియల్ పోలీస్ అధికారి షాజి మారడ్ ఈ చిత్రానికి కథ అందించారు. పోలీస్ శాఖలో విచారణ ఎలా సాగుతుంది. అత్యంత సహజంగా చూపించే ప్రయత్నాన్ని చేసినట్లు తెలుస్తోంది.
ALSO READ:Jabardasth:”ఆ ఇద్దరి రహస్యాలు నాకు తెలుసు”.. జబర్దస్త్ నరేష్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ!
ఉయిర్ మూవీ స్టోరీ..
అలాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో రోషన్ మాథ్యూ నటన కూడా అద్భుతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా చూసినవారు ఇప్పటికే ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు బైజు సంతోష్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమా స్టోరీ కేరళలోని కోజికోడ్ జిల్లా కోడిపల్లి ప్రాంతం నుంచి మొదలవుతుంది. ఒక పాడుబడిన బావిలో గుర్తుతెలియని మృతదేహం లభిస్తుంది. అయితే అది హత్య? లేక ఆత్మహత్య అని అనుమానంతో పోలీసులు దర్యాప్తును మొదలు పెడతారు. పోలీసులు దర్యాప్తులో ముందుకు వెళ్లే కొద్దీ సీక్రెట్స్ ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఈ సినిమా కథలో ఊహించని మలుపు తిరుగుతుంది. అంతేకాదు చివరిలో ఈ సినిమాలో ఎవరూ ఊహించని క్లైమాక్స్ ఉంటుంది.




