Dhruv Vikram:తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా పేరు సంపాదించిన విక్రమ్ ప్రతి సినిమాలో కూడా కొత్తదనం కోసం ప్రయత్నం చేస్తుంటారు. అలా ఇప్పటికీ ఎన్నో చిత్రాలలో నటించిన విక్రమ్ తన కుమారుడు ధృవ్ విక్రమ్ ను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఆయన కూడా తమిళంలో యంగ్ హీరోగా మంచి పేరు సంపాదించారు. తాజాగా ధృవ్ విక్రమ్ హీరోయిన్ అనుపమతో లవ్ బ్రేకప్ అయిందనే విషయం కూడా వైరల్ గా మారింది. ఈ విషయంపై ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. ఇటువంటి తరుణంలో తాజాగా మరోసారి ధృవ్ విక్రమ్ చిక్కుల్లో పడ్డట్టుగా వినిపిస్తోంది.
ఫిలిం ఛాంబర్ లో ధృవ్ విక్రమ్ పై కంప్లైంట్..
ధృవ్ విక్రమ్ (Dhruv Vikram)పై తమిళ ఫిలిం ఛాంబర్ లో అధికారికంగా ఫిర్యాదు నమోదు అయినట్లుగా వినిపిస్తోంది. ఒప్పందం ప్రకారం జరగాల్సిన ప్రాజెక్టును కాదు అని, ఇతర సినిమాలు పట్టాలెక్కించడంతో కంప్లైంట్ ఇచ్చినట్లుగా సమాచారం. ఈ పిటిషన్ ని నీలాద్రి ప్రొడక్షన్, పెన్ స్టూడియో సంయుక్తంగా దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ముందస్తుగానే ఒప్పందం కుదుర్చుకొని భారీ మొత్తంలో అడ్వాన్స్ తీసుకున్న తర్వాత తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మరో నిర్మాణ సంస్థకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఆ సదరు నిర్మాతలు తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేశారు. ఈ నిర్మాతలు ప్రముఖ డైరెక్టర్ రమేష్ వర్మ సారథ్యంలో సినిమా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు.
ALSO READ:Varanasi:హమ్మయ్య..రాజమౌళి నెత్తిన పెద్ద భారం దిగ్గిపోయింది..వారణాసికి లైన్స్ క్లియర్..!
అడ్వాన్స్ తీసుకొని మరో నిర్మాణ సంస్థకు ప్రాధాన్యత..
ఈ సినిమాలో నటించడానికి ధృవ్ విక్రమ్ కోటి రూపాయల వరకు అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. అంతేకాకుండా ప్రీ ప్రొడక్షన్ పనులలో భాగంగా పాటల స్వరకల్పన, భారీ సెట్స్ కి నిర్మాణం అలాగే నటీనటులు, టెక్నీషియన్స్ కి కూడా అడ్వాన్స్ ఇచ్చారట నిర్మాతలు. కానీ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి సదరు నిర్మాతలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ధృవ్ విక్రమ్(DV 4)మైత్రి మూవీస్ మేకర్స్ బ్యానర్లో కరణ్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయడాన్ని అధికారికంగా ప్రకటించారు.
ALSO READ:OTT: పోలీస్ రాసిన స్టోరీ.. ఓటీటిలోకి మరో మలయాళ థ్రిల్లర్ మూవీ!
అసలు ఏం జరిగిందంటే?
వాస్తవంగా డైరెక్టర్ రమేష్ వర్మ దర్శకత్వంలో (DV4) సినిమా రావాలి మైత్రి మూవీస్ ప్రాజెక్టుని DV5 గా రూపుదిద్దుకోవాలని నిర్మాతలు తెలియజేస్తున్నారు. ఈ విషయం పైన ధృవ్ విక్రమ్ వివరణ కోరగా మైత్రి మూవీస్ నిర్మాణం పూర్తి అయిన తర్వాతే రమేష్ ప్రాజెక్టు చేస్తానని చెప్పడంతో నిర్మాతలు కూడా అసంతృప్తిని తెలియజేశారు. దీనివల్ల తమ పైన చాలా వడ్డీల భారం పడుతుందని, మైత్రి మూవీ సినిమా పూర్తి అయ్యేవరకు తాము వేచి ఉండలేమంటూ.. తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తమను మోసం చేశారంటూ ఫిలిం ఛాంబర్ ని ఆశ్రయించారు. దీంతో ఈ విషయంపై ధృవ్ విక్రమ్ పై ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై ఎవరు స్పందిస్తారో చూడాలి.




