Sai Pallavi:భారతీయ సినీ పరిశ్రమలో సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్లలో సాయి పల్లవి మొదటి స్థానంలో నడుస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు. గ్లామర్ కంటే కథ , పాత్రకు ప్రాధాన్యం ఇస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న ఆమె ప్రతి సినిమాను ఎంతో ఆచితూచి ఎంపిక చేసుకుంటారు, అందుకే సాయి పల్లవి నటించిన ప్రతి చిత్రంపై ప్రేక్షకులలో ప్రత్యేక ఆసక్తి నెలకొంటుంది.
కధే తొలి ప్రాధాన్యం:
సాయి పల్లవి(Sai Pallavi) సినిమాల ఎంపికలో ఎలాంటి రాజీ పడని విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. పాత్రకు ప్రాధాన్యం లేకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే వెంటనే రిజెక్ట్ చేసేస్తుంది. ఇది అందరికీ తెలుసు.కథ తనను ఆకట్టుకోకపోతే ఎంత పెద్ద బ్యానర్ అయినా, ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా.. ఆమె తిరస్కరించిన సందర్భాలు బోలెడు ఉన్నాయి. అయితే ఆమెను నిర్మాతలు లేదా దర్శకులు తిరస్కరించిన సందర్భాలు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తాయి. అందుకే ఆమెను ఒప్పించాలంటే ముందుగా బలమైన కథతో వెళ్లాల్సిందేనని సినీ వర్గాలు చెబుతుంటాయి.
also read:Pooja Hegde:పూజా హెగ్డే ఇల్లు చూశారా?
రామాయణకు భారీ పారితోషకం:
ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “రామాయణ”లో సాయి పల్లవి కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె సీత పాత్రను పోషిస్తున్నారు. బి టౌన్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా కోసం సాయి పల్లవి తన కెరియర్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తుంది అంటూ టాక్ వినిపిస్తుంది. సాధారణంగా సాయిపల్లవి ఒక్కొక్క సినిమాకి మూడు లేదా నాలుగు కోట్లు డిమాండ్ చేస్తూ ఉంటుంది.
also read:Ram Charan:హీరో రామ్ చరణ్ కు సర్జరీ.. ఎందుకంటే?
అయితే ఈ సినిమా కోసం మాత్రం ఏకంగా 20 కోట్లు తీసుకున్నారట. ఇది రెండు భాగాలకు కలిపి అంటూ తెలుస్తుంది. అంటే మొదటి భాగం కోసం 10 కోట్లు రెండో భాగం కోసం 10 కోట్లు. టోటల్ 20 కోట్లు పారితోషకం అందుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సాయి పల్లవి పేరు మరోసారి ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది. భారతీయ సినీ పరిశ్రమలో ఒక్కో సినిమాకు పది కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ జాబితాలో ఇప్పుడు సాయి పల్లవి కూడా చేరిపోయింది. కమర్షియల్ చిత్రాలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రను ఎంచుకుంటూ ఈ స్థాయికి చేరుకోవడం నిజంగా గ్రేట్ అంటున్నారు అభిమానులు. అంతేకాదు నిజంగా ఈ సమాచారం నిజమైతే మాత్రం కథ , ప్రాధాన్య చిత్రాలను ఎంచుకుంటూ అత్యధిక పారితోషకం అందుకుంటున్న భారతీయ హీరోయిన్లలో సాయి పల్లవి మరో అరుదైన రికార్డ్ సృష్టించినట్లే అవుతుంది.




