Tuesday, July 28, 2026
HomeLATESTOTT Crime: మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్‌లతో తిరిగొస్తున్న క్రైమ్ థ్రిల్లర్ సీజన్ 2.. ఈసారి మరింత...

OTT Crime: మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్‌లతో తిరిగొస్తున్న క్రైమ్ థ్రిల్లర్ సీజన్ 2.. ఈసారి మరింత డేంజర్!

OTT Crime:ససికుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'వదంది సీజన్ 2: ది మిస్టరీ ఆఫ్ మణి' అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్టు 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

on
- Advertisement -banner Ad

OTT Crime:క్రైమ్, ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్ కథలను ఆసక్తిగా వీక్షించే ఓటీటీ ప్రేక్షకులకు అమెజాన్ ప్రైమ్ వీడియో మరో బిగ్ సర్ప్రైజ్ అందించబోతుంది. తమిళంలో రూపొంది తెలుగులోనూ మంచి ఆదరణ పొందిన ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ వెబ్ సిరీస్ ‘వదంది: ది ఫేబుల్ ఆఫ్ వెలోని’ రెండో సీజన్ విడుదలకు సిద్ధమైంది. ఈ సిరీస్ ఆగస్టు 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు సహా పలు భాషలలో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

వదంతుల వెనక దాగి ఉన్న నిజం .. ఇదే కథ ప్రత్యేకత :

“వదంది” అనే తమిళ పదానికి “వదంతి” లేదా “పుకారు” అనే అర్థం. తొలి సీజన్లో కన్యాకుమారి నేపథ్యంలో వెలోని అనే యువతీ అనుమానస్పద హత్యకు గురవుతుంది. ఆ కేసును చేదించే బాధ్యతను పోలీస్ అధికారి వివేక్ తీసుకుంటాడు . విచారణ సాగే కొద్దీ వెలుగులోకి కొత్త కొత్త విషయాలు.. వాస్తవాలు రావడం కథను కీలక మలుపు తిప్పుతుంది. వాస్తవాలు, సమాజంలో వ్యాపించే వదంతులు, మహిళపై ఏర్పడే అపోహలను కథ ఎంతో సహజంగా చూపించింది సస్పెన్స్ తో పాటు సామాజిక అంశాలను కూడా మిళితం చేయడం ఈ సిరీస్ కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.

- Advertisement -
Advertisement

ALSO READ:OTT:’చెన్నై లవ్ స్టోరీ’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

ఈసారి హీరో మార్పు.. కొత్త కథతో సీజన్ 2 :

“విక్రమ్ వేద”.. “సుడల్” వంటి విజయవంతమైన ప్రాజెక్టులను అందించిన పుష్కర్-గాయత్రి తమ వాల్‌వాచర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఆండ్రూ లూయిస్ సృష్టించి దర్శకత్వం వహిస్తున్న ఈ సీజన్‌లో (OTT Crime)కొత్త కేసుతో కథ ముందుకు సాగనుంది. తొలి భాగంలో పోలీస్ అధికారి వివేక్ పాత్రలో నటించిన ఎస్.జే. సూర్య స్థానంలో ఈసారి ప్రముఖ తమిళ నటుడు శశికుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దీంతో రెండో సీజన్‌పై మరింత ఆసక్తి నెలకొంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Posani :బాలయ్య సినిమా ఫ్లాప్ కారణం నేనే.. పోసాని కామెంట్స్..!

ఆగస్టు 7 నుంచి ప్రైమ్ వీడియోలో:

మొదటి సీజన్ ఉత్కంఠ భరితమైన కథనం , బలమైన నటన, ఆకట్టుకునే స్క్రీన్ ప్లే తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు రెండో సీజన్ కూడా అదే స్థాయిలో భావోద్వేగాలు.. సామాజిక కోణాలతో ప్రేక్షకులను అలరించిందని మేకర్స్ చెబుతున్నారు. ‘వదంది 2: ది మిస్టరీ ఆఫ్ మణి’ అనే పేరుతో ఈ సిరీస్ ఆగస్టు 7 నుంచి అమెజాన్ ప్రైమ్ లో తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి రానుంది. క్రైమ్ ధ్రిలర్ ని ఇష్టపడే వారికి ఇది మరొక ఆసక్తికరమైన ఓటిటి రిలీజ్ గా మారనుంది..!

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you