OTT:ప్రతి వారం మాదిరిగానే ఈసారి కూడా ఓటిటి వేదికలపై పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. తెలుగు చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలు, కొత్త వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ లోకి వచ్చేసాయి . అయితే ఈ వారం విడుదలయ్యే కంటెంట్ కంటే ముందే ఒక తెలుగు క్రైమ్ థ్రిల్లర్, వెబ్ సిరీస్ ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తుంది. నిజ జీవితంలో సంచలనం సృష్టించిన ఓ కార్పొరేట్ ఘటనకు ఆధారంగా చేసుకొని రూపొందిన ఈ సిరీస్ ప్రస్తుతం మంచి ఆదరణ పొందుతుంది.
నిజ ఘటనల స్ఫూర్తితో కథ :
దేశవ్యాప్తంగా ఒకప్పుడు పెద్ద చర్చకు దారి తీసిన “ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్” వ్యవహారం గురించి చాలామందికి గుర్తుండే ఉంటుంది. అంత ఈజీగా మర్చిపోయే వ్యవహారం కూడా కాదు. కేవలం రూ.251 కే అత్యాధునిక స్మార్ట్ ఫోన్ అందిస్తామని ప్రకటించి ఒక స్టార్టప్ సంస్థ భారీ సంచలనం సృష్టించింది. ఈ ప్రకటనతో లక్షలాది మంది వినియోగదారులు ఆసక్తి చూపగా కోట్ల రూపాయల బుకింగ్ లు కూడా నమోదయ్యాయి. అయితే ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
also read:Ramayana trailer:విజువల్ వండర్ గా రామాయణం ట్రైలర్..!
స్కాం వెనుక అసలు నిజాలు:
ఈ సంఘటనల స్ఫూర్తితో రూపొందిన “ఆజాది 501” వెబ్ సిరీస్ లో కార్పొరేట్ ప్రపంచంలో జరిగే మోసాలు, ప్రజల విశ్వాసాన్ని ఎలా దుర్వినియోగం చేశారని అంశాలను ఆసక్తికరంగా చూపించారు. వేగంగా సాగే కథనం, ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తాయి. మొత్తం 6 ఎపిసోడ్లతో రూపొందిన ఈ సిరీస్లో ప్రతి ఎపిసోడ్ కథనం మరింత ఉత్కంఠ బలంగా ముందుకు తీసుకెళుతుంది. ప్రస్తుతం ఆహా ఓటీటీలో(OTT) స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ లో “సై” సినిమా ఫేమ్ శశాంక్ ప్రధాన పాత్రలో నటించారు.
also read:Jai Krishna:ఘట్టమనేని వారసుడి వెండితెర ఎంట్రీ.. శ్రీనివాస మంగాపురం రివ్యూ & రేటింగ్
ఇక ఆయనతో పాటు డి.గీతా భాస్కర్, రవి వర్మ, హర్షవర్ధన్, రాఖీకృష్ణ తదితరులు కీలకపాత్రలో కనిపించి మెప్పించారు. దర్శకుడు వంశీరంగి శెట్టి నిజ సంఘటనలకు థ్రిల్లింగ్ ట్రీట్మెంట్ ఇస్తూ కథను ఆసక్తికరంగా తెరకెక్కించారు. వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన కథలు ఇష్టపడే వారికి ఈ “ఆజాది 501” మంచి ఎంపికగా నిలుస్తుంది. కార్పొరేట్ మోసాల వెనక దాగి ఉన్న నిజాలను థ్రిల్లింగ్ స్టైల్ లో చూపించి ప్రేక్షకులను ఆసక్తికర అనుభూతి అందిస్తుంది. ఈ వారం ఓటీటీలో చూడదగ్గ క్రైమ్ వెబ్ సిరీస్లలో “ఆజాది 501” తప్పక చోటు దక్కించుకునే అవకాశం ఉంది..!!




