Ramayana:భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న “రామాయణం”(Ramayana) చిత్రం ట్రైలర్ ఎట్టకేలకు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒకవైపు అద్భుతమైన విజువల్స్ మరొక పక్క భారీ గ్రాఫిక్స్.. దానికి తగ్గట్టే భారీ తారగాణం నటీనటులకు ప్రశంసలు ఎక్కువగా వస్తున్నాయి . మరోవైపు ట్రైలర్ విడుదల చేసిన సమయం వ్యూహం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
బ్రహ్మ ముహూర్తంలో ట్రైలర్ విడుదల:
మొదట ఈ ట్రైలర్ ని జూలై 24న విడుదల చేయాలి అని భావించినప్పటికీ పలు కారణాలతో వాయిదా పడింది. చివరకు జులై 30న తెల్లవారుజామున 4: 15 నిమిషాలకు బ్రహ్మముహూర్తంలో విడుదల చేశారు. ఈ సమయాన్ని ఆధ్యాత్మికతో ముడిపెట్టి మేకర్స్ ప్రచారం చేసినప్పటికీ సినీ వర్గాలలో మాత్రం మరో కోణం చర్చకు దారితీసింది.
లీక్ ల కారణంగానే ముందస్తు విడుదల:
హాలీవుడ్ చిత్రం ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ప్రదర్శన సందర్భంగా థియేటర్లలో ఈ ట్రైలర్ను చూపించాలని నిర్మాతలు భావించినట్లు ప్రచారం జరిగింది. అయితే ట్రైలర్ లోని కొన్ని క్లిప్స్ ముందుగానే సోషల్ మీడియాలో లీక్ కావడంతో మరింత నష్టం జరగకుండా అధికారికంగా డిజిటల్ ప్లాట్ఫార్మర్లలో విడుదల చేసినట్లు సినీవర్గాల్లో అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
also read:OTT: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్కామ్..ఇప్పుడు ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్‌గా!
గ్లోబల్ ప్రేక్షకులపై ఫోకస్.. దేశ అభిమానుల అసంతృప్తి:
భారత్ లో తెల్లవారుజామున విడుదల చేసిన సమయంలో అమెరికాలో ప్రైమ్ టైం కు అనుకూలంగా ఉండడంతో గ్లోబల్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఈ వ్యూహాన్ని అనుసరించినట్లు చర్చ సాగుతుంది. నిర్మాత నమిత లెళోత్రా కూడా ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలని లక్ష్యాన్ని గతంలోనే వెల్లడించారు. అయితే భారతీయ ప్రేక్షకుల భావోద్వేగాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రామాయణం భారతీయులకు కేవలం కథ కాదు కోట్లాదిమంది విశ్వాసానికి ప్రతీక అనే భావనతో పలువురు స్పందిస్తున్నారు.
also read:Ramayana trailer:విజువల్ వండర్ గా రామాయణం ట్రైలర్..!
ట్రైలర్ కు మిశ్రమ స్పందన:
ట్రైలర్ లోని విజువల్స్.. ఏఆర్ రెహమాన్–హాన్స్ జిమ్మర్ అందించిన నేపథ్య సంగీతం రన్బీర్ కపూర్, సాయి పల్లవి , యష్ పాత్ర రూపకల్పనకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే కొన్ని సీజీఐ షాట్లు పాత్రల డిజైన్ విషయంలో సోషల్ మీడియాలో నెగిటివ్ గా ట్రోలింగ్ స్టార్ట్ అయింది. మొత్తానికి చూస్తే సినిమా కంటే ట్రైలర్ విడుదల వ్యూహమే ప్రస్తుతం ఎక్కువ చర్చకు కారణం అవుతుంది. విడుదల సమయం పై వచ్చిన విమర్శలు గ్లోబల్ మార్కెట్ లక్ష్యంపై సాగుతున్న చర్చల మధ్య ఈ చిత్రం విడుదల వరకు ఆసక్తి కొనసాగడం ఖాయం అనిపిస్తుంది.




