Wednesday, August 5, 2026
HomeLATESTGaurav Khanna:"బాడీలో కి బుల్లెట్ లు"..ఓరి మీ దుంపల్ తెగ..ఇవేం టాస్కులు రా బాబు..!

Gaurav Khanna:”బాడీలో కి బుల్లెట్ లు”..ఓరి మీ దుంపల్ తెగ..ఇవేం టాస్కులు రా బాబు..!

Gaurav Khanna:బిగ్‌బాస్ హిందీ విజేత గౌరవ్ ఖన్నా ఖత్రోన్ కె ఖిలాడీ 15లో ప్రమాదకరమైన స్టంట్ చేస్తూ తీవ్ర గాయాల పాలయ్యానని వెల్లడించారు.

on
- Advertisement -banner Ad

Gaurav Khanna:టెలివిజన్ రియాలిటీ షోలు ప్రేక్షకులకు ఉత్కంఠ భరితమైన వినోదాన్ని అందిస్తూ ఉంటాయి. అయితే కొన్ని షోలల్లో కంటెస్టెంట్లు ఎదుర్కొనే ప్రమాదాలు, శారీరక ఇబ్బందులు తరచూ చర్చనీయాంసంగా మారుతూ ఉంటాయి. తాజాగా ప్రముఖ హిందీ నటుడు, బిగ్బాస్ రియాలిటీ షో విజయ్ గౌరవ్ ఖన్నా పాల్గొన్న ఓ స్టంట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది

‘ఖత్రోన్ కే ఖిలాడీ 15’లో కఠిన పరీక్ష:

సిఐడి, అనుపమ వంటి సీరియల్స్ తో గుర్తింపు పొందిన గౌరవ్ ఖన్నా ఇటీవల “ఖత్రోన్ కే ఖిలాడీ 15” లో పాల్గొన్నారు . దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లో చిత్రీకరించిన ఈ సీజన్ కలర్స్ టీవీ తో పాటు జియో హాట్స్టార్ లో ప్రసారమవుతుంది .ఈ షోలో పలువురు ప్రముఖ టీవీ నటీనటులు ప్రమాదకరమైన స్టంట్ లలో తమ ప్రతిభను నిరూపించుకునేందుకు పోటీపడుతున్నారు.

- Advertisement -
Advertisement

also read:Babu Mohan”41 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడు ఇలా జరగలేదు”.. జబర్దస్త్‌లో బాబు మోహన్ కామెంట్స్ వైరల్..!

రబ్బర్ బుల్లెట్లతో పెయిన్ స్టంట్:

హోస్ట్ రోహిత్ శెట్టి (Gaurav Khanna)ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక టాస్క్ లో గౌరవ్ ఖన్నా కరణ్ వాహి, షగుణ్ శర్మ, విశాల్ ఆదిత్య సింగ్ పాల్గొన్నారు. కంటెస్టెంట్లు కేవలం భద్రతా సామగ్రిలో భాగంగా స్పైన్ ప్రొటెక్టర్ ధరించి రబ్బర్ బుల్లెట్ల దెబ్బలను భరించాల్సి వచ్చింది. చివరి వరకు నిలబడిన వారే విజేతగా నిలిచేలా టాస్క్ రూపొందించారు. మొదట షగుణ్ వైదొలగగా, అనంతరం గౌరవ్ ఖన్నా కూడా పోటీ నుంచి తప్పుకున్నారు. చివరికి విశాల్ ఆదిత్య సింగ్, కరణ్ వాహి మాత్రమే నిలబడ్డారు.

- Advertisement -
Advertisement

also read:Pradeep rawat:సినీ ఇండస్ట్రీలో విషాదం.. టాలీవుడ్ విలన్ మృతి!

గాయాల వీడియో పై నెటిజన్ల ఆగ్రహం :

టాస్క్ ముగిసిన తర్వాత గౌరవ్ ఖన్నా తన వీపుపై ఏర్పడిన గాయాల వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు, రబ్బర్ బుల్లెట్ల దెబ్బలతో వీపు మొత్తం ఎర్రటి మచ్చలతో కనిపించడం అభిమానులను కలవరపరిచింది. తన కెరీర్లో ఇంత బాధాకరమైన అనుభవం ఇదేనని గౌరవ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు కరణ్ వాహి కూడా ఈ సీజన్ అత్యంత కఠినంగా అనిపించింది అంటూ తెలిపారు. స్టంట్ సమయంలో ప్రతి కంటెస్టెంట్ శరీరాన్ని దాదాపు 40 రబ్బరు బులెట్లు తాకినట్లు హోస్ట్ వెల్లడించారు. ఈ వీడియో వైరల్ కావడంతో టిఆర్పి ల కోసం ఇలాంటి ప్రమాదకరమైన టాస్కులు నిర్వహించడంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే కంటెస్టెంట్ల భద్రతకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని షో నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది..!!

- Advertisement -
Advertisement

https://www.instagram.com/reel/Dbke4GTIgjK/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you