Nookaraju:జబర్దస్త్ తో గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ నూకరాజు తాజాగా తన వ్యక్తిగత జీవితంలోని కొన్ని భావోద్వేగా సంఘటనలను అభిమానులతో పెంచుకున్నారు. ఓ టాక్ షోలో పాల్గొన్న ఆయన కుటుంబం ఎదుర్కొన్న కష్టాల నుంచి తనను నమ్మించి మోసం చేసిన వ్యక్తి వరకు పలు విషయాలను వెల్లడించారు. యాంకర్ వర్షా హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో కార్యక్రమంలో పాల్గొన్న నూకరాజు (Nookaraju) తన బాల్యం గురించి మాట్లాడారు. తండ్రి మద్యానికి బానిస కావడంతో కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది అని తెలిపార. తండ్రి మద్యం మానేయాలని ఎన్నోసార్లు కోరానని ఒక దశలో భయపెట్టేందుకు పోలీసులను కూడా ఇంటికి తీసుకొచ్చారు అని చెప్పారు. చివరకు ప్రేమగా ఓర్పుతో చెప్పి ఆయనతో మద్యం పూర్తిగా మాన్పించగలిగామని వెల్లడించారు.
ఇండస్ట్రీ లోకి అలా వచ్చా:
తాను పూరి గుడిసెలో పెరిగానని ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని నూకరాజు తెలిపారు. ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొన్న తర్వాతే ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని పొదుపు చేయడం కూడా అంతే అవసరమని చెప్పారు. భవిష్యత్తు ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదని ప్రతి ఒక్కరు సేవింగ్స్ అలవాటు చేసుకోవాలని సూచించారు.
also read:Gaurav Khanna:”బాడీలో కి బుల్లెట్ లు”..ఓరి మీ దుంపల్ తెగ..ఇవేం టాస్కులు రా బాబు..!
13 లక్షలు ఇచ్చి మోసపోయా:
టాక్ షోలో యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందించిన నూకరాజు.. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే ఒక తోటి ఆర్టిస్ట్ చేతిలో మోసపోయానని వెల్లడించారు. ఆ వ్యక్తి తన చెల్లెలికి అత్యవసర చికిత్స అవసరమని చెప్పడంతో ఏమాత్రం ఆలోచించకుండా దాదాపు రూ.13 లక్షలు ఇచ్చానన్నారు. ఎలాంటి రాతపూర్వక ఒప్పందం లేకుండానే నమ్మకంతో సహాయం చేశానని తెలిపారు. అయితే ఆ తర్వాత ఆ డబ్బు తిరిగి రాలేదని తన నమ్మకాన్ని దెబ్బతీశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చిన్నప్పుడు డబ్బు కోసం ఎంత కష్టపడ్డానో తెలుసు. కాబట్టి కష్టాల్లో ఉన్న వారికి వెంటనే సహాయం చేయాలని అనిపిస్తుందని నూకరాజు చెప్పారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి…!!
also read:Babu Mohan”41 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడు ఇలా జరగలేదు”.. జబర్దస్త్‌లో బాబు మోహన్ కామెంట్స్ వైరల్..!
అలాగే ప్రస్తుతం నూకరాజు స్టార్ మాలో ప్రసారమవుతున్న కొన్ని షోలలో మాత్రమే కనిపిస్తున్నారు. అంతేకాకుండా పలు రకాలు ప్రైవేట్ ఆల్బమ్లలో కూడా కనిపిస్తూ బాగానే పేరు సంపాదించారు నూకరాజు. తన తోటి లేడీ కంటెస్టెంట్ ఆసియాతో త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు నూకరాజు.




