Jabardasth:ప్రేమను వ్యక్తపరిచేందుకు చాలామంది చాలా రకాల టెక్నిక్స్ ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది ప్రేమించిన వ్యక్తికి తమ ప్రేమను పరిచయం చేయడానికి బీచ్లు, రెస్టారెంట్లు, పర్యాటక ప్రాంతాలు చూస్ చేసుకుంటారు. ఇంకొంతమంది ఆధ్యాత్మిక క్షేత్రాలను ఎంచుకుంటారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మాత్రం కొంచెం వైల్డ్ గా ఉంటుంది. తన ప్రేమను ప్రపోజ్ చేయడానికి ఏకంగా స్మశాన వాటికకే తను ప్రేమించిన అమ్మాయిని తీసుకెళ్లాడు ఒక కమెడియన్ .ఆ విషయాన్ని స్వయానా వాళ్లే బయటపెట్టారు. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ గా మారింది. వాళ్ళు మరెవరో కాదు “జబర్దస్త్(Jabardasth) కమెడియన్ రాకింగ్ రాకేష్, ఆయన భార్య సుజాత”. తాను ప్రేమించిన జోర్దార్ సుజాతకు అర్ధరాత్రి స్మశానవాటికలోనే ప్రేమను వ్యక్తం చేశాడు రాకింగ్ రాకేష్. ఈ విషయాన్ని సుజాత ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
స్మశాన వాటికలోనే ప్రపోజ్:
ఇంటర్వ్యూలో సుజాత మాట్లాడుతూ..”మా పరిచయం పూర్తిగా యాదృచ్ఛికంగా జరిగింది. మేము కలిసి పని చేస్తూ మంచి ఫ్రెండ్స్ గా ఉన్నాం. అయితే ఆ తర్వాత ఒకరోజు రాత్రి సమయంలో రాకేష్ నన్ను స్మశాన వాటికకు తీసుకెళ్లాడు . అసలు అక్కడికి ఎందుకు తీసుకొచ్చాడో అర్థమే కాలేదు. అప్పుడే అక్కడ రాకేష్ తన ప్రేమను ప్రపోజ్ చేస్తూ “నువ్వంటే నాకు ఇష్టం మనమిద్దరం పెళ్లి చేసుకుంటే జీవితాంతం కలిసి ఉండవచ్చు” అని ప్రపోజ్ చేశాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకుంది”.
also read:TV:ఈరోజు తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్న సినిమాల జాబితా..!
మొదటి జోక్ అనుకున్న సుజాత :
సరదాగా రాకేష్ (Rocking Rakesh)ఆటపట్టిస్తున్నాడు ఏమో అని.. జోక్ చేస్తున్నాడేమో అనుకునిందట సుజాత. అతను చెప్పిన మాటలను తాను సీరియస్ గా తీసుకోలేదని.. ఇదంతా సరదాగా చెప్పిన జోక్ అనుకున్నాను అని పెద్దగా పట్టించుకోలేదు అని చెప్పుకువచ్చింది సుజాత. ఆ సమయంలో అతని ప్రేమ నిజమని తనకు అస్సలు అనిపించలేదని కూడా చెప్పుకొచ్చింది.
also read:Preity Zinta:పదహారేళ్ల తర్వాత.. ప్రీతి జింటాతో ఎఫైర్ పై క్లారిటీ ఇచ్చిన బ్రెట్ లీ!
అమ్మతో ఫోన్లో మాట్లాడుతుండగా షాక్:
కొంతకాలం తర్వాత తాను తన తల్లితో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా రాకేష్ ఆకస్మాత్తుగా తన చేతిలోనే ఫోన్ తీసుకొని “మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం అని” నేరుగా చెప్పేసాడు అని సుజాత గుర్తు చేసుకుంది. ఆ మాటల విన్న తన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారని అనంతరం తన తల్లి ఎందుకలా మాట్లాడుతున్నాడని ప్రశ్నించగా “అతను ఎప్పుడు సరదాగా ఉంటాడని జోక్ చేశాడని చెప్పి” పరిస్థితిని చక్కబెటానని వెల్లడించింది. ఆ తరువాత మెల్లగా మొదలైన ప్రేమ ఇప్పుడు పెళ్లి బంధంతో ముడిపడిన విషయాని గుర్తు చేసుకుంది.
ప్రేమ నుంచి పెళ్లి వరకు:
కొన్నేళ్ల ప్రేమ తర్వాత రాకింగ్ రాకేష్ , జోర్దార్ సుజాత 2023 ఫిబ్రవరి 24న తిరుమలలో వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు. 2024 ఆగస్టులో వీరికి పాప కూడా పుట్టింది. ప్రస్తుతం రాకేష్ టెలివిజన్ షోలు, సినిమాలతో బిజీగా ఉండగా సుజాత తన కుమార్తె పై పూర్తి దృష్టి పెట్టింది. రీసెంట్గా చెప్పిన ఈ లవ్ ప్రపోజల్ ట్విస్ట్ అభిమానులను వేరే రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తుంది..!!




