Tuesday, August 11, 2026
HomeLATESTHero Vishal:తెలుగు హీరోపై విశాల్ మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!

Hero Vishal:తెలుగు హీరోపై విశాల్ మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!

Hero Vishal: ప్రముఖ హీరో విశాల్ తాజాగా టాలీవుడ్ హీరో పై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Hero Vishal:తెలుగు, తమిళ ప్రేక్షకులకు హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళంతో పాటు తెలుగులో కూడా తన సినిమాలను విడుదల చేస్తూ ఇక్కడ కూడా అభిమానులను సంపాదించారు. హిట్, ఫ్లాప్లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న విశాల్ ఏడాదికి రెండు మూడు చిత్రాలను విడుదల చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో ఆచితూచి కథల ఎంపిక విషయంలో అడుగులు వేస్తున్నారు విశాల్. అలా ప్రస్తుతం మకుటం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా తమిళ్ ,తెలుగు భాషలో విడుదల చేయబోతున్నారు.

తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హీరో విశాల్..

విశాల్ కి జోడిగా అంజలి నటిస్తోంది. ఈ చిత్రంలో విశాల్ ఒక డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నారు. మూడు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విషయాలు పలు విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమాలోని క్లైమాక్స్ సీన్ చూసి ఆ సీన్ లో ఆయన నటనను చూసి ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ నటన అద్భుతమని ఆయనకు ఎవరు సాటి రారంటూ విశాల్ తెలియజేశారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Hansika Motwani:మరోసారి హర్రర్ స్టోరీని నమ్ముకున్న హన్సిక!

ఎన్టీఆర్ నటన పై ప్రశంసలు..

టెంపర్ సినిమాలోని క్లైమాక్స్ చూసినప్పుడు తాను స్క్రిప్ట్ గురించి పూర్తిగా మర్చిపోయాను. ఎన్టీఆర్ చూపించిన బావోద్వేగమైన సీన్స్ చాలా బాగా ఆకట్టుకున్నాయని తెలిపారు. ఎన్టీఆర్ నటన తెరపైన ఒక విస్ఫోటనంలా, అగ్నిపర్వతంలా అనిపించిందని తెలియజేశారు విశాల్. ఆ మ్యాజిక్ ను , భాగోద్వేగ తీవ్రతను ప్రేక్షకులకు మరింత చేరువ అవ్వాలనే కోరికతోనే ఆ సినిమాని రీమేక్ చేశానని తెలిపారు. ఎన్టీఆర్ టెంపర్ సినిమా క్లైమాక్స్ లో చూపించిన నటన, ఆయన చేసిన యాక్టింగ్, తనని చాలా ప్రభావితం చేసిందని, అందువల్లే ఆ సినిమాను రీమేక్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు విశాల్.

- Advertisement -
Advertisement

ALSO READ:Varanasi:‘వారణాసి’లో హ‌నుమంతుడిగా పాన్ ఇండియా హీరో..రాజమౌళి సెన్సేషనల్ డెసీషన్..!?

ఎన్టీఆర్ అభిమానులు ఖుషీ..

ప్రస్తుతం విశాల్(Hero Vishal) చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. విశాల్ హీరో అయినప్పటికీ మరో నటుడి నటనను చూసి పొగడడంతో ఎన్టీఆర్ అభిమానులు సైతం తమ హీరోతో మల్టీ స్టారర్ సినిమా చేయాలని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ సినిమాలను మరొకటి ఏదైనా రీమేక్ చేయాలని కోరుకుంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ కెరియర్ లోనే గుర్తుండిపోయే సినిమా ఏదైనా ఉంది అంటే అది టెంపర్ సినిమా అని అభిమానులు కూడా భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ అద్భుతంగా తెరకెక్కించారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you