Hansika Motwani:హర్రర్ సినిమాలు చాలామంది సెలబ్రిటీలకు బాగా కలిసొస్తూ ఉంటాయి. ఇలాంటి చిత్రాలతో చాలామంది భారీ విజయాలను అందుకున్నారు. అలా హీరోయిన్ హన్సిక కూడా ఎన్నో హర్రర్ చిత్రాలలో నటించి బాగానే విజయాలను అందుకుంది. ముఖ్యంగా సినిమా కథలోని మిస్టరీని కేవలం ఒక్క పోస్టర్ తోనే చూపిస్తే చాలు సినిమా అంచనాలను మాత్రం పెంచేస్తాయి. అలా నారా రోహిత్ నటిస్తున్న కపాలి సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ సినిమాకి సంబంధించి తాజాగా చిత్ర బృందం ఒక పోస్టర్ విడుదల చేసింది. అయితే ఇందులో హన్సిక పోస్టర్ ను విడుదల చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
విడాకుల తర్వాత మరో కొత్త మూవీతో హన్సిక..
అసలు హన్సిక (Hansika Motwani)పాత్ర ఏంటి? ఆమె చుట్టూ కనిపిస్తున్న ఆ మర్మమైన గుర్తుల వెనుక స్టోరీ ఏంటి? అనే విషయంపై అభిమానులు తెగ వెతి చేస్తున్నారు. హన్సిక పుట్టినరోజు సందర్భంగా కపాలి సినిమా నుంచి ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్లో హన్సిక చాలా ఇంటెన్స్ అవతార్లో కనిపిస్తోంది. పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ స్కెచ్ ఎఫెక్ట్ తో ఈ పోస్టర్ని డిజైన్ చేసినట్లుగా కనిపిస్తోంది. కపాలి సినిమాలో క్షుద్ర, అతీంద్రియ అంశాలతో సంబంధం ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పోస్టర్లో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే దట్టమైన అడవి అందులో నుంచి హన్సిక రూపం వెనుక పొగ మంచులో ఒంటరిగా ఒక వ్యక్తి నీడ కనిపిస్తోంది.
ALSO READ:Varanasi:‘వారణాసి’లో హనుమంతుడిగా పాన్ ఇండియా హీరో..రాజమౌళి సెన్సేషనల్ డెసీషన్..!?
ఆసక్తితోపాటు అనుమానాలు రేకెత్తిస్తున్న పోస్టర్..
ఈ చిన్న విజువల్ ఎలిమెంట్ కూడా పోస్టర్ని మరింత ఎక్సైటింగ్గా చేస్తోంది. ఆ నీడ లాగా ఉన్న వ్యక్తి ఎవరు? అతనికి , హన్సిక పాత్రకు ఉన్న సంబంధం ఏంటి? ఎలాంటి నేపథ్యంగా మారబోతోంది? అనే ప్రశ్నలు సినిమా పైన మరింత క్యూరియాసిటీని పెంచేలా కనిపిస్తున్నాయి. కపాలి చిత్రంలో నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామ్ గన్నీ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా సైకలాజికల్ హర్రర్ నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
ALSO READ:Kiran Abbavaram:కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ?
కపాలి సినిమా విశేషాలు..
కపాలి చిత్రానికి సంబంధించి పాత్రల వివరాలను చిత్ర బృందం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ హన్సిక ఫస్ట్ లుక్ ను మాత్రమే విడుదల చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని అప్డేట్లను చేపట్టనున్నారు. హన్సిక గతంలో కూడా అరణ్మైనై, గార్డియన్, అరణ్మైనై2, అలాగే 105 నాట్ అవుట్ వంటి చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. ఇప్పుడు తాజాగా మళ్ళీ కపాలి సినిమాలో నటిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి. హీరోయిన్ హన్సిక విడాకులు తీసుకున్న తర్వాత నటిస్తున్న హర్రర్ సినిమా కావడంతో ఈ సినిమా పైన అంచనాలు పెరిగిపోయాయి.
First Look of @ihansika from world of #KAPAALI !! @IamRohithNara @GanniRaam @VijayKrishnaLin @Kalyan_manthina @bhanu_pratapa @SAMWoffl pic.twitter.com/O5JJz2EQ8f
— TrackTollywood (@TrackTwood) August 9, 2026




