Bandla Ganesh:టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతగా, నటుడుగా పేరు సంపాదించిన బండ్ల గణేష్ నిరంతరం ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో ఈయన పేరు వినిపిస్తూ ఉంటుంది. బండ్ల గణేష్ ఇంట్లో తాజాగా పెళ్లి సందడి మొదలయ్యింది. ఆయన కుమార్తె వివాహం ఈనెల 16వ తేదీన చాలా గ్రాండ్గా చేయబోతున్నారు. సూర్య తేజ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగితో తన కూతురు వివాహం చేయబోతున్నారు బండ్ల గణేష్. తన కూతురు వివాహానికి టాలీవుడ్లో సినీ ప్రముఖులతో పాటు కొంతమంది రాజకీయ నాయకులను, క్రీడా ప్రముఖులను కూడా ఆహ్వానించారు బండ్ల గణేష్
బండ్ల గణేష్ ఇంట మొదలైన పెళ్లి సందడి..
సరిగ్గా ఆదివారం ఉదయం 11 గంటల 58 నిమిషాలకు బండ్ల గణేష్(Bandla Ganesh) కూతురు జనని మెడలో మూడు ముళ్ళు వేయనున్నారు సూర్యతేజ. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా మొదలయ్యాయి. ఆదివారం రాత్రి సంగీత్ కార్యక్రమాన్ని అట్టహాసంగా జరపగా.. బండ్ల గణేష్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మధ్యలో ఈ వేడుక చాలా గ్రాండ్గా జరిగింది. ఆధ్యంతం ఎంతో సరదాగా సాగిపోయిన ఈ కార్యక్రమంలో బండ్ల గణేష్ కుమారుడు హితేష్ హైలెట్ గా నిలిచారు. సంగీత్ లో భాగంగా పలు సినిమాలకు డాన్సులు వేసిన హితేష్ టాలీవుడ్ హీరోల పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేశారు.
ALSO READ:Hero Vishal:తెలుగు హీరోపై విశాల్ మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
స్పెషల్ అట్రాక్షన్ గా బండ్లన్న కుమారుడు..
ఈ డాన్స్ కు సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలు కూడా వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. బండ్ల గణేష్ కుమారుడు హితేష్ చూసి అక్కడ ఉన్న వారంతా కూడా ఈలలు వేస్తూ.. చప్పట్లు కొడుతూ మరి హైలెట్ చేస్తున్నారు. ఈ వీడియోను చూసిన పలువురు నెటిజెన్స్ కూడా క్రేజీ కామెంట్స్ చేస్తూ బండ్లన్న కుమారుడా మజాకా.. డాన్స్ తోనే అదరగొట్టేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు భవిష్యత్తులో హీరో అయ్యే లక్షణాలు కూడా చాలా పుష్కలంగా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ALSO READ:Hansika Motwani:మరోసారి హర్రర్ స్టోరీని నమ్ముకున్న హన్సిక!
బండ్ల గణేష్ తన కొడుకుని హీరోగా చేస్తారా?
మరి నెటిజెన్స్ అభిప్రాయాల మేరకు బండ్ల గణేష్ నిజంగానే తన కుమారుడు హితేష్ ను హీరోగా చేస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. బండ్ల గణేష్ కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. హితేష్ పెద్ద కుమారుడు కాగా రెండవ కుమారుడు పేరు హిరేష్ . ఇప్పటికే బండ్ల గణేష్ కూతురు వివాహ వేడుకల గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇక వివాహం అనంతరం మరిన్ని ఫోటోలు వీడియోలు కూడా హైలైట్ గా ఉండనున్నాయి. బండ్ల గణేష్ ఈ మధ్యకాలంలో పెద్దగా చిత్రాలను నిర్మించడం లేదు . అంతేకాకుండా సినిమాలలో కూడా నటించడం లేదు. కేవలం బిజినెస్ వైపు గానే అడుగులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Bandla Ganesh is using his daughter’s Sangeet ceremony to showcase his son’s dancing skills.
He danced really well, BTW. pic.twitter.com/DBRZ4QoTfL
— Satya (@YoursSatya) August 9, 2026




