Toxic:రుక్మిణి వసంత్.. ఈ పేరు గురించి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు. ఈ పేరు వింటుంటేనే కుర్రాళ్లకి అదో తెలియని ఫీలింగ్. అమ్మడి యాక్టింగ్‌తో పాటు అందాల విందు కూడా అలానే ఉంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఈమె బాగా సుపరిచితురాలే. మరీ ముఖ్యంగా ‘కాంతారా: చాప్టర్ 1’తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల సరసన సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడిపిస్తుంది.
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాలో హీరోయిన్ రుక్మిణి వసంతే. అంతేకాదు, సుకుమార్-రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలోని హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ సెలెక్ట్ అయినట్లు టాక్. దీని గురించి ఇంకా అఫీషియల్ ప్రకటన రాలేదు. అదేవిధంగా అల్లు అర్జున్-లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకు హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ సెలెక్ట్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే మరో రెండు సినిమాల్లో కూడా ఆఫర్ అందుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.
వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు:
ఇలా బ్యాక్ టు బ్యాక్ వరుసగా స్టార్ హీరోల సినిమాలలో ఛాన్సులు కొట్టేస్తున్న రుక్మిణి వసంత్ లేటెస్ట్‌గా ‘టాక్సిక్’ ( Toxic)సినిమాలో కూడా నటించింది. రుక్మిణి వసంత్, యశ్ హీరోగా నటించిన ‘టాక్సిక్’ సినిమాలో వన్ ఆఫ్ ది కీలక పాత్రలో కనిపించబోతుంది. రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్‌లో ఆమె లుక్, ఆమె డైలాగ్, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ అందరినీ ఆకట్టుకుంది.
అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుంది అనేది ఒక అంచనాకి వచ్చేశారు అభిమానులు. అంతేకాదు, ఈ సినిమాలో ఆమె నటించినందుకు ఏకంగా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంది అన్న ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో నటించినందుకు గాను ఆమె ఏకంగా మూడు కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకున్నారట. ఇటీవల కాలంలో రుక్మిణి వసంత్ అందుకున్న సక్సెస్‌తో మార్కెట్లో బాగా డిమాండ్ పెరిగిపోవడంతో ఈ రేట్ అమాంతం పెంచినట్లు కూడా ఇన్‌సైడ్ టాక్.
ALSO READ:TV:మంగళవారం టీవీ సినిమాల సందడి.. ఏ ఛానల్‌లో ఏ మూవీ అంటే?
సౌత్‌లో భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న భామల్లో ఒకరు:
సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న భామలలో రుక్మిణి వసంత్ కూడా చేరిపోయింది. ‘టాక్సిక్’ సినిమా ఆగస్టు 26న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ సినిమాలో నయనతార, బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ, అలాగే రుక్మిణి వసంత్ నటిస్తున్నారు.
ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. రుక్మిణి వసంత్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది.
ALSO READ:Rahul Sipligunj : బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు.. 16 మందిపై ఎఫ్‌ఐఆర్
నెక్స్ట్ నేషనల్ క్రష్‌గా ఎదుగుతుందా?
అంతేకాదు, ఇదే కంటిన్యూ చేస్తే ఆమె ఇండస్ట్రీలో నెక్స్ట్ నేషనల్ క్రష్‌గా ఎదిగిపోతుంది అంటున్నారు ఫ్యాన్స్. మొత్తానికి కెరీర్‌లో స్టార్ యాక్టర్లతో కలిసి నటిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా ఇండస్ట్రీని ఏలేస్తుంది ఈ కన్నడ ముద్దుగుమ్మ. మరి ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.




