Tuesday, August 11, 2026
HomeLATESThyper aadi:జెన్‌జీ వర్సెస్ 90స్.. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో ఫుల్ కామెడీ!

hyper aadi:జెన్‌జీ వర్సెస్ 90స్.. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో ఫుల్ కామెడీ!

hyper aadi:శ్రీదేవి డ్రామా కంపెనీ తాజా ప్రోమోలో జెన్‌జీ, 90స్ జనరేషన్ మధ్య సరదా పోటీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది.

on
- Advertisement -banner Ad

hyper aadi:బుల్లితెరపై ఎన్ని షోలు వచ్చినా “శ్రీదేవి డ్రామా కంపెనీ” షో మాత్రం ఎప్పటికీ తన రేంజ్ తగ్గకుండా చూసుకుంటూ వస్తుంది. ఈటీవీలో ప్రసారమయ్యే “శ్రీదేవి డ్రామా కంపెనీ” షో ప్రతి వారం కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరిస్తుంది . యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఆధ్వర్యంలో బుల్లితెర, వెండి తెర, సెలబ్రిటీల సందడి, ఆటలు, పాటలు, కామెడీతో కార్యక్రమం వినోదాన్ని పంచుతుంది. తాజాగా విడుదలైన ఈ వారం ప్రోమోలో జెన్‌జీ వర్సెస్ 90 కాన్సెప్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

రఘు మాస్టర్ వర్సెస్ ప్రణవి :

ప్రోమో ప్రారంభంలోనే రఘు మాస్టర్ తన మాస్ పర్ఫామెన్స్ తో సందడి చేశారు. ఆ తర్వాత ఆయన సతీమణి ప్రణవి రావడంతో ఇద్దరి మధ్య సరదా సంభాషణలు చోటు చేసుకున్నాయి. జెన్‌జీ లా రెడీ అవ్వాలి అని రఘు మాస్టర్ చెప్పగా “మీకంటే బాగానే ఉన్నా” అంటూ ప్రణవి ఇచ్చిన కౌంటర్ నవ్వులు పూయించింది. తాను జెన్‌జీలా ఉండమంటే ఆమె మాత్రం 90స్ లోనే ఉండిపోయింది అంటూ రఘు మాస్టర్ కామెంట్ చేశారు. దీంతో అందరు కాసేపు సరదాగా నవ్వుకున్నారు.

- Advertisement -
Advertisement

also read:Toxic:‘టాక్సిక్’తో రుక్మిణి వసంత్‌కు జాక్‌పాట్.. కెరీర్లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్‌!?

ఆది పంచులతో సందడి:

శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మధ్య గొడవ ఏంటి అని హైపర్ ఆది అడగడంతో రఘు మాస్టర్ దండం పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినా అది తగ్గకుండా వారు స్టెప్పులను ఇమిటేట్ చేస్తున్న నవ్వించారు. అనంతరం ప్రదీప్ మాచిరాజు ఎంట్రీ ఇచ్చి జెన్‌జీ , 90 స్ మధ్య వివిధ పోటీలు నిర్వహించారు. ఈ గేమ్‌స్ జనాలను బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి.

- Advertisement -
Advertisement

also read:TV:మంగళవారం టీవీ సినిమాల సందడి.. ఏ ఛానల్‌లో ఏ మూవీ అంటే?

రింగ్స్ టాస్క్ లో ఫుల్ కామెడీ:

సెలబ్రిటీలకు రింగ్స్ తిప్పే టాస్క్ ఇవ్వగా హైపర్ ఆది (hyper aadi)తన పొట్ట కారణంగా తన వల్ల కాదు అంటూ కామెడీ చేశారు. ఫైమా మాత్రం రింగును నడుముతో కాకుండా చేతితో తిప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దీపిక రంగరాజు పంచ్ డైలాగ్ తో మరింత నవ్వులు పూయించారు. కాసేపు సెట్ అంతా సరదా వాతవరణం నెలకొంది.

- Advertisement -
Advertisement

ప్రదీప్ కు నైనిషా ప్రపోజల్ :

ప్రోమో చివర్లో బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ నైనీషా రాయ్ యాంకర్ ప్రదీప్ కు సర్ప్రైజ్ ఇచ్చారు. 13 ఏళ్లుగా ఒక వ్యక్తిపై క్రష్ ఉంది అని చెప్పి చేతిపై దీప్ పేరుతో ఉన్న టాటూను చూపించారు. దీంతో అక్కడ ఉన్న జనాలు షాక్ అవుతారు . అది ప్రదీప్ ని అని వెల్లడించంతో అందరూ ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా దివంగత లెజెండరీ గాయని ఎస్. జానకి కి కార్యక్రమంలో నివాళులర్పించారు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సింగర్ ప్రణవి భావోద్వేగానికి గురయ్యారు. మొత్తంగా ఈ వారం ఎపిసోడ్ పై ప్రోమో ఆసక్తిని పెంచేస్తుంది..!!

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you