Thursday, August 13, 2026
HomeLATESTOTT:థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో మాత్రం నంబర్ వన్‌..మస్ట్ వాచ్ ఫిలిం!

OTT:థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో మాత్రం నంబర్ వన్‌..మస్ట్ వాచ్ ఫిలిం!

OTT:ప్రముఖ ఫాంటసీ క్యారెక్టర్ హీ-మ్యాన్ ఆధారంగా తెరకెక్కిన ‘Masters of the Universe’ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

on
- Advertisement -banner Ad

OTT:పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణం పెరిగే కొద్ది వాటి బాక్సాఫీస్ ఫలితాలపై కూడా అలాంటి ఆసక్తి పెరుగుతుంది. భారీ అంచనాలతో విడుదలైన ప్రతి సినిమా విజయం సాధిస్తుందని గ్యారెంటీ లేదు. ఈ మధ్యకాలంలో అలాంటివి ఎన్నో చూసాం. భార్యాభర్తలు అంతకంటే పెద్ద తారగాణం ఉన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయిపోయాయి. కొన్నిసార్లు కోట్ల రూపాయలు పెట్టుబడితో తెరకెక్కిన చిత్రాలు థియేటర్లలో నిరాశ పరుస్తూ ఉంటే చిన్న సినిమాలు మాత్రం ఊహించిన స్థాయిలో విజయాలు అందుకుంటున్నాయి. 2026లో విడుదలైన యాక్షన్ అడ్వెంచర్ చిత్రం కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంది.

భారీ బడ్జెట్ బాక్సాఫీస్ వద్ద నిరాశ:

అమెజాన్ ఎం జి ఎం స్టూడియోస్ నిర్మించిన ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’పై విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు దాదాపు రూ.1,626 కోట్ల బడ్జెట్ పెట్టినట్లు సమాచారం. ఈ స్థాయి పెట్టుబడిని రాబట్టాలి అంటే ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు కచ్చితంగా అవసరం. అయితే ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్ట లేకపోయింది. దీంతో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

- Advertisement -
Advertisement

ALSO READ:Anupama :‘పెళ్లి చేసుకుని ఉంటే విడాకులు తీసుకునేదాన్ని’.. అనుపమ సంచలన వ్యాఖ్యలు..!

సోషల్ మీడియాలో హైప్.. థియేటర్లలో ఫ్లాప్:

విడుదలకు ముందు సోషల్ మీడియాలో ఈ సినిమాపై మంచి చర్చ జరిగింది. థియేటర్లలో మాత్రం ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. ప్రపంచవ్యాప్తంగా సుమారు కోట్ల వసూళ్లతోనే రన్ ముగించుకుంది. దీంతో భారీ బడ్జెట్ సినిమాలలో ఘననీయమైన పరాజయంగా నిలిచింది. కథాంశం పాతదిగా అనిపించడం.. యువతను ఆకట్టుకునేలా ప్రమోషన్స్ లేకపోవడం.. అధిక నిర్మాణ వ్యయం వంటి అంశాల ఫలితం ప్రభావితం చేశాయి అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Jabardasth Venky:జబర్దస్త్ వెంకీ వివాదం.. యూట్యూబ్ ఛానల్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!

ఓటీటీలో సీన్ మొత్తం రివర్స్ :

థియేటర్లలో నిరాశపరిచిన ఈ సినిమా ఓటీటీలో (OTT)మాత్రం దుమ్ము దులిపేస్తుంది. విడుదలైన 47 రోజులకే.. జులై 22న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన వెంటనే పలు దేశాలలో నెంబర్ ట్రెండింగ్ లో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. థియేటర్లలో అట్టర్ ఫ్లాప్ అయిన ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ పై మాత్రం సూపర్ డూపర్ హిట్ సంపాదించుకొని ఇప్పుడు చర్చనీయాంసంగా మారింది.

- Advertisement -
Advertisement

ప్రిన్స్ ఆడమ్‌గా నికోలస్ గలిట్జైన్

ట్రావిస్ నైట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నికోలస్ గలిట్జైన్ ప్రిన్స్ ఆడమ్ పాత్రలో నటించారు. భూమిపై సాధారణ జీవితం గడిపే అతడు తన అసలు ప్రపంచమైన ఎటర్నియాకు చేరుకున్న తర్వాత ‘హీ-మ్యాన్’గా (Masters of the Universe He-Man)మారి, విలన్ స్కెలెటన్‌తో పోరాడే కథతో సినిమా తెరకెక్కింది. జారెడ్ లెటో ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు. విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, థియేట్రికల్ ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. అయితే ఓటీటీ విజయంతో ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you