Thursday, August 13, 2026
HomeLATESTJabardasth Venky:జబర్దస్త్ వెంకీ వివాదం.. యూట్యూబ్ ఛానల్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!

Jabardasth Venky:జబర్దస్త్ వెంకీ వివాదం.. యూట్యూబ్ ఛానల్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!

Jabardasth Venky:జబర్దస్త్ కామెడీ కమెడియన్ వెంకీ యూట్యూబ్ ఛానల్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

on
- Advertisement -banner Ad

Jabardasth Venky:జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లలో వెంకీ కూడా ఒకరు అని చెప్పుకోవడం లో ఎలాంటి సందేహం లేదు. తనదైన కామెడీ టైమింగ్ తో జబర్దస్త్ లో స్కిట్లు వేసి జనాలను కడుపుబ్బ నవ్వించారు . తెలంగాణకు చెందిన ఆయన తనదైన కామెడీ టైమింగ్ పంచులతో ప్రేక్షకులను ఎలా అలరిస్తున్నారు అందరికీ తెలిసిందే. సాధారణ కంటెస్టెంట్ గా షోలోకి అడుగుపెట్టిన వెంకీ ఆ తర్వాత క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టు ఎదిగాడు . మొదటిగా టీం లీడర్ గా ఎదిగి జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని శభాష్ అనిపించుకున్నారు. టీవీ షో లతో పాటు అప్పుడప్పుడు సినిమాలలోనూ కనిపిస్తూ ఉంటారు.

వివాదంలో వెంకీ:

ఇటీవల వెంకీ(Jabardasth Venky) ఓ వివాదంలో చిక్కుకున్నారు. తనను కమిట్మెంట్ అడిగారు అంటూ ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆరోపణలు చేసింది అంటూ ఓ టీవీ ఛానల్ లో కథనం ప్రసారం కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఆరోపణలపై వెంటనే స్పందించిన వెంకి నేరుగా ఆ ఛానల్ కు వెళ్లి డిబేట్లో పాల్గొన్నారు. తనకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదు అని స్పష్టం చేశారు. డిబేట్ సందర్భంగా సదరు ఇన్ఫ్లుయెన్సర్ తో లైవ్ లో మాట్లాడిన వెంకీ తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి వివరణ ఇచ్చారు. అనంతరం ఈ వ్యవహారం లో తన పైన ఎలాంటి తప్పు లేదనే విషయం స్పష్టమైనది అని ఆయన తెలిపారు. అయినప్పటికీ కొన్ని యూట్యూబ్ ఛానల్ తనపై ఇంకా అసత్య ప్రచారం చేస్తున్నాయి అంటూ వెంకీ ఆవేదన వ్యక్తం చేశారు. సదరు యూట్యూబ్ ఛానల్ పై మండిపడ్డారు.. తాటతీస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు.

- Advertisement -
Advertisement

also read:Irumudi:ఆకట్టుకుంటున్న రవితేజ ఇరుముడి ట్రైలర్..!

లీగల్ యాక్షన్ తప్పదు:

దీనికి సంబంధించి వెంకీ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో వెంకీ ఎంతో ఆవేశంగా మాట్లాడారు. ఆ వీడియోలో వెంకీ మాట్లాడుతూ..” యూట్యూబ్ ఛానల్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు”. ఈ ఇష్యూ ముగిసినప్పటికీ తనతో పాటు వరలక్ష్మి ఫోటోలను ఉపయోగించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఆరోపించారు. ఇది మంచిది కాదు అంటూ హెచ్చరించారు. ఇకపై కూడా ఇలాంటి ప్రచారాలే కొనసాగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని హెచ్చరించారు. వీడేం చేసుకుంటాడు అని అనుకోకండి అని కచ్చితంగా నేను లీగల్ యాక్షన్ తీసుకుంటాను అని స్ట్రాంగ్ గా చెప్పారు.

- Advertisement -
Advertisement

also read:janhvi kapoor :యదార్థ సంఘటనల కథతో తమిళ ఇండస్ట్రీలోకి జాన్వీ కపూర్ ఎంట్రీ..!

వరలక్ష్మికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు:

ఇక అదే సమయంలో వరలక్ష్మికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఆమె ధైర్యంగా బయటకు చెప్పారు అని.. అనంతరం లైవ్ లోకి వచ్చే వెంకీ తప్పు చేయలేదని స్పష్టం చేయడం అభినందనీయం అన్నారు . అన్యాయం జరిగినప్పుడు మహిళలు ఏడుస్తూ కూర్చోకుండా ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడాలి అని అప్పుడే నిజానిజాలు బయటపడతాయి అని.. పక్క మహిళలు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు అని.. నిజా నిజాలు తెలియకుండా ఎవరిపై తప్పుడు ఆరోపణలు చేయకూడదు అని సూచించారు. ప్రస్తుతం వెంకీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

- Advertisement -
Advertisement

https://www.instagram.com/reel/Db55rIVyXwl/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you