Bigg Boss:రాజకుమారి.. ఇది జస్ట్ ఒక పేరు అనుకుంటే పొరపాటే. గత రెండు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు మార్మోగిపోతుంది. ఏ కుటుంబంలో విన్నా, ఏ యూట్యూబ్ ఛానల్‌లో చూసినా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో చూసినా రాజకుమారిని ప్రశంసించే వాళ్లు బోలెడు మంది. మరీ ముఖ్యంగా మహిళలు ఆమెను ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఎన్నో కష్టాలు పడి, ఆ కన్నీటినంతా దిగమింగి, ముగ్గురు పిల్లలతో భవిష్యత్తు కోసం ఒంటరిగా పోరాడిన మహిళ ఈ రాజకుమారి.
అగ్నిపరీక్ష వేదికపై ఆకట్టుకున్న రాజకుమారి:
బిగ్ బాస్(Bigg Boss) సీజన్ 10లోకి వెళ్లడానికి అగ్నిపరీక్ష వేదికపై తన మాటలతో అందరినీ ఆకట్టుకుని, అందరి మనసులను కదిలించింది. ఆమె జీవిత ప్రయాణం వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ఎన్నో అవమానాలు, అన్యాయాలు ఎదురైనా సరే ఎక్కడా తగ్గేదేలే అంటూ తన ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లిన మహిళ ఈ రాజకుమారి. చాలామంది ఈ రాజకుమారిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటున్నారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా సరే సెల్ఫ్ రెస్పెక్ట్‌తో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలంటూ ఆమెను ఆదర్శంగా తీసుకుంటున్నారు.
అగ్నిపరీక్షలో ఆసక్తికరమైన టాస్కులు:
త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ 10 కోసం సామాన్యుల నుంచి కంటెస్టెంట్లను ఎంపిక చేస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న అగ్నిపరీక్ష కార్యక్రమంలో నవదీప్, అభిజిత్, బిందు మాధవి జడ్జిలుగా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. షో స్టార్ట్ అయిన రెండు రోజుల్లోనే ఫుల్ కాంట్రవర్సీ కంటెంట్ వచ్చేసింది. బిగ్ బాస్ ఏ అనుకుంటే, బిగ్ బాస్‌కు మించిన రేంజ్‌లో కాంట్రవర్సీ క్రియేట్ అయిపోయింది. ఒక్క రూపాయి లేకుండానే బాగా పబ్లిసిటీ వచ్చేసింది. కంటెస్టెంట్లకు ఆసక్తికరమైన టాస్కులు ఇస్తూ, వారి ప్రతిభతో పాటు జీవిత కథలను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు అగ్నిపరీక్ష టీం. ఈ క్రమంలోనే రాజకుమారి చెప్పిన తన జీవిత కథ ఇప్పుడు ప్రత్యేకంగా నిలిచింది.
also read:Ram Charan:రవితేజ “ఇరుముడి” లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..!
ఇష్టం లేని పెళ్లి.. ఆ తర్వాత అన్యాయం:
చిన్న వయసులోనే రాజకుమారికి ఇష్టం లేని పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఆమె నల్లగా ఉందనే కారణంతో మొదటి భర్త మరో వివాహం చేసుకుని ఆమెకు అన్యాయం చేశాడు. ఆ బాధ నుంచి కోలుకోకముందే కుటుంబ సభ్యులు ఇంకో పెళ్లి చేశారు. రెండోవాడు కూడా అలాంటి వాడే. ఆమెకు సంతోషాన్ని ఇవ్వకపోగా, బాధ్యతలను వదిలేసి వెళ్లిపోవడంతో ముగ్గురు చిన్నారులతో కలిసి ఆమె ఒంటరిగా మిగిలిపోయింది.
చేతిలో ఒక్క రూపాయి లేదు. ఉండేందుకు సరైన చోటు లేదు. పక్కనేమో ముగ్గురు పిల్లలు. వారిని చూసుకునే తోడు లేదు. అయినా సరే ఎక్కడా ఏడవలేదు, కుంగిపోలేదు, బాధపడలేదు. పిల్లల ఆకలి కేకలు ఆమెను మరింత బలంగా మార్చాయి.
also read:Sai Dharam Tej:రూల్స్ బ్రేక్ చేసిన మెగా హీరో..అడ్డంగా దొరికేశాడు పో..!
పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం:
ఆత్మహత్య ఆలోచనలను పక్కనపెట్టి, తన పిల్లల భవిష్యత్తు కోసం ఏం చేయాలి, ఏం చేస్తే జీవితంలో బాగుపడతాం అనే విషయాలను గట్టిగా నమ్ముకుని ముందుకు వెళ్లింది. ఈమె కథ అందరికీ స్ఫూర్తిదాయకంగా మారింది.ముగ్గురు జడ్జిల నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకున్న రాజకుమారి నేరుగా టాప్ 15లో చోటు సంపాదించింది. ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఆమె గురించి మాట్లాడుకుంటున్నారు.
బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తుందా?:
ఇప్పటికే అగ్నిపరీక్షలో తన ప్రత్యేకతను చాటుకున్న రాజకుమారి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెడుతుందా? అక్కడ తన పోరాట స్ఫూర్తితో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుంది? అనేది ఆసక్తికరంగా మారింది. దీనికి సమాధానం తెలియాలంటే బిగ్ బాస్ 10 ప్రారంభమయ్యే వరకు వేచి చూడాల్సిందే.
Rajakumari Gari story 🥺👏🏻
A journey filled with emotions, struggles, and strength .
Truely inspiring mother🔥
Her story is very inspiring👏🏻..
Three Greens from three judges.#BiggBossTelugu10 pic.twitter.com/tHPKGCABHc— sachin (@BSachin52898) August 17, 2026




