Chiranjeevi:టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి చేసే సినిమాల గురించి ,చేసే సహాయము గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినీ ఇండస్ట్రీకి పెద్దగా ఉంటూనే , ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ తన వంతు సహాయం చేస్తూ ఉన్నారు చిరంజీవి. అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో సోషల్ మీడియా వేదికగా చేసే ట్వీట్ వైరల్ గా మారుతుంటాయి. ఇప్పుడు తాజాగా చిరంజీవి గాలిలో 30 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానంలో ఏం జరిగిందో తెలిసేలోపు.. విమానం వేల అడుగుల కిందికి పడబోతోంది. పక్కనే ఉండాల్సిన కో-ఫైలటే ఉన్నట్టుండి కోపంతో, కత్తితో మరో పైలట్ పై విరుచుకుపడి దాడి చేయడంతో.. చాకచక్యంగా తన తెలివిని ప్రదర్శించి 174 మంది ప్రాణాలను కాపాడారు రియల్ హీరో భారత కెప్టెన్ స్మిత్ మచ్చార్ .
174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన స్మిత్ మచ్చార్..
ఈ భారతీయ కెప్టెన్ గురించి చిరంజీవి(Chiranjeevi) తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. విమానంలో ఉన్న 174 మంది ప్రాణాలను కాపాడిన ఈ భారతీయ కెప్టెన్ చేసిన సాహసాన్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రశంసిస్తున్నారు. మరణం కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ.. కెప్టెన్ స్మిత్ హనుమాన్ చాలీసా జపిస్తూ మనోధైర్యాన్ని నింపుకొని సేఫ్ గా ల్యాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కెప్టెన్ ని ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా చిరంజీవి పోస్ట్ చేశారు.
also read:Aishwarya Lakshmi:రాకా సినిమాలో అవకాశం ఇప్పించండి.. హీరోయిన్ కామెంట్స్..!
చిరంజీవి ప్రశంసలు..
తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా సరే తోటి వారి ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో ఉన్న అలాంటి వ్యక్తుల ధైర్య సాహసాలు ప్రదర్శించిన మన భారతీయ పైలెట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ గారికి నా హృదయపూర్వక అభినందనలు.. ఇజ్రాయిల్ కు వెళ్తున్న విమానంలో దాడికి గురై తీవ్రంగా గాయపడిన స్థితిలో ఉన్నప్పటికీ ఎందరో ప్రాణాలను ఒక్కడే కాపాడిన తీరు, మీరు చేసిన సాహసం ప్రతి భారతీయుడికి కూడా గర్వకారణం.. ఆ క్లిష్ట సమయంలో హనుమాన్ చాలీసా పఠిస్తూ మనోధైర్యాన్ని కూడా సంపాదించుకోవడం నా మనసును చలించింది అంటూ తెలిపారు.
also read:Devara Movie: సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయిన జాన్వీ కపూర్, ఎన్టీఆర్..!
అసలేం జరిగిందంటే?
ఆ ఆంజనేయుడు అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని, మీరు త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని మెగాస్టార్ చిరంజీవి చాలా ఎమోషనల్ గా రాసుకు వచ్చారు. దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ కి వెళ్తున్న విమానం (FZ1073) లో 174 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే సరిగ్గా ప్రయాణం సాగుతున్న సమయంలో కాక్ పిట్ లో ఉన్న ఒక కో పైలట్ ఊహించని విధంగా కెప్టెన్ స్మిత్ పైన కత్తితో దాడి చేశారు.. విమానాన్ని నేల కేసు కొట్టేందుకు ప్రయత్నించారు. అలా క్షణాల వ్యవధిలోని సుమారుగా 1400 అడుగుల మేర కిందికి దూసుకు వచ్చింది. కెప్టెన్ స్మిత్ మెడ, ఛాతీ పైన బలమైన గాయాలైనప్పటికీ.. వెనక్కి తగ్గకుండా ప్రాణాభయంతో వణికిపోకుండా సమయస్ఫూర్తితో కాక్ పిట్ డోర్ ఎమర్జెన్సీ లాకుని ఓపెన్ చేసి ప్రయాణికులు , సిబ్బంది లోపలికి వచ్చేలా చేశారు. ఆ వెంటనే ప్రయాణికుల సహాయంతో దుండగుడిని బంధించి , విమానాన్ని అత్యవసరంగా సౌదీ అరేబియాలో తగూట్ ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. రక్తం కారుతున్నా తోటి ప్రయాణికుల ప్రాణాల కోసం ఒంటరి పోరాటం చేసిన ఈ భారతీయ పైలెట్ ధైర్యాన్ని ఇప్పుడు ప్రపంచమంతా కూడా ప్రశంసలు అందిస్తోంది.
తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా, తోటి వారి ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన భారతీయ పైలట్ కెప్టెన్ Smit Machchhar గారికి నా హృదయపూర్వక అభినందనలు.
ఇజ్రాయెల్‌కు వెళ్తున్న విమానంలో దాడికి గురై, తీవ్రంగా గాయపడిన స్థితిలోనూ సమయస్ఫూర్తితో స్పందించి, ఎందరో…
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 3, 2026




