Kalyani priyadarshini:కేవలం ఒకే ఒక చిత్రంతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. అయితే అంతకుముందు ఎన్నో చిత్రాలలో నటించినా రాని క్రేజ్ కేవలం ఒక్క సినిమాతో మాత్రమే స్టార్డం సంపాదించుకొని భారీ పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో కళ్యాణి ప్రియదర్శని కూడా ఒకరు. స్టార్ కిడ్‌గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక సొంత గుర్తింపు కోసం కష్టపడ్డ ఈ మలయాళ ముద్దుగుమ్మ లోకా: చంద్ర చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమానే ఈమె కెరీర్ కి మైలురాయిగా నిలిచింది.
కళ్యాణి ప్రియదర్శిని బాలీవుడ్ కే పరిమితం కానుందా..
లోకా చిత్రంలో తన అద్భుతమైన నటనతో ఏకంగా 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది. లేడీ ఓరియంటెడ్ చిత్రంగా సరికొత్త రికార్డులను సృష్టించింది లోకా చిత్రం. అయితే ఈ భారీ హిట్ తర్వాత కళ్యాణి ప్రియదర్శిని దక్షిణాది సినిమాలకు శాశ్వతంగా దూరం అవుతుందా అనే వార్తలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కళ్యాణి(Kalyani priyadarshini) పూర్తి ఫోకస్ బాలీవుడ్ కే పరిమితం కానుందా? అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లోక సినిమా తెచ్చిన అసాధారణ క్రేజ్ తో ఏకంగా బాలీవుడ్లో పలు బడా ప్రాజెక్టులలో నటించే అవకాశాలు దక్కించుకునేలా కనిపిస్తోంది.
కఠినమైన వర్కౌట్స్ తో ఆశ్చర్యపరుస్తున్న కళ్యాణి..
బాలీవుడ్లో రణవీర్ సింగ్ సరసన ప్రళయ్ అనే చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో నటించేందుకు ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం సినిమా షూటింగ్ సమయాలలో వచ్చి వెళ్లడమే కాకుండా ఈ ప్రాజెక్టు విషయంలో చాలా సీరియస్ గా తీసుకున్నట్లు వినిపిస్తోంది. కళ్యాణి ఏకంగా తన నివాసాన్ని ముంబైకి మార్చేసినట్లు వినిపిస్తోంది. జూహులోని అత్యంత విలాసవంతమైన అపార్ట్మెంట్లో ఆమె కోసం నిర్మాతలు ప్రత్యేకంగా ఒక వసతి భవనాన్ని కూడా ఏర్పాటు చేశారని వినిపిస్తోంది. అయితే కళ్యాణి ప్రియదర్శిని షూటింగ్ పూర్తి అయ్యేదాకా ఆమె అక్కడే ఉండబోతున్నట్లు వినిపిస్తోంది. ఈ చిత్రంలోని పాత్ర కోసం కళ్యాణి గతంలో ఎన్నడూ లేని విధంగా కటోర శ్రమ చేస్తుందన్నట్లుగా తెలుస్తోంది.
also read:Rachita Ram:రచితా రామ్ బుగ్గ గిల్లిన అభిమాని.. వీడియో వైరల్..!
అందుకే ముంబైలో కొత్త ఇల్లు..
భారీ యాక్షన్ సీన్స్ ఉన్న నేపథ్యంలో ప్రత్యేకించి మరీ యాక్షన్ ట్రైనింగ్ కూడా తీసుకుంటుందట. రణవీర్ సింగ్‌తో కలిసి వర్క్ షాప్ లలో కూడా పాల్గొంటున్నట్లు సమాచారం. అలాగే స్క్రీన్ పైన అత్యంత నాజుగ్గా ఒక పవర్ఫుల్ లుక్కులో కనిపించేందుకు కఠినమైన డైట్ ను పాటిస్తూ తన శరీరాకృతిని పూర్తిగా మార్చేయడానికే ప్రయత్నాలు చేస్తోంది. జులై నెలలో మొదటి షెడ్యూల్ పూర్తి అవ్వగా ఇప్పుడు రెండవ షెడ్యూల్ ని ప్రారంభించడానికి సిద్ధమయ్యింది చిత్ర బృందం. కళ్యాణి ప్రియదర్శిని ముంబై కి మకాం మార్చడంతో ఇకపై ఈమె తెలుగులో సినిమాలు చేయదా? దక్షిణాది సినిమాల వైపు చూడదా? అనే అనుమానాలు ఇప్పుడు అభిమానులలో మొదలవుతున్నాయి.
ALSO READ:actress Sarada:నడవలేని స్థితిలో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్..?
కళ్యాణి బాలీవుడ్ భవిష్యత్తును ప్రళయ్ మూవీ నిర్ణయిస్తుందా?
ప్రస్తుతం తమిళంలో మార్షల్ షూటింగ్ పూర్తి కాగా అలాగే జీని అనే సినిమా పైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది . కానీ తెలుగులో మాత్రం పెద్దగా సినిమాల ప్రస్తావన వినిపించలేదు. మరి బాలీవుడ్ లో ప్రళయ్ అనే సినిమాతో ఏ విధంగా తన కెరీర్ ని మార్చుకుంటుం దో చూడాలి. ఈ సినిమా.. ఈమె బాలీవుడ్ లో పర్మినెంట్‌గా ఉంటుందా లేదా అనే విషయం నిర్ణయిస్తుంది.




