Saturday, October 3, 2026
HomeLATESTAishwarya Lakshmi:రాకా సినిమాలో అవకాశం ఇప్పించండి.. హీరోయిన్ కామెంట్స్..!

Aishwarya Lakshmi:రాకా సినిమాలో అవకాశం ఇప్పించండి.. హీరోయిన్ కామెంట్స్..!

Aishwarya Lakshmi: ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి రాకా సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది అంటూ వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చింది.

on
- Advertisement -banner Ad

Aishwarya Lakshmi:స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం రాకా. ఈ చిత్రంలో హీరోయిన్గా దీపికా పదుకొనే నటిస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో అల్లు అర్జున్ గత సినిమాలకు భిన్నంగా కనిపించబోతున్నారు. రాకా సినిమాలో మరికొంతమంది హీరోయిన్స్ కూడా నటించే అవకాశాలు ఉన్నట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అలా ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ పేరు కూడా వినిపిస్తోంది. ఇటీవల మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి కూడా రాకా చిత్రంలో నటిస్తోంది అంటూ జోరుగా ప్రచారమైతే వినిపించింది.

రాకా లో ఐశ్వర్య లక్ష్మి.. క్లారిటీ ఇదే..

అయితే ఈ వార్తల పైన తాజాగా ఐశ్వర్య లక్ష్మి స్పందిస్తూ ఒక విషయంతో క్లారిటీ ఇచ్చేసింది. రాకా సినిమాలో తాను నటించబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదంటూ చెప్పేసింది.సోషల్ మీడియాలో వచ్చిన ఆ వార్తలను చూసి తాను కూడా నవ్వుకున్నానని, అంతేకాకుండా తనను రాకా లో నటించడానికి ఎవరైనా అవకాశం ఇప్పించాలని కూడా సరదాగా అభిమానులను కోరుతున్నట్లు ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటివరకు ఈమె గురించి వచ్చిన వార్తలన్నీ కూడా కేవలం ఊహాగానాలు అంటూ అల్లు అర్జున్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Devara Movie: సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయిన జాన్వీ కపూర్, ఎన్టీఆర్..!

రూమర్స్ కి తెరదింపిన ఐశ్వర్య లక్ష్మి..

డైరెక్టర్ అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న రాకా సినిమాలో ఏకంగా నలుగురు హీరోయిన్స్ ఉంటారని వినిపిస్తోంది. ఈ క్రమంలోనే పలువురు హీరోయిన్స్ పేరు కూడా వినిపించింది. ఇందులో మలయాళ నటి ఫెమినా జార్జ్ కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. రాకా చిత్రంలో రష్మిక, జాన్వీ కపూర్ కూడా నటించబోతోందని పేర్లు వినిపించాయి. అయితే వీరిద్దరి విషయం పైన ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా అధికారికంగా ప్రకటించలేదు. మరి ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) తాజాగా ఇచ్చిన క్లారిటీతో ఒక రూమర్ కి తెరపడింది. మరి అటు రష్మిక కానీ, జాన్వీ కపూర్ కానీ ఈ విషయం పైన ఏవిధంగా క్లారిటీ ఇస్తారో చూడాలి.

- Advertisement -
Advertisement

also read:Kalyani priyadarshini:అక్కడికి మకాం మార్చేసిన కళ్యాణి ప్రియదర్శిని..!

రాకా కోసం కష్టపడుతున్న బన్నీ..

అల్లు అర్జున్, రాకా సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించాలనే విధంగా ఆలోచిస్తున్నారు. ఇప్పటివరకు ఈ చిత్రాల నుంచి వచ్చిన పోస్టర్స్ సైతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.పుష్ప, పుష్ప 2 చిత్రాలతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించిన అల్లు అర్జున్ ఈ చిత్రాలలో తనదైన యాక్టింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అభిమానులు కూడా అల్లు అర్జున్ స్టైల్ , మేనరిజానికి పడిపోయారని చెప్పవచ్చు. ఈ సినిమాతో సరికొత్త రికార్డులను తిరగ రాసిన అల్లు అర్జున్ మరి రాకా చిత్రంతో ఎలాంటి రికార్డులను తిరగరాస్తారో చూడాలి. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమాలో చేయబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. ఇందుకు సంబంధించి చిన్నపాటి గ్లింప్స్ విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. అలాగే పుష్ప 3 కూడా ఉంటుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you