Saturday, October 3, 2026
HomeLATESTNushrratt bharuccha:తాజ్ మహల్ హీరోయిన్ కి ప్రమాదం.. ఇప్పుడు ఎలా ఉందంటే..?

Nushrratt bharuccha:తాజ్ మహల్ హీరోయిన్ కి ప్రమాదం.. ఇప్పుడు ఎలా ఉందంటే..?

Nushrratt bharuccha: తాజ్ మహల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన నుష్రత్ కి ప్రమాదం జరిగింది. ముఖ్యంగా ఆమె వెన్నెముక విరిగినట్లు ఆమె పి ఆర్ టీం ప్రకటించింది..

on
- Advertisement -banner Ad

Nushrratt bharuccha:నటి నుష్రత్ భరూచాకు తాజాగా ఊహించని ప్రమాదం జరిగింది. ఈమె ఇండోనేషియాలోని బాలిలో ఉన్న సమయంలో ప్రమాదానికి గురైనట్లుగా ఆమె టీమ్ అధికారికంగా వెల్లడించారు. ఈ ఘటనలో నటి నుష్రత్ వెన్నుముకకు ఫ్రాక్చర్ అయినట్లుగా వార్త వినిపిస్తోంది. ప్రస్తుతం ఈమె బాలిలోని ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు ఆమె టీమ్ కొన్ని గంటల క్రితం అధికారికంగా వెల్లడించింది. నుష్రత్ ఒక పని కోసం బాలికి వెళ్ళగా అక్కడ ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం తర్వాత వెంటనే ఆమె స్థానిక ఆసుపత్రిలో వైద్య చికిత్స కోసం వెళ్లినట్లుగా సమాచారం.

నుష్రత్ భరూచా వెన్నుముకకు సర్జరీ..

నుష్రత్ భరూచా (Nushrratt bharuccha)వెన్నుముకకు సర్జరీ అవసరమని వైద్యులు తెలియజేశారు. అవసరమైన శస్త్ర చికిత్సను అందించేందుకు ముంబైలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆమెను బాలి నుంచి ముంబైకి ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించినట్లు ఆమె టీం అధికారికంగా తెలియజేసింది. ఈ విషయం తెలిసిన అభిమానులు సైతం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? అనే వివరాలను ఆమె టీం అధికారికంగా తెలియజేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.నుష్రత్ వెన్నుముకకు గాయం కావడం చేత ఆమె గాయం నుండి కోలుకోవడానికి సుమారుగా కొన్ని నెలలపాటు విశ్రాంతి అవసరం ఉంటుందని వైద్యులు తెలియజేశారు.

- Advertisement -
Advertisement

also read:Chiranjeevi:అతడే రియల్ హీరో.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్..!

షూటింగ్స్ వాయిదా పడబోతున్నాయా?

ఈ గాయం వల్ల ఆమెకు రాబోయే వర్క్ కమిట్మెంట్స్ పైన తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నట్లు వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉండగా నుష్రత్ భరూచా ప్రస్తుతం పలు చిత్రాలలో బిజీగా ఉంది. బాలీవుడ్ లో లవ్ రంజన్ అనే ప్రాజెక్టులో ఆమె నటిస్తోంది. ఈమె తెలుగులో తాజ్ మహల్ అనే చిత్రంలో మాత్రమే నటించింది. అనంతరం మళ్లీ తెలుగులో మరే చిత్రంలో కూడా నటించలేదు. ప్రస్తుతం నుష్రత్ ముంబైలో సర్జరీ చేయించుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఆరోగ్యం అప్డేట్ పైన అభిమానులు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Aishwarya Lakshmi:రాకా సినిమాలో అవకాశం ఇప్పించండి.. హీరోయిన్ కామెంట్స్..!

నుష్రత్ సినిమా కెరియర్..

నుష్రత్ 2006లో జై సంతోషి మా అనే బాలీవుడ్ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో తాజ్ మహల్ సినిమాతో హీరోయిన్గా ఆకట్టుకుంది. అలాగే బాలీవుడ్లో చత్రపతి రీమిక్స్ సినిమా, లవ్ సెక్స్ ఔర్ దోకా, ప్యార్ క పంచనామా లాంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఈమె టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న ఒక యాక్షన్ చిత్రంలో కూడా కనిపించబోతోంది. వీరిద్దరి కాంబినేషన్లో కనిపించడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you