Wednesday, August 19, 2026
HomeLATESTTV:బుధవారం టీవీలో సినిమాల జాతర.. ఏ ఛానల్‌లో ఏ సినిమా అంటే?

TV:బుధవారం టీవీలో సినిమాల జాతర.. ఏ ఛానల్‌లో ఏ సినిమా అంటే?

TV:బుధవారం తెలుగు టీవీ ఛానళ్లలో సినీ ప్రియులకు అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ సిద్ధంగా ఉంది.

on
- Advertisement -banner Ad

TV:ఎప్పటిలాగే సినీ ప్రియులకు బుధవారం కూడా టీవీ ఛానళ్లు మంచి వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, రొమాంటిక్ డ్రామాలతో పాటు హాలీవుడ్ డబ్బింగ్ చిత్రాలు కూడా ప్రసారం కానున్నాయి. ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి సినిమాలను(TV) ఆస్వాదించాలనుకునేవారు ఈ షెడ్యూల్‌పై ఓ లుక్కేయొచ్చు.

డీడీ యాదగిరి :

ఉదయం 9 గంటలకు ‘బాయ్ కిల్స్ వరల్డ్’, మధ్యాహ్నం 2 గంటలకు ‘అ ఆ ఇ ఈ’, రాత్రి 9.30 గంటలకు ‘తాతయ్య ప్రేమలీలలు’ ప్రసారం కానున్నాయి.

- Advertisement -
Advertisement

ఈ టీవీ ఛానళ్లు:

ఈ టీవీలో ఉదయం 9 గంటలకు, అర్ధరాత్రి 12 గంటలకు ‘ఖైదీ నం. 786’ ప్రసారం అవుతుంది. ఈ టీవీ ప్లస్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ‘ఆనందమానందమాయే’ను చూడొచ్చు.

ఈ టీవీ సినిమాలో ఉదయం 7 గంటలకు ‘ఓసి నామరదలా’, 10 గంటలకు ‘ఇద్దరు అమ్మాయిలు’, మధ్యాహ్నం 1 గంటకు ‘బొబ్బిలి వంశం’, సాయంత్రం 4 గంటలకు ‘అల్లుడు గారు’, రాత్రి 7 గంటలకు ‘కమిటీ కుర్రోళ్లు’, రాత్రి 10 గంటలకు ‘రాజా వారు రాణి వారు’ ప్రసారం కానున్నాయి. మిడ్‌నైట్ 1 గంటకు ‘ఓసి నామరదలా’ మళ్లీ ప్రసారం అవుతుంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Mokshagna:నాలుగేళ్ల సస్పెన్స్‌కు తెర..మోక్షజ్ఞ సినీ అరంగేట్రానికి ముహూర్తం ఫిక్స్..!?

జెమిని ఛానళ్లు:

జెమిని టీవీలో ఉదయం 9 గంటలకు ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, మధ్యాహ్నం 3.30 గంటలకు ‘పవర్’ ఉన్నాయి. జెమిని లైఫ్‌లో ఉదయం 11 గంటలకు ‘అమరదీపం’, సాయంత్రం 4.30 గంటలకు ‘పెళ్లాం పిచ్చోడు’ ప్రసారం కానున్నాయి.

- Advertisement -
Advertisement

జెమిని మూవీస్‌: ‘సాహస సామ్రాట్’, ‘బావ బావమరిది’, ‘కూలీ’, ‘కరెంట్ తీగ’, ‘ఊసరవెల్లి’, ‘గజిని’ వంటి సినిమాలు వివిధ సమయాల్లో అలరించనున్నాయి.

ALSO READ:OTT:బర్త్‌డే పార్టీ అంటేనే వెన్నులో వణుకు పుట్టిస్తున్న సినిమా..ఓటీటీలో మోస్ట్ ట్రెండింగ్..!

జీ తెలుగు, జీ సినిమాలు:

బుధవారం జీ తెలుగు ఛానల్‌లో ఉదయం 9 గంటలకు ‘చూడాలని ఉంది’ సినిమా ప్రసారం కానుంది. అనంతరం సాయంత్రం 5 గంటలకు ‘కళ్యాణ వైభోగమే’ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించవచ్చు. ఇక జీ సినిమాస్‌లోనూ విభిన్న జానర్లకు చెందిన సినిమాలు సందడి చేయనున్నాయి. ‘కథాకళి’, ‘ఘర్షణ’, ‘బ్యూటీ’, ‘మారుతీనగర్ సుబ్రహ్మణ్యం’, ‘డీడీ నెక్ట్స్ లెవల్’, ‘నకిలీ’ వంటి చిత్రాలు ప్రసారం కానున్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ, థ్రిల్లర్ అంశాలతో కూడిన ఈ సినిమాలు ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి వినోదాన్ని ఆస్వాదించాలనుకునే వారికి మంచి ఎంపికగా నిలవనున్నాయి.

స్టార్ మా:

స్టార్ మా మూవీస్‌లో ‘కీడాకోలా’, ‘టక్ జగదీష్’, ‘ధమాకా’, ‘భీమ’, ‘వీరసింహారెడ్డి’, ‘మట్టి కుస్తీ’ వంటి చిత్రాలు ప్రసారం కానున్నాయి. స్టార్ మా గోల్డ్‌లో ‘సూర్య వర్సెస్ సూర్య’, ‘కాలా’, ‘యాక్షన్’, ‘పొలిమేర 2’తో పాటు పలు సినిమాలు ఉన్నాయి. మొత్తంగా బుధవారం టీవీ ఛానళ్లలో సినిమాల సందడి ఉండనుంది. మీకు నచ్చిన చిత్రాన్ని ఎంచుకుని ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు..!

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you