OTT:థియేటర్స్‌లో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా సరే.. ఓటీటీలో వచ్చే సినిమాలకు క్రేజ్ మాత్రం అంతకంతకూ పెరిగిపోతుంది. కరోనా తర్వాత సినిమాలను థియేటర్లలో చూడడం కంటే, ఓటీటీలో రిలీజ్ అయ్యాక కుటుంబంతో కలిసి తక్కువ రేటుతోనే హ్యాపీగా చూడొచ్చు అనే భావన జనాల్లో ఎక్కువైపోయింది. దానికి తగ్గట్టే ఓటీటీలో వచ్చే సినిమాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటూ ఉండడంతో రోజురోజుకీ ఓటీటీలకు క్రేజ్ బాగా పెరిగిపోతుంది.
రియల్ స్టోరీలకు పెరుగుతున్న క్రేజ్:
ఈ మధ్యన నిజజీవిత సంఘటనలు, అదేవిధంగా ప్రముఖ వ్యక్తుల జీవితాల కథల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆడియన్స్ కూడా ఈ రియల్ స్టోరీలను చూసేందుకు, ఆ విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీలో రియల్ క్రైమ్ స్టోరీలకు భారీ వ్యూయర్‌షిప్ ఉంటుంది. అందుకే ఈ మధ్యన ఓటీటీలో కూడా ఎక్కువగా ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలనే తీసుకొస్తున్నాయి.
ఇప్పుడు అలాంటి ఒక సినిమా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ ఓటీటీలో(OTT) దుమ్ము దులిపేస్తుంది. ఇదో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా దర్శకుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు తన జీవితంలో జరిగిన యదార్థ సంఘటననే కథగా మలిచి ఈ మూవీని తెరకెక్కించాడు. బర్త్‌డే పార్టీలో ఫ్రెండ్‌షిప్ పేరుతో వేసిన వెక్కిలి వేషాలు ఓ మనిషి నిండు ప్రాణాలను ఎలా బలి తీసుకున్నాయి అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.
also read:Anupama:మహిళగా పుట్టినందుకు సిగ్గుపడేలా చేశాడు.. మాజీ బాయ్ ఫ్రెండ్ పై అనుపమ షాకింగ్..!
బర్త్‌డే పార్టీలో ఊహించని ట్విస్ట్:
బాలు, అర్జున్, వెంకట్, సాయి, సత్తి క్లోజ్ ఫ్రెండ్స్‌గా అమెరికాలో చదువుకుంటూ ఉంటారు. అంతా సాఫీగా జరిగిపోతుందిలే అనుకున్న సమయంలో బాలు పుట్టినరోజు వస్తుంది. అమెరికాలో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. అయితే ఈ సెలబ్రేషన్స్ హద్దులు మీరిపోతాయి. అనుకోకుండా ఓ ప్రమాదంలో బాలు చనిపోతాడు. దీంతో ఆయన ఫ్రెండ్స్ అందరూ చాలా డీలా పడిపోతారు. బాధపడిపోతారు. సాయం కోసం అర్జున్ సోదరుడు భరత్‌ను పిలుస్తారు. అయితే ఇక్కడ ట్విస్ట్ మొదలవుతుంది. లాయర్ అయిన ఇతడు చనిపోయిన బాలు తల్లిదండ్రులకు విషయం చెప్పి అమెరికా రప్పించడం వరకు బాగానే ఉంటుంది.
also read:Toxic:యష్ ‘టాక్సిక్’పై భారీ హైప్.. టికెట్ల బుకింగ్స్ ఎప్పటినుంచంటే?
అసలు బాలు ఎలా చనిపోయాడు?:
మరి బాలు ఎలా చనిపోయాడు? లేదా చంపేశారా? చివరకు ఏమైంది? అసలు ఫ్రెండ్స్ ఎలా బాలు మరణాన్ని కనుగొనగలిగారు? అనేదే అసలు స్టోరీ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి నిమిషం సరైన ట్విస్టులతో గూస్‌బంప్స్ తెప్పించే విధంగా ఉంటుంది. ఈ సినిమా పేరు ‘ది బర్త్‌డే బాయ్’. విక్కీ దాసరి తెరకెక్కించిన ఈ సూపర్ క్రైమ్ థ్రిల్లర్‌లో రాజీవ్ కనకాల కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో అందుబాటులో ఉంది. ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా థ్రిల్లింగ్ ఫీల్ అవుతారు. సస్పెన్స్ సినిమా ఇష్టపడే వాళ్లకి ‘ది బర్త్‌డే బాయ్’ కచ్చితంగా నచ్చుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఓటీటీలో ఇప్పుడు ఈ సినిమా దుమ్ము దులిపేస్తుంది.




