sukrithi:కొన్ని చిత్రాలలో నటించిన పాత్రల వల్ల నటీనటుల పేర్లు అలాగే గుర్తుండిపోతాయి. అలా కేరింత చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి సుకృతి(sukrithi) అంబటి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రంలో భావన అనే పాత్రలో అద్భుతంగా నటించి తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది సుకృతి. ఈ సినిమా మంచి విజయం అందించినప్పటికీ ఆ తర్వాత 2021 లో జాంబిరెడ్డి అనే సినిమాలో కూడా నటించింది. ఆ తర్వాత సినిమాలకి దూరంగా ఉంటూ తన వ్యక్తిగత జీవితానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పుడు తాజాగా అభిమానులతో ఒక శుభవార్తను పంచుకుంది.
పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కేరింత హీరోయిన్..
తాను పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్టుగా సోషల్ మీడియా వేదికగా అధికారికంగా తెలియజేస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అభిమానులు, తోటి నటీనటులు ఈ జంటకు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఢిల్లీ ప్రాంతానికి చెందిన సుకృతి చదువుకునే రోజులలోనే తనకు నటన పైన, డ్యాన్సర్ పైన మక్కువ ఉండడంతో కేరింత సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సినిమాలకు దూరమై 2022 డిసెంబర్లో అక్షయ సింగ్ ను వివాహం చేసుకుంది. కొన్నేళ్లు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న ఈ జంట ఈ ఏడాది తల్లిదండ్రులు కాబోతున్నామనే శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు.
also read:Manchu Lakshmi :రాకా సినిమాపై మంచు లక్ష్మీ అదిరిపోయే అప్డేట్..!
జీవితంలో కొత్త వెలుగు..
అనంతరం సోషల్ మీడియాలో కూడా బేబీ బంప్ ఫోటోలను షేర్ చేయగా.. అవి చాలా ట్రెండీగా మారిపోయాయి. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటుంది సుకృతి. ఇప్పుడు మాతృత్వ మధురిమలను ఆస్వాదిస్తూ అమ్మగా తన కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. సుకృతి తన చిన్నారి రాకతో తమ జీవితంలో ఎంతో వెలుగు నిండిందని ఆమె సంతోషాన్ని తెలియజేస్తూ ఒక పోస్ట్ షేర్ చేసింది. ఇందుకు సంబంధించి ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.
also read:Jabardasth Pavitra:ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న జబర్దస్త్ లేడీ కమెడియన్..
సుకృతి కెరియర్..
మరి సుకృతి రాబోయే రోజుల్లోనైనా తిరిగి మళ్లీ సినిమాలలో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కేవలం ఒకే ఒక సినిమాతో తన పాత్రతో అందరిని ఆకట్టుకున్న సుకృతి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సోషల్ మీడియాలో భారీగానే ఉంది. అప్పుడప్పుడు పలు రకాల మీమ్స్ కూడా సుకృతి చెప్పిన డైలాగుల రూపంలో వైరల్ గా మారుతుంటాయి. సుకృతి ఢిల్లీలో విద్యను పూర్తి చేసి రాజస్థాన్లోని వనస్థలి విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో డిగ్రీని పూర్తి చేసింది. చిన్న వయసు నుంచే కాలేజీలలో స్కూళ్లలో డాన్స్ కాంపిటీషన్లలో పాల్గొనేది.
https://www.instagram.com/p/DcQtdBGstR9/?utm_source=ig_web_copy_link&igsi=NTc4MTIwNjQ2YQ==




