Monday, August 24, 2026
HomeLATESTHyper Aadi:హైపర్ ఆది టంగ్ స్లిప్..NTR ఫ్యాన్స్ ఫైర్..మధ్యలో మహేశ్ ఎందుకు వచ్చాడు..?

Hyper Aadi:హైపర్ ఆది టంగ్ స్లిప్..NTR ఫ్యాన్స్ ఫైర్..మధ్యలో మహేశ్ ఎందుకు వచ్చాడు..?

Hyper Aadi:హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.దీంతో ఎన్టీఆర్ అభిమానులు లైన్లోకి వచ్చారు.

on
- Advertisement -banner Ad

Hyper Aadi:సెలబ్రిటీలు ఏం మాట్లాడినా సరే ఆలోచించి మాట్లాడాలి అని పదేపదే సినీ ప్రముఖులు, పెద్దవాళ్లు సూచిస్తూ ఉంటారు. అయినా సరే కొన్ని కొన్ని సందర్భాలలో కొందరు తెలియకుండా మాట్లాడేసి అనవసరంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కి గురవుతూ ఉంటారు. ఇప్పుడు హైపర్ ఆది అలాంటి చిక్కుల్లోనే ఇరుక్కున్నాడు.

హైపర్ ఆది కామెడీ టైమింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా:

హైపర్ ఆది(Hyper Aadi) అనగానే అందరికీ కాంక్రీట్ టైమింగ్ గుర్తొస్తుంది. ఎలాంటి సందర్భాన్నైనా సరే కామెడీగా మార్చి తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకోవడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య అంటూ ఫ్యాన్స్ మాట్లాడుతూ ఉంటారు. జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ హైపర్ ఆది ఇప్పుడు పలు సినిమాలలో నటిస్తూ మంచి టాప్ పొజిషన్‌లో ఉన్నాడు.

- Advertisement -
Advertisement

చిరంజీవి గురించి హైపర్ ఆది వ్యాఖ్యలు:

చిరంజీవి గురించి ఆయన మాట్లాడిన మాటలు రీసెంట్‌గా ఎంత ట్రెండ్ అయ్యాయో అందరికీ తెలిసిందే. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లో జరిపిన వేడుకల్లో ఆయన స్పీచ్ అదరగొట్టేశారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపిస్తూ, ఆయన సినీ జీవితం గురించి, సినీ ప్రస్థానం గురించి, ఆయన ఎదుర్కొన్న కష్టాల గురించి, ఇండస్ట్రీలోకి వచ్చాక ఆయన చేసిన సేవల గురించి అద్భుతంగా కొనియాడారు.

మహేష్ బాబు పేరును ప్రస్తావించడంతో:

అయితే ఇదే క్రమంలో మధ్యలోకి మహేష్ బాబును కూడా లాగారు. ‘వారణాసి’ సినిమాతో మహేష్ బాబు బిజీగా ఉన్నారు అంటూ మాట్లాడిన హైపర్ ఆది, మహేష్ బాబుకి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తర్వాత ఇష్టమైన హీరో చిరంజీవి అనేటట్లు మాట్లాడాడు అన్న ప్రచారం జరుగుతుంది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

- Advertisement -
Advertisement

also read:Manchu Lakshmi :రాకా సినిమాపై మంచు లక్ష్మీ అదిరిపోయే అప్డేట్..!

లైన్‌లోకి వచ్చిన ఎన్టీఆర్ అభిమానులు:

దీంతో ఎన్టీఆర్ అభిమానులు లైన్లోకి వచ్చారు. గతంలో మహేష్ బాబు నటించిన ‘బిజినెస్‌మ్యాన్’ సినిమా ఈవెంట్‌లో పూరి జగన్నాథ్ మహేష్ బాబును ఇష్టమైన హీరో ఎవరు అని అడగ్గా, కృష్ణ గారు అంటూ సమాధానమిచ్చారు. ఆ తర్వాత ఎవరు అని అడగ్గా సీనియర్ ఎన్టీ రామారావు గారు అంటూ ఆన్సర్ ఇచ్చారు.ఆ వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ చేస్తున్నారు. మహేష్ బాబుకి తన తండ్రి తర్వాత ఇష్టమైన హీరో సీనియర్ ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు కాదు. ఎందుకు ఈ విధంగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద రాద్ధాంతం చేసేస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్..!

మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఫైర్:

మరో పక్క మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా లైన్లోకి వచ్చారు. అసలు అవసరమే లేని చోట మహేష్ బాబు పేరు ఎత్తడం తప్పు. ఆ తర్వాత మహేష్ బాబు పేరుని ఈ విధంగా ట్రోల్ చేయడం ఇంకా తప్పు. మా హీరో జోలికి ఎందుకు వస్తున్నారు అంటూ మండిపడుతున్నారు.ఇప్పుడు హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చూడాలి ఇది ఎక్కడ వరకు వెళ్తుందో, ఎలా ఫుల్‌స్టాప్ పడుతుందో..??

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you