Nithya Menon:ప్రస్తుతం సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో యమ హాట్ టాపిక్ గా ట్రేండ్ అవుతుంది హీరోయిన్ నిత్యామీనన్. ఈమె గురించి అందరికీ తెలిసిందే. చక్కగా ఉంటుంది.. అంతకన్నా బాగా నటిస్తుంది. అందరినీ గౌరవిస్తుంది. మరీ ముఖ్యంగా ఆమె మంచితనం, ఆమె ఇచ్చే రెస్పెక్ట్ సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్స్‌కి కూడా చాలా ఇష్టం. చాలా మంది స్టార్స్‌తో నటించిన నిత్యామీనన్‌కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.
నిత్యామీనన్ పెళ్లి చేసుకోబోతుందా?
నిత్యామీనన్ (Nithya Menon)పెళ్లి చేసుకోబోతుంది అనే వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో బాగా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి నిత్యామీనన్ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. దానికి కారణం నిత్యామీనన్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్. గతంలో ఆమె పెళ్లి, పిల్లలపై చేసిన కామెంట్స్ ఎంత వివాదాస్పదంగా మారాయో అనేది అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆమె పెళ్లి వార్త బాగా హీట్ పెంచేస్తుంది.
తల్లిదండ్రులు చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటుందా?
అయితే ఇప్పుడు ఆమె తన ఒపీనియన్‌ను మార్చుకున్నట్లు, తన తల్లిదండ్రులు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు ఓ న్యూస్ సోషల్ మీడియా సర్కిల్స్‌లో బాగా ట్రెండ్ అవుతుంది. వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. నిత్యామీనన్ తన తల్లిదండ్రులు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుందట.
also read:Hero Ajith:రేసింగ్ లో హీరో అజిత్ కి ప్రమాదం!
గతంలో నిత్యామీనన్ ఏమన్నారు? :
గతంలో దీనికి సంబంధించి నిత్యామీనన్ పూర్తిగా నెగిటివ్‌గా మాట్లాడింది. ఒక అబ్బాయి గురించి ఏమీ తెలియకుండా పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఇబ్బంది పడడం కన్నా.. ఆ అబ్బాయి గురించి అన్ని తెలుసుకుని, మనకి సరిపోతాడా లేదా అని అనుకున్న తర్వాతే పెళ్లి వరకు వెళ్లడం కరెక్ట్ అన్నదానికి నిత్యామీనన్ ఓటు వేసింది.
also read:Anasuya:కట్టు బొట్టుపై అనసూయ సంచలన వీడియో..!
పెళ్లి బాధ్యతను తల్లిదండ్రులకు అప్పగించిందా? :
కానీ ఇప్పుడు తన రియల్ లైఫ్‌లో మాత్రం పూర్తిగా వేరే విధంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. నిత్యామీనన్ తన పెళ్లి బాధ్యతను పూర్తిగా పెద్దలకు ఇచ్చేసిందట. అమ్మానాన్న చెప్పిన వ్యక్తినే చేసుకోబోతుందట. అమ్మానాన్న చూపించిన కుర్రాడినే పెళ్లి చేసుకోబోతుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.
నిత్యామీనన్‌ను పెళ్లి చేసుకోబోయే లక్కీ పర్సన్ ఎవరు?:
హైలెట్ ఏంటంటే.. తన ఇన్నేళ్ల కెరీర్లో ఎప్పుడూ కూడా నిత్యామీనన్ ఈ హీరోతో డేటింగ్ చేస్తుంది, ఆ హీరోని పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్తలు ఏమీ రాలేదు. అంత నీతి, నిజాయితీగా ఉంటుంది నిత్యామీనన్. అలాంటి నిత్యామీనన్‌ను పెళ్లి చేసుకోబోయే లక్కీ పర్సన్ ఎవరు అంటూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తుంది. చూడాలి నిత్యా మీనన్ లైఫ్ లో కి రాబోయే స్పెషల్ పర్సన్ ఎవరు అనేది..




