Tuesday, August 25, 2026
HomeLATESTMadhuri Rathod:"జనాలకి ఆ వీడియోలు అంటేనే ఇంట్రెస్ట్"..మాధురి రాథోడ్ సెన్సేషనల్ కామెంట్స్..!

Madhuri Rathod:”జనాలకి ఆ వీడియోలు అంటేనే ఇంట్రెస్ట్”..మాధురి రాథోడ్ సెన్సేషనల్ కామెంట్స్..!

Madhuri Rathod:మాధురి రాథోడ్ చేసిన తాజా కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

on
- Advertisement -banner Ad

Madhuri Rathod:మాధురి రాథోడ్ ఈ పేరు సోషల్ మీడియాలో ఎంత హాట్ టాపిక్‌గా మారిందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్‌లో ఫోక్ డ్యాన్సర్‌గా బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌ల వ్యవహారం ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేసి పడేస్తుంది. గత మూడు రోజులుగా ఎక్కడ చూసినా సరే వీరిద్దరి గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు వీరిద్దరి మధ్య ఏమైంది? ఏం రహస్య గూడుపుఠాణి నడుస్తుంది? అనే విధంగా చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో అయితే వీళ్ల గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఒకే రూమ్‌లో కనిపించడంతో మొదలైన వివాదం:

తమదైన ఫోక్ సాంగ్స్‌తో తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వర్ సాయి, అదే విధంగా మాధురి ఒకే రూమ్‌లో కనిపించడంతో ఈ వివాదం స్టార్ట్ అయింది. సరిగ్గా అదే మూమెంట్‌లో ఈశ్వర్ సాయి భార్య అక్కడికి వెళ్లడంతో ఇది ఇంకా పెరిగిపోయింది. ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం, ఆ వీడియోలు బయటకు రావడం, సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం, జనాల నుంచి నెగెటివిటీ సంపాదించుకోవడం చకచకా జరిగిపోయాయి. ఈ వ్యవహారం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది.

- Advertisement -
Advertisement

ఇప్పటికే స్పందించిన ఈశ్వర్ సాయి:

అయితే ఈ వ్యవహారంపై ఇప్పటికే ఈశ్వర్ సాయి పలుసార్లు స్పందించాడు. నాకు మాధురికి ఎటువంటి సంబంధం లేదు, మా మధ్య ఫ్రెండ్‌షిప్ మాత్రమే అని చెప్పాడు. ఆమెతో ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడం వాస్తవమే కానీ, అది ఇంకా అంత దూరం పోలేదని, అంత దూరం వెళ్లే సీన్ కూడా లేదని ఈశ్వర్ సాయి ఉన్న విషయాన్ని ఓపెన్‌గా చెప్పేశాడు.

అదే విధంగా తాను ఎందుకు మాధురి రాథోడ్ రూమ్‌లో ఉన్నాను అనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చాడు. నేను కేవలం తన వాష్‌రూమ్ యూజ్ చేసుకోవడానికి మాత్రమే వెళ్లాను అని చెప్పాడు. ఎవరో కావాలని ఇది పక్కాగా ప్లాన్ చేసి, అదే సమయంలో వీడియో చిత్రీకరించి, భార్యను అక్కడికి రప్పించారని ఆయన చెప్పుకొచ్చాడు.

- Advertisement -
Advertisement

ALSO READ:Shiva Nirvana:ఇరుముడి నక్షత్ర గురించి డైరెక్టర్ శివ కామెంట్స్..!

మాధురి రాథోడ్ ఘాటైన కౌంటర్:

అయితే రీసెంట్‌గా దీనిపై మాధురి రాథోడ్( Madhuri Rathod) కూడా స్పందించారు. ఇప్పటివరకు సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్ గురించి వెటకారంగా కౌంటర్ ఇచ్చారు.

- Advertisement -
Advertisement

“నాకు తెలుసు.. జనాలకి అవసరమైన కంటెంట్ కంటే అనవసరమైన రాద్ధాంతాలు ఎక్కువ ఇష్టం. ప్రజలకు ఇలాంటి వాటిపై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. మంచి మంచి వీడియోలు ఎన్ని చేశాను.. ఒక్కటంటే ఒక్కటైనా ఆదరించారా? లేదు. ఇలాంటి గొడవలు, చెత్త రాద్ధాంతాలు, వివాదాలు అయితే మీకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది.30 రోజులుగా మినీ వ్లాగ్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించారా? అది ఎంత ఉపయోగకరమైన కంటెంట్ అయినప్పటికీ ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈ గొడవ మాత్రం ఎక్కువ మంది చూస్తున్నారు, రాద్ధాంతం చేస్తున్నారు, వైరల్ చేస్తున్నారు. జనాలకి అవసరమైన వాటిపై ఇంట్రెస్ట్ చూపరు. అనవసరమైన వాటిపై ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు” అంటూ ఘాటుగా కౌంటర్ వేసింది.

ALSO READ:TV:మంగళవారం సినిమా ట్రీట్.. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు అదిరిపోయే మూవీస్!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో:

ప్రస్తుతం ఈ ఫోక్ సింగర్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీనిపై కొంతమంది నెటిజన్లు ఆమెపై పాజిటివ్‌గా రియాక్ట్ అవుతుంటే, మరికొంతమంది మాత్రం “నువ్వు పెద్ద చేసింది మంచి పని అనుకుంటున్నావా?” అంటూ రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు. సోషల్ మీడియాలో మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి పేర్లు మారుమోగిపోతున్నాయి. దీనికి ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందో ఆ దేవుడికే తెలియాలి…

 

View this post on Instagram

 

A post shared by 🎬 CineAura (@just_chill_bro988)

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you