Friday, August 28, 2026
HomeLATESTChiranjeevi:ఇరుముడి సినిమాపై చిరంజీవి ట్వీట్ వైరల్!

Chiranjeevi:ఇరుముడి సినిమాపై చిరంజీవి ట్వీట్ వైరల్!

Chiranjeevi:ఇరుముడి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నా ప్రియ సోదరుడు రవితేజ కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు చిరంజీవి

on
- Advertisement -banner Ad

Chiranjeevi:గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న హీరోలలో టాలీవుడ్ మాస్ హీరో రవితేజ కూడా ఒకరు. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం ఇరుముడి. ఈ సినిమా డివోషనల్ థ్రిల్లర్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. రవితేజ కెరియర్ లోనే ఎప్పుడూ లేనంతగా కలెక్షన్స్ రాబట్టడం కూడా గమనార్హం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కించారు ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. సినిమా చూసిన ప్రేక్షకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇరుముడి మూవీ పై చిరంజీవి ప్రశంసలు..

తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కూడా రవితేజ నటించిన ఇరుముడి సినిమా పైన ప్రశంసలు కురిపించారు.. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది. ఇరుముడి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నా ప్రియ సోదరుడు రవితేజ కి హృదయపూర్వక అభినందనలు. సినిమా ప్రారంభం నుంచి ముగించే వరకు కూడా పూర్తిగా సినిమాని ఆస్వాదించాను. రవితేజ చాలా అద్భుతంగా నటించడమే కాకుండా త్రినాథ్ పాత్రను కూడా తన భుజాలపైనే మోసినట్టుగా కనిపించింది. డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాని చాలా ఎమోషన్స్ తో అద్భుతంగా తెరకెక్కించారని, అలాగే బేబీ నక్షత్రకు ఉజ్వల భవిష్యత్తు ఉందంటూ చిత్ర బృందానికి , నిర్మాతలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

- Advertisement -
Advertisement

also read:Venu Swamy:హీరో, హీరోయిన్ సూసైడ్ చేసుకుని చనిపోతారు.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్..!

సినిమా విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం – చిరంజీవి

అంతేకాకుండా ఒక సినిమా విజయం సినీ పరిశ్రమలో అందరికీ పండుగ. ఈ పరిశ్రమ అందరిది. ఏ కొందరిదో కాదు మనం బతకాలి ఇతరులను కూడా బతికించాలి అంటూ చిరంజీవి ట్వీట్ చేయడం గమనార్హం. ఈ విషయానికి వెంటనే రవితేజ రిప్లై ఇస్తూ.. అన్నయ్య థాంక్యూ సో మచ్ అంటూ రీ ట్వీట్ చేయడం వైరల్ గా మారింది. ఇరుముడి సినిమా విషయానికి వస్తే.. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రవితేజకు జోడిగా ప్రియా భవాని శంకర్ మొదటిసారి నటించింది.

- Advertisement -
Advertisement

also read:Allu Arjun:అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం..!

150 కోట్లకు పైగా కలెక్షన్స్..

అలాగే బేబీ నక్షత్ర, సాయికుమార్, అజయ్ ఘోష్ తదితర నటీనటులు ఇందులో కీలకమైన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సంగీతం జీవి ప్రకాష్ కుమార్ అందించారు. 40 కోట్లతో నిర్మించిన ఈ సినిమా 150 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు వినిపిస్తోంది. ఇలా సినీ ప్రముఖులు కూడా ఈ సినిమా పైన ప్రశంసలు కురిపిస్తూ ఉండడంతో సినిమా మైలేజ్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. సినిమా సక్సెస్ మీట్ లో కూడా చిత్ర బృందం ఈ సినిమా కోసం పడిన కష్టాన్ని తెలియజేశారు. మరి రాబోయే రోజుల్లో ఇరుముడి సినిమా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి మరి. రవితేజ తదుపరి చిత్రాన్ని కూడా ప్రముఖ నిర్మాత అయిన దిల్ రాజు తో నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you