Irumudi movie:టాలీవుడ్ మాస్ హీరో రవితేజ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఇరుముడి(Irumudi movie). ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది. విడుదలైన నాలుగు రోజులలోనే రూ రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరిన ఈ సినిమాకి ఇప్పటికీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. డైరెక్టర్ శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రియా భవాని శంకర్ హీరోయిన్గా నటించగా, బేబీ నక్షత్ర ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది. రెండో వారంలో అడుగుపెట్టిన ఇరుముడి చిత్రం చాలాచోట్ల హౌస్ ఫుల్ రన్ తోనే కొనసాగుతోంది.
ఇరుముడిలో అభ్యంతరకర సన్నివేశాలు..
కంటెంట్ పరంగా అభిమానులను ఆకట్టుకున్నప్పటికీ సినిమాలలో కొన్ని సీన్స్ తీవ్రదుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా విద్యా వ్యవస్థను, ప్రభుత్వ పాఠశాలను తప్పుగా చూపించారని ఉపాధ్యాయులు తీవ్రస్థాయిలో చిత్ర బృందం పైన ఫైర్ అవుతున్నారు. సినిమాలో ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయులను కించపరిచేల సీన్స్ ఉన్నాయంటూ ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ సమైక్య తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. Aptf నేతలు చెన్నుపాటి మంజుల, బసవలింగరావు తో పాటుగా మరికొంతమంది ఈ వ్యవహారం పైన చాలా ఘాటుగానే స్పందిస్తున్నారు. సినిమా అనేది సమాజం పైన బలమైన ప్రభావం చూపించే అంశమని..అలాంటప్పుడు విద్యారంగం పైన ఇలాంటివి చూపించడం తప్పు అంటూ మండిపడ్డారు.
also read:OTT:వార్తలో పేరు వస్తే మరణం ఖాయం.. ఈ సిరీస్ చూస్తే షాక్ అవుతారు!
సమాజంపై మాయని మచ్చ..
ప్రభుత్వ బడులు, ఉపాధ్యాయుల పట్ల ప్రజలలో అపోహలు పెంచే విధంగా ఇందులో సీన్స్ ఉన్నాయని వాటిని వెంటనే తొలగించాలంటూ APTF, యుటిఎఫ్ సంఘాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి ఈ వివాదం పెద్దదవ్వడం చేత ఉభయగోదావరి జిల్లాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి తాజాగా ఈ విషయం పైన రంగంలోకి దిగారు. ఇటీవలే గోదావరి జిల్లా భీమవరంలో తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి ఈ విషయం పైన లేఖ రాసినట్లుగా తెలియజేశారు. ఈ విషయం పైన ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని అలాంటి సన్నివేశాలను శాశ్వతంగా తొలగించేలా నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
also read:Hi Movie Review:హాయ్ మూవీ రివ్యూ: నయనతార, కవిన్ లవ్‌స్టోరీ ఎలా ఉంది?
నారా లోకేష్ కి లేఖ.. ప్రభుత్వం స్పందిస్తుందా?
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం లో సీలేరు ప్రాంతంలో బాలికోన్నత పాఠశాల బోర్డులు నేరుగా చూపించడం, అలాగే విద్యార్థులు ప్రభుత్వం ఇచ్చిన దుస్తులను చూపించడం సమంజసం కాదు అని అదే పాఠశాలలో పనిచేసే ఒక ప్రధానోపాధ్యాయురాలు పాత్రను కూడా చాలా క్రూరంగా చూపించడం అనేది ఉపాధ్యాయ వర్గానికి మాయని మచ్చ అంటూ మాట్లాడారు. ప్రత్యేక తరగతుల పేరుతో విద్యార్థులను స్థానిక ఎమ్మెల్యేల వద్దకు పంపించేలా ఉన్న దృశ్యాలు కూడా అభ్యంతరాన్ని తెలియజేసేలా ఉన్నాయని, వీటివల్ల ప్రజలలో తప్పుడు అభిప్రాయాలు వెళ్లే అవకాశం ఉంటుందంటూ ఎమ్మెల్సీ బొర్రా గోపి ఆవేదన తెలిపారు. మరి ఈ విషయం పైన మంత్రి నారా లోకేష్ ఏ విధమైనటువంటి క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.




