Wednesday, September 2, 2026
HomeLATESTMadhuri Rathod:మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయికి షాక్.. పోలీసుల కీలక నిర్ణయం!

Madhuri Rathod:మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయికి షాక్.. పోలీసుల కీలక నిర్ణయం!

Madhuri Rathod:ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయిపై తోటి డ్యాన్సర్ మాధురి రాథోడ్ సంచలన ఆరోపణలు చేశారు.

on
- Advertisement -banner Ad

Madhuri Rathod:గత కొన్ని రోజులుగా ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో ఆటోపిక్‌గా ట్రెండ్ అవుతుందో అందరికీ తెలిసిందే. తోటి డాన్సర్ మాధురి రాథోడ్ ఆయనపై కేసు పెట్టడంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఒకే రూమ్‌లో ఉండడంతో ఈశ్వర్ సాయి భార్య వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం అందరికీ తెలిసిందే.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వ్యవహారం :

ఆ తర్వాత దాని గురించి అటు మాధురి, ఇటు ఈశ్వర్ సాయి కొన్ని రీల్స్ చేసినా, అవి ఏవీ జనాలు నమ్మట్లేదు. ఇదే విషయం కారణంగా చాలామంది వాళ్లిద్దరినీ ట్రోల్ చేశారు. ఈశ్వర్ సాయి అయితే ఒకసారి ఏదో ఉద్రేకంలో ఒకసారి వర్షం ఉపయోగించుకోవడానికి వెళ్లాను అని రకరకాలుగా చెప్పినప్పటికీ, జనాలు వాటిని కొట్టి పడేశారు. ఆయన క్యారెక్టర్‌పై అది తీవ్ర ప్రభావం చూపింది.

- Advertisement -
Advertisement

also read:Pragya Jaiswal: గౌన్ లో అందాలు ఆరబోస్తున్న బాలయ్య బ్యూటీ!

మాధురి రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు :

ఇలాంటి మూమెంట్‌లోనే ఈశ్వర్ సాయిపై తోటి డాన్సర్ మాధురి రాథోడ్ (Madhuri Rathod)హైదరాబాద్‌లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేసింది. దీనితో ఒక్కసారిగా వ్యవహారం మరింత హీట్ రాజుకుంది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి లొంగ తీసుకోవడమే కాకుండా, శారీరకంగా వాడుకొని, ఆమె ఫోన్‌లో నుంచి ఫొటోస్ తీసుకొని ఏఐ హెల్ప్‌తో వాటిని వల్గర్‌గా చిత్రీకరించి తన పరువుకి భంగం కలిగించే విధంగా చేశాడు అంటూ మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.

- Advertisement -
Advertisement

also read:Anand Deverakonda:పాన్ ఇండియా హీరో ఇంటికి కోడలు కాబోతున్న యంగ్ హీరోయిన్..?

ఏఐతో అసభ్యకర వీడియోలు సృష్టించారంటూ ఆరోపణలు :

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, తన ఫోన్‌లోని వ్యక్తిగత వీడియోలు, ఫొటోలను సేకరించి అసభ్యకరంగా ఏఐ సహాయంతో వీడియోలను సృష్టించాడని ఆరోపించింది. తనకు ఇతర వ్యక్తులతో సంబంధం ఉన్నట్లు క్రియేట్ చేసి, తన పరువుకి భంగం కలిగించే విధంగా చేశాడు అంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది.

- Advertisement -
Advertisement

ఈశ్వర్ సాయి కోసం పోలీసుల గాలింపు :

ఈశ్వర్ సాయిపై నార్సింగ్ పోలీసులు 69 బీఎన్‌ఎస్ చట్టంతో పాటు పలు సంబంధిత విభాగాలపై కూడా కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. పరారీలో ఉన్న నిందితుడు ఈశ్వర్ సాయిని అదుపులోకి తీసుకోవడానికి నార్సింగ్ పోలీసులు బాగా ట్రై చేస్తూ, రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ఏ క్షణం అయినా ఆయనని పట్టుకుని అరెస్ట్ చేసే విధంగా పరిస్ధితులు ఉన్నాయి.

ఏఐ సాంకేతికతను ఉపయోగించుకొని ఎవరైనా మహిళల పరువుకి భంగం కలిగించే విధంగా చేస్తే కఠినంగా వ్యవహరిస్తామంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఈశ్వర్ సాయి–మాధురి రాథోడ్ వ్యవహారం సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తుంది..!!

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you