అందాల తార , అభినయ సుందరి నయనతార గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో వరుస విజయాలతో లేడీ సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకుంది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ చిన్నది.. రీసెంట్గా టాక్సిక్ సినిమాలో గంగా పాత్రతో అదరగొట్టేసింది.
యశ్ హీరోగా, లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ.. మరికొంతమందిని మెప్పించలేదు . కానీ కలెక్షన్లు మాత్రం బాగా వస్తున్నట్లు సమాచారం.
ఇకపోతే ప్రస్తుతం హీరో కవిన్ హీరోగా వచ్చిన హాయ్ అనే చిత్రంలో నటించింది. మరోవైపు ఇంస్టాగ్రామ్ వేదికగా అందాలతో అబ్బురపరిచింది.
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే నయనతార తాజాగా వైట్ కలర్ చుడీదార్ ధరించి చందమామలా హాయిగా అనిపించింది.
మొత్తానికి నయనతార షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నాయి.