Dragon movie:టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం డ్రాగన్. ఈ సినిమా తెలుగు ఆడియన్స్ లోనే కాకుండా దక్షిణాది సినీ అభిమానుల పైన మరింత ఆసక్తి పెంచేస్తోంది. ఈ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా అభిమానుల అంచనాలను మరింత పెంచేస్తోందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ సినిమా స్టార్ క్యాస్టింగ్ అందరిని ఆశ్చర్యపరిచేలా ఉంది. ఇందులో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ నటిస్తున్నారు. వీరే కాకుండా మరికొంతమంది సెలబ్రిటీలు నటిస్తున్నట్లు తెలుస్తోంది.
డ్రాగన్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్..
ఇప్పుడు ఈ ప్రాజెక్టులోకి బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వినిపిస్తున్నాయి. వారు ఎవరో కాదు షాహిద్ కపూర్, ఆలియా భట్ కూడా నటించబోతున్నట్లు వినిపిస్తూ ఉండడంతో సినిమా పైన మరింత ఆసక్తి పెంచేస్తోంది. అయితే ఈ విషయంపై నిర్మాతల నుంచి ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. ఆలియా భట్ కు బాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ కలదు. గతంలో ఎన్టీఆర్ నటించిన RRR చిత్రంలో కూడా నటించింది. ఇప్పుడు డ్రాగన్(Dragon movie) సినిమాలో మరొకసారి ఆలియా నటించబోతోంది.
also read:Nayanthara: వైట్ చుడీదార్ లో చక్కగా ఆకట్టుకుంటున్న నయనతార!
ఎన్టీఆర్ కి గాయం.. ఆలస్యం అవుతున్న షూటింగ్..
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన సినిమాలలో ఎక్కువగా భారీ యాక్షన్ సీన్స్ మాస్ అంశాలని చాలా పుష్కలంగా చూపిస్తూ ఉంటారు. ఎన్టీఆర్ డ్రాగన్ లో కూడా అలాంటివే ఎక్కువగా ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు. గతంలో విడుదలైన గ్లింప్స్ కూడా సినిమా పైన అంచనాలను భారీగా పెంచేసింది. ఎన్టీఆర్ కి జోడిగా రుక్మిణి వసంత్ నటిస్తోంది. రుక్మిణి వసంత్ కి కూడా ఈ సినిమా సక్సెస్ చాలా కీలకమని చెప్పవచ్చు.ఈ చిత్రాన్ని 2027 జూన్ 11న భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. రానున్న రోజుల్లో ఈ క్రేజీ ప్రాజెక్టు నుంచి మరికొన్ని అప్డేట్స్ కూడా రాబోతున్నాయి. ఎన్టీఆర్ కి గాయం కావడం చేత సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోంది.
also read:Shruti Haasan: శృతిహాసన్ కి సపోర్టుగా కోర్టు తీర్పు..!
బాలీవుడ్ లో పాగా వేసే దిశగా అడుగులు..
ఎన్టీఆర్ చివరిగా 2025లో వార్ 2 చిత్రంలో నటించారు. ఈ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వగా ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. అందుకే ఈసారి ఎలాగైనా డ్రాగన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు. అలాగే దేవర 2 పైన ఇప్పటివరకు ఎలాంటి అధికారికంగా ప్రకటన కూడా రాలేదు. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం దేవర 2 చిత్రం ఉంటుంది అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు.




