OTT Weekend Releases:థియేటర్లలో బోలెడు సినిమాలు విడుదలయ్యాయి. సూపర్ డూపర్ హిట్ టాక్ దక్కించుకున్నాయి. బాగా జనాలను అట్రాక్ట్ చేస్తున్నాయి. కానీ థియేటర్‌కి వెళ్లి సినిమా చూడటానికి ఇష్టపడతారా? ఇంట్లో కూర్చొని ఓటీటీలో సినిమా చూడటానికి ఇష్టపడతారా అంటే.. వందలో 90 శాతం మంది ఇంట్లో కూర్చుని ఓటీటీలో సినిమా చూడటానికి ఇష్టపడతారు. కుటుంబంతో అంత సరదాగా కలిసి టీవీలో సినిమా చూడటానికి ఇష్టపడే జనాభా లిస్ట్ ఎక్కువే ఉంటుంది.
అయితే ఈ వీకెండ్ ఓటీటీ(OTT Weekend Releases) అలాంటి జనాల కోసం దుమ్ము రేపే కొత్త సినిమాలను, వెబ్ సిరీస్‌లను తీసుకొచ్చేసింది. మరెందుకు ఆలస్యం.. ఈ వీకెండ్ ఏ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది? ఏ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి? ఏ సినిమాలు ఏ కంటెంట్‌తో ఉన్నాయి? అనే విషయాలు ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం రండి.
కొరియన్ కనకరాజు – నెట్‌ఫ్లిక్స్ :
వరుణ్ తేజ్ హీరోగా, రితిక నాయక్ హీరోయిన్గా నటించిన సినిమా ‘కొరియన్ కనకరాజు’. తెలుగు హారర్ కామెడీగా మెర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ సంపాదించుకుంది. ఈ చిత్రం ఇప్పుడు సెప్టెంబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. కచ్చితంగా హారర్ అంటే ఇష్టం ఉన్న జనాలు ఈ సినిమాను చూసి ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు. ఎంజాయ్ చేస్తారు.
ALSO READ:Siva Nirvana:వైష్ణవి నడుము సీన్ పై డైరెక్టర్ శివ నిర్వాణ షాకింగ్ కామెంట్స్..!
ధమాల్ 4 – నెట్‌ఫ్లిక్స్ :
అజయ్ దేవగణ్, రితేష్ దేశ్‌ముఖ్ మరోసారి నవ్వులతో రచ్చ చేయడానికి తిరిగి వచ్చేశారు. సెప్టెంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘ధమాల్ 4’ ఈ వీకెండ్ చూడడానికి మంచి ఆప్షన్‌గా నిలిచింది. తమదైన స్టైల్లో నటించి జనాలను ఆకట్టుకున్నారు స్టార్స్. కచ్చితంగా ఈ వారం చూడదగ్గ సినిమాలలో ‘ధమాల్ 4’ కూడా ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
ALSO READ:TV:శనివారం టీవీలో వచ్చే సినిమాలివే!
ది జెంటిల్మెన్ సీజన్ 2 – నెట్‌ఫ్లిక్స్ :
గై రిచీ క్రైమ్ డ్రామా సిరీస్ సీక్వెల్లో జేమ్స్ ఖయోడేరియా మళ్లీ కలిశారు. ఎడ్డీ, సూసీల క్రిమినల్ వ్యాపారం ఎలా చిక్కుల్లో పడుతుందో ఈ షో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. కచ్చితంగా ఇది జనాలను అట్రాక్ట్ చేస్తుంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.
G.D.N. – నెట్‌ఫ్లిక్స్ :
ఈ బయోగ్రాఫికల్ డ్రామాలో ఆర్. మాధవన్ ఆవిష్కర్త, అంతేకాదు ఇంజనీర్ అయిన జీడీ నాయుడు పాత్రలో నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఉన్మాదం – సోనీ లివ్ :
ఈ మలయాళ సైకలాజికల్ డ్రామా థ్రిల్లర్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో కొంచకో బోబన్ ప్రధాన పాత్రలో నటించారు. ఒక పోలీస్ ఆఫీసర్, ఒక పాత కేసుకు సంబంధించిన కథ ఇది. పూర్తిగా చాలా ఇంట్రెస్టింగ్గా, సస్పెన్స్‌గా సాగుతుంది. ఒక్కొక్క సీను, ఒక్కొక్క ట్విస్ట్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. సెప్టెంబర్ 4 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ వచ్చేసింది.
ది కోర్ట్ – జియో హాట్‌స్టార్ :
‘ది కోర్ట్’ కూడా అభిమానులను బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇది తమిళ్ కోర్ట్ రూమ్ డ్రామా. ఈ వీకెండ్ కామెడీ, యాక్షన్ సినిమాలకు విభిన్నంగా సీరియస్‌గా సినిమా చూడాలనుకునే వారికి ‘ది కోర్ట్’ మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇందులో కోర్ట్‌రూమ్ డ్రామా, సస్పెన్స్, కామెడీకి సంబంధించిన అన్ని ఎలిమెంట్స్ కలిసి ఉన్నాయి. జియో హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
జగమే సంగీతం – ప్రైమ్ వీడియో :
‘జగమే సంగీతం’ సినిమాకి ఎలాంటి టాక్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ప్రేమ, వ్యక్తిగత ఆశయాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఇది తెలుగు మ్యూజికల్ డ్రామా. సంగీత ప్రధాన చిత్రాలను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. సెప్టెంబర్ 4 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.
గాంధారి – నెట్‌ఫ్లిక్స్ :
తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘గాంధారి’. తన కూతురి కోసం వెతికే తల్లి పాత్రలో తాప్సీ పన్ను అద్భుతంగా నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 3 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ‘గాంధారి’ సినిమా చాలా ఎమోషనల్‌గా టచ్ చేస్తుంది.
డీసీ – సన్నెక్స్ట్ :
వామిక గబ్బి హీరోయిన్గా, దర్శకుడు లోకేష్ కనకరాజ్ నటుడిగా రంగేట్రం చేసిన సినిమా ‘డీసీ’. ఈ సినిమా సెప్టెంబర్ 4న సన్‌నెక్స్ట్‌లో స్ట్రీమింగ్కి వచ్చేసింది. ఈ సినిమా జనాలను బాగా ఆకట్టుకుంటుంది. మంచి యాక్షన్ సీన్స్ ఇష్టపడే వాళ్లకి ఇది బాగా నచ్చుతుంది.
ఇలా పలు రకాల ఓటీటీల్లో లవ్, హారర్, క్రైమ్, సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు వచ్చేసి.. మరెందుకు ఆలస్యం? ఏ ఓటీటీలో మీకు నచ్చిన సినిమా ఉందో చూసి ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి.




