Sunday Special Movies on TV:ఆదివారం అంటే కుటుంబంతో కలిసి సరదాగా గడిపే రోజు. ఈ వీకెండ్‌ను మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చేందుకు తెలుగు టీవీ ఛానళ్లు అదిరిపోయే సినిమాలను ప్రసారం చేయనున్నాయి. చిరంజీవి నటించిన మాస్ ఎంటర్‌టైనర్‌లతో పాటు ‘అలా వైకుంఠపురములో’, ‘రారాసి’, ‘యూత్’ వంటి చిత్రాలు, ‘మల్లీశ్వరి’ లాంటి క్లాసిక్ మూవీ కూడా బుల్లితెరపై సందడి చేయనుంది. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన ఈ సినిమాల్లో మీకు నచ్చినది ఏ ఛానల్‌లో,(Sunday Special Movies on TV) ఏ సమయంలో వస్తుందో తెలుసుకోండి.
డీడీ యాదగిరి, ఈటీవీ ఛానళ్లు :
డీడీ యాదగిరిలో ఉదయం 9 గంటలకు హాలీవుడ్ తెలుగు డబ్ మూవీ “వెండెటా”, మధ్యాహ్నం 2 గంటలకు “పెదరాయుడు”, రాత్రి 9.30 గంటలకు చలం నటించిన “దేవుడమ్మ” ప్రసారం కానున్నాయి.
ఈటీవీ ప్లస్‌లో ఉదయం 9 గంటలకు “వినోదం”, మధ్యాహ్నం 12 గంటలకు “జేబుదొంగ”, సాయంత్రం 6.30 గంటలకు “దసరాబుల్లోడు”, రాత్రి 9.30 గంటలకు “మొండి మొగుడు పెంకి పెళ్లాం” ప్రసారం అవుతాయి. ఈటీవీ లైఫ్‌లో మధ్యాహ్నం 3 గంటలకు “గోమాత వ్రతం” టెలికాస్ట్ కానుంది. ఈటీవీలో మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 10.30 గంటలకు “ఆయనకి ఇద్దరు” ప్రసారం కానుంది.
ఈటీవీ సినిమా.. జెమిని ఛానళ్లలో :
ఈటీవీ సినిమాలో ఉదయం 7 గంటలకు శోభన్ బాబు నటించిన “మోసగాడు”, 10 గంటలకు “మల్లీశ్వరి”, మధ్యాహ్నం 1 గంటకు “యమధర్మరాజు ఎం.ఏ”, సాయంత్రం 4 గంటలకు “అల్లరోడు”, రాత్రి 7 గంటలకు “ఉషా పరిణయం”, 10 గంటలకు “గాడ్సే”, మిడ్‌నైట్ 1 గంటకు “మోసగాడు” ప్రసారం అవుతాయి.
జెమిని లైఫ్‌లో “పంచతంత్రం”, “దొరబాబు” ఉండగా.. జెమిని టీవీలో “అతిథి”, “రాక్షసుడు”, “వారసుడు”, “సోగ్గాడే చిన్ని నాయనా”, “అలా వైకుంఠపురములో”, “కిక్ 2” ప్రసారం కానున్నాయి. జెమిని మూవీస్‌లో “ఆలయదీపం”, “సంఘర్షణ”, “లేడీబాస్”, “గుండె జారి గల్లంతయ్యిందే”, “పంతం”, “హోలీ”, “ఆది”, “అన్న” చిత్రాలు సందడి చేయనున్నాయి.
also read:Priyanka Arul Mohan: పింక్ అవుట్ ఫిట్ లో ప్రియాంక అందాలు.. ఫోటోలు వైరల్!
జీ తెలుగు, జీ సినిమాలు :
జీ తెలుగులో “శివ”, “మై డియర్ భూతం”, “క్షేమంగా వెళ్లి లాభంగా రండి”, “యూత్”, “రాకాసి”, “మన శంకర వర ప్రసాద్”, “నాగవల్లి” సినిమాలు ఉన్నాయి. జీ సినిమాలులో “రంగ రంగ వైభవంగా”, “ఐస్మార్ట్ శంకర్”, “హైపర్”, “మామన్”, “ది రోడ్”, “K.G.F 2”, “కోమలి” ప్రసారం కానున్నాయి.
ALSO READ: Mirzapur Movie Review: ‘మీర్జాపూర్’ సినిమా రివ్యూ..ఓటీటీ మ్యాజిక్ వెండితెరపై పనిచేసిందా?
స్టార్ మా ఛానళ్లలో :
స్టార్ మా ఉదయం “RRR”, మధ్యాహ్నం “పుష్ప 2: ది రూల్” ప్రసారం చేసి, రాత్రి 7 గంటలకు బిగ్‌బాస్ లాంచ్‌ను ప్రసారం చేయనుంది. స్టార్ మా మూవీస్‌లో “అనుకోకుండా ఒకరోజు”, “సింహా”, “సీతారామరాజు”, “మగధీర”, “విరూపాక్ష”, “S/O సత్యమూర్తి”, “క్రాక్” సినిమాలు ఉన్నాయి.
స్టార్ మా గోల్డ్‌లో “మనీ మనీ”, “ఆడవాళ్లే అలిగితే”, “చంద్రలేఖ”, “దూసుకెళతా”, “మలయాళం చిత్రం మన్యంపులి”, “నమో వెంకటేశ”, “నవ మన్మథుడు” వంటి చిత్రాలు ప్రసారం కానున్నాయి.




