Tuesday, September 8, 2026
HomeLATESTChiranjeevi:విశ్వంభర సినిమాను మెగాస్టార్ పట్టించుకోలేదా..?

Chiranjeevi:విశ్వంభర సినిమాను మెగాస్టార్ పట్టించుకోలేదా..?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభరపై చిరు ఆసక్తి చూపించడం లేదు అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర. ఈ సినిమా ప్రాజెక్టు మొదలైనప్పుడు భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా చిరంజీవిని చూడబోతున్నారని, సరికొత్త ఫాంటసీ లోకంలో చూపించడంతో సినిమా పైన అభిమానులకు భారీగా అంచనాలు పెరిగిపోయాయి. విఎఫ్ఎక్స్ వల్ల ఈ సినిమా చాలాసార్లు వాయిదా పడడం జరిగింది. పైగా హీరో డైరెక్టర్ ఇద్దరు కూడా తమ తదుపరి చిత్రాలలో మునిగిపోవడంతో అసలు విశ్వంభర ప్రాజెక్ట్ ఉందా? ఆగిపోయిందా? అనే ప్రశ్నలు ఇప్పుడు అభిమానులలో మొదలవుతున్నాయి.

అనుమానాలు బలపడడానికి ముఖ్య కారణం?

ఇలాంటి అనుమానాలు బలపడడానికి ముఖ్య కారణం.. హీరో డైరెక్టర్ ఇతర ప్రాజెక్టుల వైపు వెళ్లడమే.. ఒకవైపు చిరంజీవి(Chiranjeevi) తన తదుపరిచిత్రం కాకా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. పూర్తిగా ఈ సినిమా పైనే ప్రత్యేకించి మరి దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. డైరెక్టర్ వశిష్ట కూడా విశ్వంభర ప్రాజెక్టును పక్కన పెట్టి మరి బాలయ్య కుమారుడు ఎంట్రీ మూవీ ప్రాజెక్టు పైనే ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఇలా ఒక భారీ సినిమా రిలీజ్ కి ముందే అటు హీరో, డైరెక్టర్ ఇద్దరు కూడా వదిలేసి వేరువేరు ప్రాజెక్టులలో బిజీ కావడం చాలా అరుదుగా జరుగుతుంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Kavya Shree: స్టైలిష్ లెహంగాలో ఆకట్టుకుంటున్న కావ్య శ్రీ.. ఫోటోలు వైరల్!

ఇదంతా రూమరేనా?

దీంతో విశ్వంభర సినిమా భవిష్యత్తు పైన పలు రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొదట ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా రాబోతోందంటూ ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని కారణాల చేత 2026 సమ్మర్ కి వాయిదా వేసినట్లు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటికీ గడువు ముగిసినా…ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. గత కొద్ది రోజులుగా ఈ సినిమాని మేకర్స్ దసరా సీజన్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారంటూ ప్రచారం జరిగినా.. ఇప్పటివరకు ఈ సినిమా పైన ఎలాంటి అధికారికంగా ప్రకటన వెలబడలేదు.

- Advertisement -
Advertisement

ALSO READ:OTT:’విశ్వనాథ్ అండ్ సన్స్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

అసలు నిజం ఏంటి?

దీంతో మెగాస్టార్ నటిస్తున్న విశ్వంభర సినిమా అసలు ఎప్పుడు వస్తుందో తెలియక మెగా అభిమానులు కూడా నిరాశలో ఉన్నారు. కానీ విశ్వసనీయ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగిపోలేదని కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అవుతోందట. సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని, సంగీత దర్శకుడు గౌర హరి తన రీ రికార్డింగ్ వర్క్ ను కూడా పూర్తి చేసినట్టుగా వినిపిస్తోంది. విశ్వంభర చిత్రానికి సంబంధించి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పలు కీలకమైన సన్నివేశాల ఔట్పుట్ కూడా అద్భుతంగా ఉన్నట్లు వినిపిస్తోంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా, ఇషా చావ్లా, ఆశిక రంగనాథ్, మౌని రాయ్, సురభి తదితర నటీనటులు నటిస్తున్నారు. మరి ఈ సినిమా విడుదల పైన ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you