Thursday, September 10, 2026
HomeLATESTBigg Boss:నందు బిగ్ బాస్ ఎంట్రీపై బాంబ్ పేల్చిన సంధ్యారెడ్డి.. నాగార్జునకు స్ట్రాంగ్ వార్నింగ్!

Bigg Boss:నందు బిగ్ బాస్ ఎంట్రీపై బాంబ్ పేల్చిన సంధ్యారెడ్డి.. నాగార్జునకు స్ట్రాంగ్ వార్నింగ్!

Bigg Boss:బిగ్ బాస్ తెలుగు 10పై సంధ్యారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు నాగార్జునకు కూడా ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

on
- Advertisement -banner Ad

Bigg Boss:”రమా నందన” అనే పేరు చెబితే గుర్తుపట్టే జనాలు చాలా తక్కువగా ఉండొచ్చు. నందు అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఆమె నందు అంటూ కచ్చితంగా వేలాది మంది గుర్తుపడతారు. అంతలా పాపులారిటీ సంపాదించుకుంది రమా నందన అలియాస్ నందు. ‘యూట్యూబ్ నందూస్ వరల్డ్’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తి. అయితే ఇప్పుడు ఊహించని చిక్కుల్లో ఇరుక్కుంది.

యూకే వీసాల పేరుతో మోసం? :

యూకేలో స్పాన్సర్‌షిప్ వీసాలు ఇప్పిస్తామంటూ అమాయక జనాల దగ్గర భారీగా డబ్బులు వసూలు చేసి హ్యాండ్ ఇచ్చి, ఇప్పుడు ఊహించని చిక్కులు ఎదుర్కొంది. రెండు రోజుల క్రితమే హైదరాబాద్‌లోకి అడుగుపెట్టిన నందనను ఇమిగ్రేషన్ అధికారులు పక్కాగా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోంది. రమా నందన మాత్రం ‘‘నేను ఏమీ తప్పు చేయలేదు.. అంతా మీడియానే చేసింది’’ అంటూ మీడియా ముందు ఫైర్ అవుతుంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Bigg Boss:బిగ్ బాస్ హౌస్ నుంచి గోడ దూకి పారిపోయేందుకు కంటెస్టెంట్ ప్రయత్నం..!

బిగ్ బాస్‌లోకి వెళ్లేందుకే ఇండియాకు వచ్చిందా? :

అయితే ఇలాంటి మూవ్‌మెంట్‌లోనే అసలు నందన ఇండియాకు ఎందుకు వచ్చింది అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్(Bigg Boss) 10లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి వెళ్లడానికే రమా నందన యూకే నుంచి ఇండియాకు వచ్చింది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement

ALSO READ:TV:గురువారం టీవీలలో ఈ సినిమాలు మిస్ కావొద్దు!

నందు బిగ్ బాస్ ఎంట్రీపై సంధ్యారెడ్డి ఫైర్ :

ఈ మూవ్‌మెంట్‌లో కాంగ్రెస్ ప్రముఖ నాయకురాలు సంధ్యారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఒకవేళ నిజంగానే నందనను బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా పిలిపించుకుంటే, బిగ్ బాస్ టీమ్‌తో పాటు హోస్ట్ నాగార్జున కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

- Advertisement -
Advertisement

తాజాగా ఒక ఇంటర్వ్యూకు హాజరైన సంధ్యారెడ్డి నందన బిగ్ బాస్ ఎంట్రీ వార్తల పై స్పందించారు. నిరుద్యోగులను మోసం చేసినందున బిగ్ బాస్ హౌస్‌లోకి ఎలా తీసుకొస్తారు? అలా తీసుకొస్తే ఊరుకోం. రియాలిటీ షో నిర్వాహకులకు, అలాగే నాగార్జునకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాం అంటూ ఘాటుగా స్పందించారు.

సోషల్ మీడియాలో హాట్ టాపిక్ :

నిరుద్యోగులను నమ్మించి కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన ఇలాంటి క్రిమినల్స్ సమాజానికి ఏమి ఉద్దేశం, ఏ మెసేజ్ ఇస్తారని బిగ్ బాస్‌లోకి పంపిస్తున్నారు అంటూ ఘాటుగా ప్రశ్నించారు.

దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. కొందరేమో అలాంటి ఆవిడను బిగ్ బాస్‌లోకి పంపకూడదు అంటుంటే, మరికొందరు మాత్రం ఆమెపై ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ.. ఆమె తప్పు చేసిందని ఇంకా తేలలేదుగా, ఆమె హౌస్‌లోకి వస్తే మేము ఆమెకే ఓటేస్తామంటూ సోషల్ మీడియా వేదికగా రిప్లై ఇస్తున్నారు.ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఇష్యూ బాగా హాట్ టాపిక్‌గా మారింది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you