Allu Arjun:స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ , దేశవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) స్థాపించినప్పటి నుంచి ఏవో ఒక కార్యక్రమాలు చేస్తూ నిరంతరం వార్తలలో నిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి స్వస్ద్ నారి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా హెచ్ పివి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలలో 820 స్కూళ్లలో అవేర్నెస్ ఈవెంట్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మద్దతు అందించారు.
మహిళలలో అవేర్నెస్.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ పై ప్రశంసలు..
ఈ కార్యక్రమంలో సుమారుగా మూడు లక్షల మంది యువతులకు ఈ విషయం చేరువయ్యేలా చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక , అండమాన్ నికోబార్, ఐలాండ్స్ వంటి రాష్ట్రాలతో పాటూ కేంద్రప్రాలిత ప్రాంతాలలో కూడా ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. సామాజిక బాధ్యత కలిగిన అల్లు అర్జున్ అభిమానులంతా కూడా సమిష్టి కృషితో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ముఖ్యంగా హెచ్ పి వి వ్యాక్సినేషన్ పై బాలికలకు, యువతలకు ఆరోగ్యకరమైన భవితను అందించేలా తమ వంతు ప్రయత్నం చేయడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. అల్లు అర్జున్ అభిమానులు కూడా వీటికి సపోర్టు చేస్తూ వైరల్ చేస్తున్నారు.
also read:Mounika shiva:అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్..ఇప్పుడు హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన బ్యూటి..గుర్తుపట్టారా..?
అల్లు అర్జున్ సినిమాలు..
అల్లు అర్జున్(Allu Arjun) సినిమాలు విషయానికి వస్తే ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా అయినా రాకా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. అలాగే మరి కొంతమంది హీరోయిన్స్ కూడా నటిస్తున్నట్లు సమాచారం. తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పైన ఈ సినిమాని భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని అప్డేట్లు కూడా రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నుంచి పోస్టర్స్ విడుదల చేయగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో సినిమా పైన అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.
also read:Friday ott movies: ఓటీటీ రిలీజ్లు.. ఈ 6 సినిమాలు అస్సలు మిస్ అవ్వొద్దు
అల్లు అర్జున్ తదుపరి చిత్రాలు..
పుష్ప, పుష్ప 2 చిత్రాలతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు. ఇదే క్రేజ్ తోనే ఒకవైపు సేవా కార్యక్రమాలు చేస్తూనే.. మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. అంతేకాకుండా అప్పుడప్పుడు అభిమానులను కలవడం కోసం ప్రత్యేకించి మరి కలుస్తూ ఉంటారు. రాకా సినిమా పూర్తి అయిన తర్వాత డైరెక్టర్ సుకుమార్ తో పుష్ప 3 సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే విధంగా వినిపిస్తున్నాయి.
📌 HPV Awareness Program – Event Details
Date:September 8th, 2026
State Name: Andhra Pradesh
District Name: Srikakulam
Event Location: NarasannapetaAAFA Active Volunteers: Team AA Narasannapeta – Anil, Koushik, Devashish, Dilli, Lokesh, Nivas, Srinu, Siva, Vijay
Schools… pic.twitter.com/kUy4tyrzKf
— Allu Arjun Fans Association (@AAFAOnline) September 10, 2026




