Friday, September 11, 2026
HomeLATESTSamyuktha Menon:ఏకకాలంలో 6 చిత్రాలలో నటిస్తున్న స్టార్ హీరోయిన్.. ఆకట్టుకుంటున్న పోస్టర్స్!

Samyuktha Menon:ఏకకాలంలో 6 చిత్రాలలో నటిస్తున్న స్టార్ హీరోయిన్.. ఆకట్టుకుంటున్న పోస్టర్స్!

Samyuktha Menon: నేడు సంయుక్త మీనన్ పుట్టినరోజు కావడంతో ఆమె నటిస్తున్న చిత్రాల నుండి వరుస పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

on
- Advertisement -banner Ad

Samyuktha Menon:సాధారణంగా సెలబ్రిటీలు ఒక సినిమాలో నటిస్తున్నారు అంటే వారి పుట్టినరోజులు వచ్చినప్పుడు ఆయా చిత్రాలు.. వారి పాత్రలకు సంబంధించిన పోస్టర్లతో స్పెషల్ విషెస్ చెబుతారన్న విషయం అందరికీ తెలిసిందే. ఒక హీరో ఒకటి లేదా రెండు చిత్రాలతో ఒక ఏడాది ఆకట్టుకుంటే.. అటు హీరోయిన్లు కూడా దాదాపు రెండు , మూడు చిత్రాలతో అలరిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం ఏకంగా నాలుగైదు ప్రాజెక్ట్లను హ్యాండిల్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆయా చిత్రాల నుండి ఆమెకు అందిన స్పెషల్ విషెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక్క హీరోయిన్ ఇన్ని చిత్రాలలో ఇన్ని విభిన్నమైన పాత్రలు పోషించడం నిజంగా ఆశ్చర్యకరం అనే చెప్పాలి.

ఆమె ఎవరో కాదు సంయుక్తా మీనన్(Samyuktha Menon).. అందం, అభినయంతో ఆకట్టుకుంటూ ఇప్పుడు యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. నేడు అనగా సెప్టెంబర్ 11 సంయుక్త పుట్టినరోజు కావడంతో ఆమె నటిస్తున్న చిత్రాల నుండి ఆమెకు స్పెషల్ పోస్టర్లతో అద్భుతమైన విషెస్ లభించింది. మరి ఆమె నటిస్తున్న చిత్రాల వివరాలు ఇప్పుడు చూద్దాం..

- Advertisement -
Advertisement

స్వయంభు నుండి వీరనారీగా..

భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, సంయుక్త మీనన్ , నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం స్వయంభు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో నేడు సంయుక్త మీనన్ కి చిత్ర బృందం పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ .. ఆమె సినిమాలో తన పాత్ర కోసం కష్టపడుతున్న తీరుని , ఆమె పాత్రను పరిచయం చేస్తూ ఒక చిన్న టీజర్ విడుదల చేసింది. ఇందులో కత్తి పట్టి యుద్ధం చేస్తూ.. గుర్రపు స్వారీతో ఆకట్టుకుంటూ వీరనారి గెటప్ లో అందరి దృష్టిని ఆకట్టుకుంది సంయుక్త మీనన్..

also read:Allu Arjun:సామాజిక సేవలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్..!

- Advertisement -
Advertisement

 

View this post on Instagram

 

- Advertisement -
Advertisement

A post shared by Shreyas Media (@shreyasgroup)

స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ ఆన్ సెట్ నుండీ సంయుక్త లుక్..

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్ మూవీ లో సంయుక్త హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా షూటింగ్ సెట్ నుండి ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలను చిత్ర బృందం రిలీజ్ చేస్తూ ఆమెకు స్పెషల్ విషెస్ తెలియజేసింది.

also read:Mounika shiva:అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్..ఇప్పుడు హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన బ్యూటి..గుర్తుపట్టారా..?

 

View this post on Instagram

 

A post shared by Shreyas Media (@shreyasgroup)

Rapo 23 నుండి సింపుల్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న సంయుక్త..

రామ్ పోతినేని స్వీయ దర్శకత్వంలో రాబోతున్న సైకలాజికల్ యాక్షన్ చిత్రం రాపో 23. రామ్ పోతినేని వీర అనే పాత్ర పోషిస్తుండగా.. సంయుక్త హీరోయిన్గా నటిస్తోంది. కృష్ణ పోతినేని నిర్మాతగా రాపో సినిమాటిక్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం నుండి సంయుక్తకు స్పెషల్ విషెస్ లభించాయి. క్యూట్ లుక్స్ తో సింపుల్ స్మైల్ తో సంయుక్త ఆకట్టుకుంటారు.

 

View this post on Instagram

 

A post shared by Shreyas Media (@shreyasgroup)

ది బ్లాక్ గోల్డ్ నుండి పోలీసు ఆఫీసర్గా..

యోగేష్ కేఎంసి దర్శకత్వంలో హాస్య మూవీస్ పతాకం పై రాజేష్ దండ నిర్మిస్తున్న యాక్షన్ డ్రామా మూవీ ది బ్లాక్ గోల్డ్. ఈ చిత్రంలో సంయుక్త పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. ఇక పోలీస్ గెటప్ లో ఉన్న ఆమె పోస్టర్ను విడుదల చేస్తూ ది బ్లాక్ గోల్డ్ టీం ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.

 

View this post on Instagram

 

A post shared by Shreyas Media (@shreyasgroup)

హైందవ నుండి పవర్ఫుల్ లుక్..

సుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సంయుక్త హీరోయిన్గా రాబోతున్న చిత్రం హైందవ. యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ చిత్రంలో సంయుక్త ఒక పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. ఇక హైందవ టీం తరపున బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సంయుక్తాకు స్పెషల్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక ఈ చిత్రాలతో పాటు ఈమె రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న బెంజ్ చిత్రంలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఇలా మొత్తంగా ఓకే టైంలో 6 చిత్రాలలో నటిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంది సంయుక్త.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you