Sunday, September 13, 2026
HomeLATESTThe Paradise:నాని ప్యారడైజ్ సినిమా విషయంలో సంచలన నిర్ణయం..!

The Paradise:నాని ప్యారడైజ్ సినిమా విషయంలో సంచలన నిర్ణయం..!

The Paradise: నాని హీరోగా నటించిన ది పారడైజ్ సినిమాను ట్రైలర్ లేకుండా థియేట్రికల్ గా విడుదల చేయాలని నాని తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

on
- Advertisement -banner Ad

The Paradise:తెలుగు సినీ పరిశ్రమలో ఎటువంటి సపోర్టు లేకుండా సక్సెస్ అయిన హీరోలలో హీరో నాచురల్ స్టార్ నాని కూడా ఒకరు. ఎప్పుడూ కూడా విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నాని కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న చిత్రం ది ప్యారడైజ్(The Paradise). ఈ చిత్రాన్ని దసరా ఫేమ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా కయాదు లోహర్ నటిస్తోంది. స్పెషల్ సాంగ్ లో హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్, టీజర్ సినిమా పైన అంచనాలను పెంచేసాయి.

ట్రైలర్ లేకుండా నేరుగా థియేటర్లలో మూవీ..

అయితే టీజర్ రిలీజ్ అయిన సందర్భంలో కొంతమేరకు నెగిటివిటీ కూడా వచ్చింది . దీంతో చిత్ర బృందం సినిమా విడుదల విషయంపై ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేమిటంటే అసలు ట్రైలర్ రిలీజ్ చేయకుండా సినిమాని విడుదల చేయాలని హీరో నాని ప్రెస్ మీట్ వేదికగా తేల్చి చెప్పారు. సాధారణంగా పెద్ద చిత్రాలకు విడుదలకు ముందే ట్రైలర్ తోనే మంచి బిజ్ ఏర్పడడం జరుగుతుంది. కానీ ట్రైలర్ లేకుండా సినిమాని థియేటర్లో విడుదల చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రెస్ మీట్ లో సినిమా ట్రైలర్ గురించి మీడియా వారు ప్రశ్నలు అడగగా నాని ఈ విధంగా స్పష్టత ఇచ్చారు.

- Advertisement -
Advertisement

also read:Namitha:మహిళల నిబంధనలపై.. నమిత షాకింగ్ కామెంట్స్..!

అందుకే ట్రైలర్ విడుదల చేయడం లేదు..

అసలు ఈ నిర్ణయం వెనక ఉన్న కారణాన్ని కూడా తెలుపుతూ ఇది ఏ మాత్రం ప్రేక్షకుల ఆదరణను గ్రాంటెడ్ గా తీసుకొని చేయడం కాదు. ఈ సినిమా పైన ఉన్న విపరీతమైన నమ్మకం.. ఇది చూసి చాలా గర్వంగా తీసుకున్న నిర్ణయం కాదని .. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అవుట్ పుట్ కోసం టీమ్ చాలా శ్రమిస్తోందని, ఫాన్స్ కి ఒక అదిరిపోయే ట్రైలర్ కట్ చేసి ఇవ్వాలి అంటే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల , సంగీత దర్శకుడు అనిరుద్ సహ చాలామంది కీలక సాంకేతిక నిపుణులు అంతా కూడా సుమారుగా నాలుగు ఐదు రోజులపాటు పనిచేయవలసి ఉంటుంది. దీంతో తాము చేస్తున్న పనులన్నీ కూడా పక్కన పెట్టాల్సి ఉంటుందని తెలిపారు నాని.

- Advertisement -
Advertisement

also read:Bigg Boss :చైత్ర ఎలిమినేషన్‌తో బిగ్ బాస్ హౌస్‌లో కొత్త చర్చ.. అసలేం జరిగింది?

నాని నిర్ణయం సరైనదేనా?

అందుకే సినిమా ట్రైలర్ కంటే సినిమానే ముఖ్యం కాబట్టి తప్పని పరిస్థితులలో ట్రైలర్ తీసుకురాకూడదని చిత్ర బృందం నిర్ణయించుకున్నట్లు తెలియజేశారు నాని. ప్యారడైజ్ చిత్రాన్ని ఇతర భాషలలో కూడా అత్యుత్తమ నాణ్యతతో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో నాని నటించిన చిత్రాలకు అనుసరించిన విధానాన్ని ప్యారడైజ్ సినిమా విషయంలో పాటిస్తున్నామంటూ తెలియజేశారు. డబ్బింగ్ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా చూసుకుంటున్నానని తెలిపారు. మరి నాని తీసుకున్న ఈ నిర్ణయం సినిమాకి ఏ విధంగా ప్లస్ అవుతుందో చూడాలి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you