Monday, September 14, 2026
HomeLATESTPawan–Mahesh:అజిత్-విజయ్ లాగా.. మహేష్-పవన్‌ చేయలేరా..? ఎందుకు..?

Pawan–Mahesh:అజిత్-విజయ్ లాగా.. మహేష్-పవన్‌ చేయలేరా..? ఎందుకు..?

Pawan–Mahesh:విజయ్, అజిత్ ఆత్మీయంగా కలుసుకుని హగ్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

on
- Advertisement -banner Ad

Pawan–Mahesh:ఇప్పుడు ఎక్కడ చూసిన సరే అంతా విజయ్, అజిత్ గురించే మాట్లాదుకుంటున్నారు. దీనికి కారణం ఓ వీడియో. ఆ వీడియో లో ఒకరినొకరు కలుసుకుని ఆత్మీయంగా హగ్ చేసుకున్న విజువల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ప్రభావం మన తెలుగు ఇండస్ట్రీ పై కూడా పడింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు తెలుగు స్టార్స్ పవన్, మహేశ్ లని గుర్తు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్, మహేష్ బాబు (Pawan–Mahesh)పేర్లు ఒక్కసారిగా ట్రెండ్ అయ్యాయి. విజయ్–అజిత్‌లా పవన్, మహేష్ కూడా ఎప్పుడు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తారనే చర్చ మొదలైంది.

‘జల్సా’తో మొదలైన స్పెషల్ కనెక్షన్ :

పవన్ కల్యాణ్, మహేష్ బాబు మధ్య సినిమా పరంగా అనుబంధం కొత్తది కాదు. 2008లో విడుదలైన ‘జల్సా’ సినిమాలో పవన్ పాత్రను పరిచయం చేసే సమయంలో మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించారు. సంజయ్ సాహు పాత్ర ఎంట్రీకి ముందు మహేష్ గొంతు వినిపించడం అప్పట్లో ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని కలిగించింది. మరోవైపు మహేష్ కెరీర్ ప్రారంభ దశలో జరిగిన ‘యువరాజు’ సినిమా ప్రారంభోత్సవానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు.

- Advertisement -
Advertisement

ఒకే వేదికపై కనిపించడం మాత్రం అరుదు :

ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉన్నప్పటికీ కెమెరా ముందు కలిసి కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. పవన్ కల్యాణ్ మొదటి నుంచే సినిమా ఈవెంట్లకు తరచుగా హాజరయ్యే హీరో కాదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన సినిమా కార్యక్రమాల్లో కనిపించడం మరింత తగ్గింది. మహేష్ బాబు కూడా ఇతర హీరోల సినిమా వేడుకలకు రెగ్యులర్‌గా వెళ్లరు. దీంతో ఆడియో ఫంక్షన్లు, ప్రీరిలీజ్ ఈవెంట్లు, అవార్డు వేడుకల్లో ఇద్దరూ ఒకేసారి కనిపించడం చాలా అరుదుగా మారింది.

ALSO READ:Vishnu Priya:నటన నుంచి బిజినెస్ వరకు.. జానకి పరిణయం విష్ణు ప్రియ సక్సెస్ స్టోరీ..!

- Advertisement -
Advertisement

‘మేము సైతం’ కార్యక్రమంపైనా అప్పట్లో ఆసక్తి :

2014లో హుద్‌హుద్ తుపాను బాధితుల సహాయార్థం టాలీవుడ్ నిర్వహించిన ‘మేము సైతం’ కార్యక్రమానికి పవన్, మహేష్ ఇద్దరూ హాజరవుతారనే ప్రచారం జరిగింది. నవంబర్ 30న అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో చివరకు ఇద్దరూ పాల్గొనలేదు.

ALSO READ:Chiranjeevi:నాలుగు రోజుల గ్యాప్‌లో చిరంజీవి రెండు సినిమాలా? ఇదే అసలు ట్విస్ట్!

- Advertisement -
Advertisement

ఒకరి సినిమాలను మరొకరు ప్రశంసించిన సందర్భాలు :

కలిసి కనిపించకపోయినా, ఒకరి సినిమాలు, విజయాలపై మరొకరు సానుకూలంగా స్పందించిన సందర్భాలు ఉన్నాయి. ‘వకీల్ సాబ్’ విడుదలైన సమయంలో మహేష్ బాబు పవన్ నటనను ప్రశంసించారు. పవన్ ఎన్నికల్లో విజయం సాధించిన సమయంలో కూడా మహేష్ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇలా మాటల్లో, సినిమాల విషయంలో ఇద్దరి మధ్య ఉన్న కనెక్షన్ ఇప్పటికే పలుమార్లు కనిపించింది. ఇప్పుడు విజయ్–అజిత్ వైరల్ మూమెంట్ తర్వాత అభిమానుల కోరిక మాత్రం ఒక్కటే—పవన్ కల్యాణ్, మహేష్ బాబు ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించే ఆ స్పెషల్ మూమెంట్ ఎప్పుడు వస్తుందా?

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you