Supriya Yarlagadda:ప్రస్తుతం ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో సినీ ప్రముఖులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లే కనిపిస్తున్నాయి. చాలామంది సినీ ప్రముఖులకు, సినీ ప్రముఖుల కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులకు ఈ మధ్యకాలంలో పదవులు రావడం.. అవి సోషల్ మీడియా వేదికగా మనం వింటూనే వచ్చాం.
అయితే ఇప్పుడు తాజాగా ఆ లిస్టులోకి యాడ్ అయిపోయింది అక్కినేని నాగార్జున మేనకోడలు, సినీ నిర్మాత సుప్రియ యార్లగడ్డ. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’తో హీరోయిన్గా ఎంట్రీ :
సుప్రియ యార్లగడ్డ (Supriya Yarlagadda)పవన్ కళ్యాణ్ తొలి చిత్రమైన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో హీరోయిన్గా నటించారు. ఈ సినిమా 1996లో రిలీజ్ అయింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. హీరోయిన్గా కూడా మంచి మార్కులు పడ్డాయి. కానీ ఆ తర్వాత ఎందుకు ఆమె సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు.
కొన్నేళ్లు నటనకు దూరంగా ఉన్న ఆమె తిరిగి 2018లో అడవి శేష్ నటించిన ‘గూఢచారి’ సినిమాలో నటించారు. పాత్ర చిన్నది అయినా ఆమె పర్ఫార్మెన్స్ మాత్రం ఆకట్టుకుంది. ఇప్పుడు దాని సీక్వెల్ ‘గూఢచారి 2’లో కూడా నటిస్తున్నారు.
ALSO READ:Hero Karthikeya:హీరో కార్తికేయ డైరెక్టర్‌గా ఎంట్రీ.. తొలి సినిమాతోనే భారీ సర్ప్రైజ్!
నిర్మాతగా సుప్రియ యార్లగడ్డ :
నటిగా కొనసాగుతూనే ఆమె పలు సినిమాలకు నిర్మాతగా కూడా మారారు. మంచి మంచి సినిమాలను నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా బిజీబిజీగా పనులు చేస్తూ సంస్థను ముందుకు తీసుకెళ్తూ ఉంటారు.
ALSO READ:TV:గురువారం బుల్లితెరపై..టీవీ సినిమాలు!
సుప్రియకు స్పెషల్ పదవి :
అలాంటి సుప్రియకు ఇప్పుడు స్పెషల్ పదవిని ఇచ్చారు ప్రభుత్వం. తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) బోర్డులో సభ్యురాలిగా నియమించారు.
2017లో 12 మంది సభ్యులతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ బోర్డును కేంద్ర ప్రభుత్వం లాంఛనంగా నియమించింది. అప్పటి సభ్యుల పదవీకాలం ముగిసినప్పటికీ తిరిగి వెంటనే భర్తీ చేయలేకపోయారు. ఇప్పుడు బోర్డులో సభ్యుల సంఖ్యను 18కి పెంచుతూ కొత్త బోర్డులో ప్రముఖులను యాడ్ చేశారు.
కొత్త బోర్డులో పలువురు ప్రముఖులు :
ఈ లిస్టులో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, అదేవిధంగా గ్రామీ అవార్డు విజేత రిక్కీ కేసు, నటుడు మనోజ్ జోషి, బెంగాలీ యాక్టర్ ప్రసంజిత్ చటర్జీ, టెలివిజన్ నటి రూపా గంగూలీలకు చోటు కల్పించారు. వీరితో పాటు మరికొంతమందికి కూడా చోటు కల్పించారు. వాళ్లలో సుప్రియ యార్లగడ్డ కూడా ఉన్నారు.
దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు వెల్లువ మొదలైంది. సుప్రియ యార్లగడ్డ చాలా టాలెంటెడ్ అని, కచ్చితంగా తన పదవికి న్యాయం చేస్తారని, ఇంకా పెద్ద పదవులకు చేరుకుంటారని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.




